ఇండియన్ ఫస్ట్ లేడీ సూపర్ స్టార్‌గా పేరుతెచ్చుకున్న శ్రీదేవి..తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ చిత్రాల్లో అనేక సినిమాలు చేసింది. తిరుగులేని స్టార్ గా నిలచింది. అందంలో ఐకానిక్‌గా పేరుతెచ్చుకుంది. అనేక శక్తివంతమైన పాత్రలు చేసింది. గ్లామర్ రోల్స్ చేసింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతోనూ అలరించింది. ఆమె 2018లో దుబాయ్‌లో కన్నుమూసిన విషయం తెలిసిందే. బాత్ టబ్‌లో కాలు జారి చనిపోయినా, ఆమె మరణం ఓ మూలన ఇంకా అనుమానాస్పదమే. నేడు శ్రీదేవి జయంతి. ఈ సందర్భంగా జాన్వీ తల్లిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.