బాహుబలి నుంచి ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్న రెంబల్ స్టార్ కొన్ని సినిమాలు చేసి.. తన కెరీర్ ను ఇబ్బందుల్లో పడేసుకున్నాడు. ప్రభాస్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసిన మూడు సినిమాలేంటో తెలుసా?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్‌గా వెలుగు వెలిగిన ప్రభాస్.. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ప్రత్యేకమైన క్రేజ్‌ను సంపాదించుకున్నారు. ఆయన కెరీర్‌లో సాధించిన విజయాలు దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించిపెట్టాయి. ముఖ్యంగా బాహుబలి, బాహుబలి 2, సినిమాల విజయాలతో ప్రభాస్ ఓవర్‌నైట్‌లో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు. అప్పటి నుంచి విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.
26
ప్రభాస్ ఇమేజ్ డ్యామేజ్ చేసిన మూడు సినిమాలు..
అయితే ప్రభాస్ కెరీర్‌లో కొన్ని సినిమాలు మాత్రం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేశాయి. భారీ అంచనాలతో.. అద్భుతాలు చేస్తాయని అనుకున్న మూవీస్ బాక్సాఫీస్ దగ్గర అనుకున్న రిజెల్ట్ ను సాధింకపోగా.. ప్రభాస్ ఇమేజ్‌పై కూడా ప్రభావం చూపించాయి. ఆ మూడు సినిమాలు చేయకుండా ఉండి ఉంటే బాగుండేది అని అభిమానులు ఇప్పటికీ బాధపడుతున్నారు.
36
డిజాస్టర్ గా నిలిచిన రాజాసాబ్..
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చి తీవ్ర నిరాశపరిచింది రాజాసాబ్. భారీ అంచనాలు సృష్టించిన ఈ మూవీ పక్కాగా హిట్ అవుతుందని అంతా అనుకున్నారు. డైరెక్టర్ మారుతీ కూడా ఈ మూవీ హిట్ అవ్వకపోతే నా ఇంటికి రండి అని అడ్రెస్ కూడా ఇచ్చాడు. కానీ రాజాసాబ్, కథ, స్క్రీన్ ప్లే దారుణంగా ఉండటం, ప్రభాస్ ను ఆ పాత్రలో జనం చూడలేకపోయారు. అభిమానులైతే కోపంతో ఊగిపోయారు. డైరెక్టర్ మారుతీ.. ప్రభాస్‌ను డిఫరెంట్ గా చూపించాలని ప్రయత్నం చేశారు. అయితే సినిమాలో కొన్ని సన్నివేశాల్లో ప్రభాస్ పాత్రను భయపడే స్వభావంతో చూపించడం అభిమానులకు అంతగా నచ్చలేదని సోషల్ మీడియాలో చర్చ జరిగింది.
ప్రభాస్ కెరీర్ ను ఇబ్బంది పెట్టిన మరో సినిమా ఆదిపురుష్. ఈ సినిమా రిలీజ్ తరువాత భారీ స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన Om Raut ప్రభాస్‌ను సరిగా ప్రెజెంట్ చేయలేకపోయారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం విజువల్స్, డైలాగ్స్, కథనంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ సినిమా చేయకపోయినా బాగుండేదని అభిమానులు కామెంట్లు చేసిన పరిస్థితి కనిపించింది.
56
ప్రభాస్ కు కొత్త ఇమేజ్ ఇవ్వాలని..
ఇక ప్రభాస్‌కు క్లాస్ లుక్‌లో కొత్త ఇమేజ్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో తెరకెక్కిన రాధేశ్యామ్ కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కానీ పైన చెప్పిన రెండు సినిమాల కంటే ఈమూవీ కాస్త బెటర్. అందమైన ప్రేమ కథను డైరెక్టర్ రాధాకృష్ణ అద్భుతంగా తెరకెక్కించాడు. కానీ ప్రభాస్ ఇమేజ్ కు ఈ కథ ఏమాత్రం సూట్ అవ్వలేదు. ఆరడుగుల యాక్షన్ హీరోని కంప్లీట్ గా ఓ ప్రేమికుడిలా చూపించడం.. ఆస్ట్రాలజర్ పాత్రలో చూపిండం అభిమానులు తీసుకోలేకపోయారు.
66
భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి..
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కథనం, స్క్రీన్‌ప్లే విషయంలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ మూడు సినిమాలు మీడియం రేంజ్ హీరోలతో చేసి ఉంటే బాగుండేది.. లోకల్ కథలను పాన్ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తే ఫలితం ఇలానే ఉంటుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.