జూనియర్ ఎన్టీఆర్ ని బాధపెట్టిన సినిమా, తారక్ ఆ మూవీ ఎందుకు చేయలేదంటే?

Published : Feb 16, 2026, 01:51 PM IST

 యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఆయన్ను బాగా బాధపెట్టిన సినిమా ఏదో తెలుసా? ఎందుకు చేయలేకపోయాను అని ఇబ్బందిపడ్డిన బ్లాక్ బస్టర్ మూవీ పేరేంటి. తారక్ ఎందుకు ఆ సినిమాను వదలుకోవలసి వచ్చిందంటే? 

PREV
15
సినిమాలు మిస్ అవ్వడం కామన్..

ఫిల్మ్ ఇండస్ట్రీలో చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకూ కొన్ని సినిమాలు మిస్ అవ్వడం కామన్. కథ నచ్చకపోవడం, తమ ఇమేజ్ కు సెట్ అవ్వకపోవడం, ఇతర కారణాల వల్ల చాలా కథలను వారు రిజెక్ట్ చేస్తుంటారు. తెలుగు పరిశ్రమలో కూడా స్టార్ హీరోలు చాలా మంది హీరోలు ఇలానే బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను మిస్ అయిన సందర్బాలు ఎన్నో ఉన్నాయి. 

అర్జున్ రెడ్డి సినిమాను అల్లు అర్జున్ మిస్ అయ్యాడు. అతడు సినిమాను ఉదయ్ కిరణ్ మిస్ అయ్యాడు.. ఇలా చాలా సినిమాలను స్టార్ హీరోలు వదిలేసుకున్నారు. ఈక్రమంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా కొన్ని సినిమాలు వదిలేసుకోవలసి వచ్చింది.

25
జూనియర్ ఎన్టీఆర్ వదలుకున్న బ్లాక్ బస్టర్ మూవీ..

ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా హవా చూపిస్తోన్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆయన కెరీర్ లో ఎన్నో ఫెయిల్యూర్స్, మరెన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చేశాడు. అయితే కొన్ని కథలు తారక్ దగ్గరకు వెళ్లినప్పుడు రకరకాల కారణాల వల్ల అవి రిజెక్ట్ చేయడం జరిగింది. అందులో కొన్ని కథలు తారక్ కు నచ్చినా కానీ.. వాటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. 

మరికొన్ని సినిమాలు ఇతర హీరోలకు సూట్ అవుతాయని.. వారికి రికమండ్ చేశారు ఎన్టీఆర్. ఆయన చేయకుండా వదిలేసిన హిట్ సినిమాల్లో పటాస్ తో పాటు బొమ్మరిల్లు మూవీ కూడా ఉంది. పటాస్ సినిమా కథ విన్న తారక్. ఈ సినిమా కథ తనకు సూట్ అవ్వదని.. అన్న కళ్యాణ్ రామ్ తో చేయమని చెప్పారట.

35
తారక్ ను బాధపెట్టిన సినిమా..

ఇక జూనియర్ ఎన్టీఆర్ కు కథ నచ్చి వదిలేసుకున్న సినిమాల్లో బొమ్మరిల్లు సినిమా ఒకటి. ఈ సినిమా కథ తారక్ కు బాగా నచ్చింది. కానీ ఆ పాత్ర తన ఇమేజ్ కు కరెక్ట్ కాదు అని ఎన్టీఆర్ అభిప్రాయం. తాను చేస్తే ఈ సినిమా హిట్ అవ్వదు.. అని నమ్మకం. ఒక మాస్ హీరో.. మరీ ఇంత క్లాస్ క్యారెక్టర్ లో కనిపిస్తే.. అభిమానులు తీసుకోలేరు అని జూనియర్ కు అనిపించింది. అందుకే దిల్ రాజు ఈ కథను తన కు వివరించినప్పుడు.. చాలా బాగుంది అని చెప్పారట. కానీ అతి తన ఇమేజ్ కు సరైంది కాదు అని చెప్పి రిజెక్ట్ చేశారట. అంతే కాదు ఆ కథను చేయలేకపోతున్నందకు ఎన్టీఆర్ చాలా బాధపడ్డారట కూడా. ఈ విషయాన్ని రీసెంట్ గా ఓఇంటర్వ్యూలో ప్రస్తావించాడు తారక్.

45
బ్లాక్ బస్టర్ హిట్ అయిన బొమ్మరిల్లు..

బొమ్మరిల్లు సినిమాను ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన తరువాత.. తమిల యంగ్ హీరో సిద్థార్త్ తో ఈమూవిని తెరకెక్కించారు. భాస్కర్ డైరక్ట్ చేసిన ఈమూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈసినిమాతోనే డైరెక్టర్ భాస్కర్ కాస్తా..బొమ్మరిల్లు భాస్కర్ అయిపోయాడు. విలన్ లేడు, యాక్షన్ సీక్వెన్స్ లు లేవు, ఓన్లీ లవ్ అండ్ ఎమోషన్స్ తోనే సినిమా అంతటిని నడిపించారు.

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో.. తండ్రి అతి ప్రేమ వల్ల కొడుకు పడే బాధను అద్భుతంగా చూపించారు. అది అందరికి కనెక్ట్ అయ్యింది. యూత్ ఆడియన్స్స్ ఈసినిమాకు బ్రహ్మరథం పట్టారు.

55
ఎన్టీఆర్ సినిమాల కబుర్లు..

ఇక సినిమాల విషయానికి వస్తే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో డ్రాగన్ మూవీ బిజీలో ఉన్నాడు. ఈసినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గట్టిగా కొట్టడానికి రెడీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ దేవర 2 ను స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.

Read more Photos on
click me!

Recommended Stories