బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్ట్ చేసిన ‘ఆదిపురుష్’ గతేడాది జూన్ 16న విడుదలై డిజాస్టర్ అ్యియన సంగతి తెలిసిందే. రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణాసురుడుగా సైఫ్ అలీఖాన్ నటించారు. టి సిరీస్-రెట్రోఫైల్స్ సంయుక్త నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తీశారు. తెలుగు, హిందీ, తమిళ, మళయాళ, కన్నడ భాషల్లో రిలీజైన ఈ సినిమాను దాదాపుగా 103 రోజులపాటు షూట్ చేశారు. అయితే అనుకున్నట్లుగా ఈ సినిమా సక్సెస్ ని అందుకోలేకపోయింది. దాంతో ఈ సినిమాపై విపరీతమైన ట్రోలింగ్, విమర్శలు వచ్చాయి. అయితే ఆ తర్వాత చిత్ర రచయిత తప్ప వేరే టీమ్ లో ఎవరూ ఈ సినిమా గురించి పెద్దగా మాట్లాడలేదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో నటి కృతిసనన్ (Kriti Sanon) స్పందించారు.
కృతి మాట్లాడుతూ.. ఆ సినిమా విజయాన్ని అందుకుంటుందని భావించానని.. అలా జరగకపోవడం తనను బాధించిందని తెలిపారు. ‘‘మనం నటించిన సినిమా ఏదైనా విజయం సాధించనప్పుడు తీవ్ర కుంగుబాటుకు లోనవుతాం. ఆ బాధను తట్టుకోలేక కొన్నిసార్లు ఏడ్చేస్తాం కూడా. ఎక్కడ ఏం తప్పు జరిగిందోనని ఆలోచిస్తాం. ఎదుటివారి విశ్వాసాలు, మనోభావాలను దెబ్బతీయడం మా లక్ష్యం కాదు. ప్రతి ప్రాజెక్ట్‌ను మంచి ఉద్దేశంతోనే తెరకెక్కిస్తాం. అయితే, కొన్నిసార్లు అది ఇతరులకు నచ్చకపోవచ్చు. ఇలాంటి సంఘటనల నుంచి ఎన్నో అనుభవాలు నేర్చుకోవాలి ’’అన్నారు.
Adipurush
అలాగే ‘‘ఒక నటిగా ఆ ఫలితం నుంచి ఎన్నో విషయాలు తెలుసుకుని భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా ఇతర ప్రాజెక్టులపై దృష్టి సారించాలని నిర్ణయించుకున్నా. ఒక సినిమా సక్సెస్‌కు ఎన్నో అంశాలు దోహదపడతాయి. అవి ఎప్పటికీ నా ఒక్కదాని చేతిలో ఉండవు. నా పాత్రకు సరైన న్యాయం చేశానా? లేదా? అనే ఒక్క విషయం మాత్రమే నా చేతిలో ఉంటుంది. అందుకనుగుణంగా నా పాత్ర కోసం శ్రమిస్తా’’ అని కృతి చెప్పారు. ఆమె చేసిన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఈ మూవీలో లంకేశ్ (రావణాసురుడు) గా నటించిన సైఫ్ అలీఖాన్ లుక్‌పై అనేక విమర్శలు వచ్చాయి. కాగా ఈ సినిమా డిజాస్టర్‌పై ఆ నటుడు మొదటిసారి స్పందించారు. ‘కొన్ని సినిమాలు చేసేటపుడు రిస్క్ చేయాలి..ఓటమిని ఎదుర్కోవాలి..నా పేరెంట్స్ పెద్ద స్టార్స్ అయినా సింపుల్‌గా ఉండేవారు. వారిలాగే నేను పెద్ద స్టార్ అని ఫీల్ అవను. వాస్తవంలో బతుకుతాను. ఆదిపురుష్ వంటి సినిమా ఫెయిల్ అయినంత మాత్రాన ఓటమితో భయపడను..ఒక్కోసారి చేసే ప్రయత్నాలు విఫలమైనపుడు అధైర్య పడకూడదు.. నెక్ట్స్ సినిమాలో చూసుకుందామని ముందుకు సాగాలి.. నేను అదే ఫాలో అవుతానని’ సైఫ్ అలీఖాన్ చెప్పారు.
ప్రభాస్ కీలక పాత్రలో ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథలాజికల్ ఫిల్మ్ ‘ఆది పురుష్’ (Adipurush). ప్రభాస్ రాఘవగా, జానకి పాత్రలో కృతిసనన్, లంకేష్‌గా సైఫ్ అలీ ఖాన్ నటించారు. గతేడాది జూన్‌లో విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. ఇందులోని పలు సన్నివేశాలు తమ మనోభావాలను దెబ్బతీశాయంటూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
బిజయ్ ఆనంద్ ఆదిపురుష్ లో బ్రహ్మ పాత్రలో కనిపించారు. బిజయ్ ఆనంద్ ఆదిపురుష్ ట్రోల్స్ పై స్పందించారు. జయ్ ఆనంద్ మాట్లాడుతూ.. కళని విమర్శించడం మంచి పద్ధతి కాదు. సినిమా నచ్చకపోతే చూడటం మానేయాలి కానీ విమర్శించడానికి మీరు ఎవరు? ఒక కళాకారుడు తనకు నచ్చినట్టు కళని రూపొందిస్తాడు. దాని కోసం డబ్బు, సమయం, తన కష్టం అంతా పెడతాడు. 600 కోట్లు ఖర్చు చేసి ఓం రౌత్ సినిమా తీసాడంటే అది అతని ఇష్టం. మీకు నచ్చితే చూడండి, నచ్చకపోతే చూడకండి. అంతేకాని అతన్ని విమర్శించడానికి మీరెవరు. కళ మంచిదా, చెడ్డదా అని మీరు చెప్తే అయిపోదు. కొంతమంది కళాకారులను భయపెడుతున్నారు. ఓం రౌత్ ని అలాగే భయపెట్టారు. కానీ ఓం రౌత్ భయపడకుండా, ట్రోల్స్ ని పట్టించుకోకుండా ఉన్నాడు. అందుకే అతను నాకు ఇష్టం అని అన్నాడు. దీంతో బిజయ్ ఆనంద్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.