Lakshmi Pranathi: కోటీశ్వరుడి కూతురు.. స్టార్ హీరో భార్య, లైమ్‌లైట్‌కు దూరంగా సింపుల్ లైఫ్..

Published : May 22, 2026, 09:26 AM IST

జూ.ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి, భర్తకు అంత పెద్ద స్టార్‌డమ్ ఉన్నా ఎప్పుడూ లైమ్‌లైట్‌కు దూరంగా ఉంటారు. ప్రైవేట్ లైఫ్‌ను ఇష్టపడే ఆమె, ఓ వ్యాపారవేత్త కుటుంబం నుంచి వచ్చారు. తన పిల్లలతో కలిసి సింపుల్ లైఫ్ గడుపుతున్నారు.

PREV
15
లైమ్‌లైట్‌కు దూరంగా లక్ష్మీ ప్రణతి

జూ.ఎన్టీఆర్  పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నాడు.  కానీ ఆయన భార్య లక్ష్మీ ప్రణతి మాత్రం ఎప్పుడూ లైమ్‌లైట్‌కు దూరంగా ఉంటారు. ఇతర సెలబ్రిటీల భార్యల్లా ఆమె పబ్లిక్‌గా కనిపించడం, ఇంటర్వ్యూలు ఇవ్వడం చాలా అరుదు. అందుకే, ఈ స్టార్ హీరో సక్సెస్ వెనుక ఉన్న ఆమె గురించి అభిమానులకు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటుంది.

25
పబ్లిసిటీకి దూరంగా

లక్ష్మీ ప్రణతి ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త కుటుంబం నుంచి వచ్చారు. ఆమె త్రండి  ప్రముఖ వ్యాపారవేత్త నార్నె శ్రీనివాసరావు . ఆయన  పలు వ్యాపార, మీడియా సంస్థలను నడుపుతున్నారు. ఇంత పెద్ద బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ, ప్రణతి చాలా సింపుల్ లైఫ్‌స్టైల్ పాటిస్తూ, పబ్లిసిటీకి దూరంగా ఉంటారు.

35
ఎన్టీఆర్‌ ‌-లక్ష్మీ ప్రణతి పెళ్లై 15 ఏళ్లు..
లక్ష్మీ ప్రణతి, జూ.ఎన్టీఆర్‌ను మే 2011లో వివాహం చేసుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు సినీ తారలు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు హాజరయ్యారు. ఇరు కుటుంబాలు నిశ్చయించిన ఈ పెళ్లి, ఆ సమయంలో సౌత్ ఇండియాలో అత్యంత చర్చనీయాంశమైన సెలబ్రిటీ వివాహాల్లో ఒకటిగా నిలిచింది.
45
సోషల్ మీడియా కల్చర్‌కు దూరంగా
సూపర్‌స్టార్ భార్య అయ్యాక కూడా లక్ష్మీ ప్రణతి సినిమా, మీడియా, సోషల్ మీడియా కల్చర్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆమె ఎక్కువగా కుటుంబ కార్యక్రమాలు, ప్రైవేట్ ఫంక్షన్లు లేదా జూ.ఎన్టీఆర్, పిల్లలతో కలిసి ట్రిప్స్‌లో మాత్రమే కనిపిస్తారు. నిరంతరం మీడియా అటెన్షన్ ఉన్నప్పటికీ, ఆమె తన ప్రైవసీని కాపాడుకోవడం, సింపుల్‌గా ఉండటాన్ని అభిమానులు మెచ్చుకుంటారు.
55
తారక్ కు తెర వెనుక సైలెంట్ సపోర్ట్‌

లక్ష్మీ ప్రణతి, జూ.ఎన్టీఆర్ దంపతులకు అభయ్ రామ్, భార్గవ్ రామ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎన్టీఆర్ అప్పుడప్పుడు తన ఫ్యామిలీ ఫోటోలను ఆన్‌లైన్‌లో షేర్ చేస్తుంటారు. ఇవి వారి పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన అరుదైన విశేషాలను అభిమానులకు అందిస్తాయి. ఇటీవల, ఎన్టీఆర్ 'డ్రాగన్' పాత్ర కోసం తన మేకోవర్ గురించి చర్చ జరిగినప్పుడు, ప్రణతిపై మళ్లీ ఆసక్తి పెరిగింది. తెర వెనుక ఆమె ఇచ్చే సైలెంట్ సపోర్ట్‌ను అభిమానులు మెచ్చుకుంటున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories