Bigg Boss Telugu 8: ఇప్పటి వరకు కన్ఫమ్‌ అయిన కంటెస్టెంట్స్‌ వీళ్లే.. ఆ క్రేజీ స్టార్స్ అంతా వెయిటింగ్‌..

First Published | Aug 13, 2024, 12:06 PM IST

బిగ్‌ బాస్‌ 8 షోకి సంబంధించి రోజుకో అప్‌డేట్‌ క్యూరియాసిటీని కలగజేస్తుంది. తాజాగా ఈ సారి ఫైనల్‌ అయ్యింది వీళ్లే అని మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.  
 

బిగ్‌ బాస్‌ షో ఇండియాలోనే బాగా పాపులారిటీని సొంతం చేసుకున్న రియాలిటీ షో. కొంత మంది సెలబ్రిటీలను ఒక రూమ్‌లో ఉంచి వాళ్లు నిజ స్వరూపాలను, వాళ్ల యాక్టివిటీన్‌ని కెమెరాల ద్వారా చూడటమనేది ఆసక్తికరంగా అనిపించే హైలైట్‌ పాయింట్‌. ఇదే ఈ షో ప్రత్యేకత. ప్రస్తుతం ఐదు భాషల్లో ఈ షో రన్‌ అవుతుంది. హిందీలో మొదట ప్రారంభం కాగా, ఆ తర్వాత సౌత్‌ స్టేట్స్ లో దీన్ని పరిచయం చేశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలోనూ ఈ షో రన్‌ అవుతుంది. 
 

తెలుగులో ఇప్పటి వరకు ఏడు సీజన్లు పూర్తయ్యాయి. ఇప్పుడు బిగ్‌ బాస్‌ ఎనిమిదో సీజన్‌ ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం కంటెస్టెంట్ల ఎంపిక జరుగుతుంది. మరో వారంలో ఈ ఎంపిక పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో ఈ సారి ఎవరు రాబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే చాలా మంది పేర్లు బయటకు వచ్చాయి. వీళ్లు వెళ్తున్నారు, వాళ్లు వెళ్తున్నారని అంటున్నారు గానీ, ఎవరు పక్కాగా వెళ్తున్నారనేది తెలియదు. 


అయితే తాజాగా లేటెస్ట్ సమాచారం మేరకు, అందుతున్న సోర్స్ ప్రకారం కొంత మంది పేర్లు కన్ఫమ్‌ అయినట్టు తెలుస్తుంది. ఇప్పటికే కన్ఫమ్‌ అయిన వారిలో పాపులర్‌ యూట్యూబర్‌ కాకినాడ పిల్ల ఉంది. ఆమె ఆల్‌రెడీ ఫైనల్‌ అయ్యిందట. ఎగ్జామ్‌, ఇంటర్వ్యూ కంప్లీట్‌ కావడమే కాదు, ఆమెకి అధికారికంగానూ బిగ్‌ బాస్‌ టీమ్‌ చెప్పేసినట్టు తెలుస్తుంది.

 ఆమెతోపాటు సోషల్‌ మీడియాలో హాట్‌ బాంబ్‌.. రీతూ చౌదరి కూడా ఫైనల్‌ అయ్యిందట. సోషల్‌ మీడియాలో గ్లామర్‌ షోతో దుమ్ములేపే ఈ భామ ఇప్పటికే జబర్దస్త్ తోపాటు `దావత్‌` అనే షోకి యాంకర్ గా చేసింది. ఇప్పుడు `కిర్రాక్‌ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్` షో చేస్తుంది. ఈ అమ్మడు కూడా ఫైనల్‌ అయ్యిందని సమాచారం. 

రీతూ చౌదరీతోపాటు మరో హాట్‌ లేడీ రాబోతుందట. ఆమె ఎవరో కాదు విష్ణుప్రియా. రీతూ చౌదరీ లాగానే ఇంటర్నెట్‌లో అందాల దుమారం రేపే ఈ భామ ఈ సారి బిగ్‌ బాస్‌లోకి వస్తుందని, ఈమె కూడా కన్ఫమ్‌ అయ్యిందని టాక్‌. ఈ సారి షోలో గ్లామర్‌ ట్రీట్‌ ఇచ్చేందుకు ఈ భామలను బిగ్‌ బాస్‌ టీమ్‌ ఎంపిక చేసిందట. అదే సమయంలో చాలా యాక్టివ్‌గా ఉంటారు, చాలా కంటెంట్‌ ఇస్తుంటారు. సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ బాగా ఉంటుంది. అందుకే ఈ ఇద్దరిని ఫైనల్‌ చేశారట.
 

అలాగే `మై వీలేజ్‌ షో` అనిల్ కన్ఫమ్‌ అయినట్టు తెలుస్తుంది. యాంకర్‌ నిఖిల్‌, అలీ తమ్ముడు ఖయ్యూమ్‌ కూడా కన్ఫమ్ లిస్ట్ లో ఉన్నారని టాక్. బంచీక్‌ బబ్లూ సస్పెన్స్ లో ఉన్నాడని సమాచారం వీరితోపాటు రేఖా భోజ్‌, కమెడియన్‌ యాదమ్మరాజు, నటి సనా, అంజలి పవన్‌, అమృత ప్రణయ్‌, సీరియల్‌ నటి హారిక, సీరియల్‌ నటులు శ్రీకర్‌, నిఖిల్‌, సింగర్‌ సాకేత్‌, కమెడియన్‌ రవి శివ తేజ, నీతోనే డాన్స్ అక్షిత, యూట్యూబర్‌ సోనియా సింగ్‌, హీరో ఆదిత్య ఓం, అబ్బాస్‌, జబర్దస్త్ పవిత్ర, వింద్య విశాఖ, బర్రెలక్క, కుమారి ఆంటీ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. మరి ఇందులో ఎంత మంది ఫైనల్‌ అవుతారు? ఇంకా ఎంత మందికొత్త వాళ్లు యాడ్‌ అవుతారనేది మున్ముందు క్లారిటీ రానుంది. 
 

Bigg boss telugu 8

ఇక ఈ సీజన్‌ని కూడా నాగార్జుననే హోస్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే రెండు మూడు టీజర్లు విడుదల చేశారు. సరికొత్తగా, అన్‌లిమిటెడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వబోతున్నామని, ఈ సారి చాలా ట్విస్ట్ లు, టర్న్ లు ఉంటాయని నాగార్జున తెలియజేసిన విషయం తెలిసిందే. షోపై క్యూరియాసిటీని పెంచే ప్రయత్నం చేశారు. అలాగే ఈ సారి యూట్యూబర్స్, ఇన్‌ఫ్లూయెన్సర్లని ఎక్కువగా తీసుకుంటారని తెలుస్తుంది. ఇక సెప్టెంబర్‌ 8 నుంచి బిగ్‌ బాస్‌ తెలుగు 8 ప్రారంభం కానుంది. 
 

Latest Videos

click me!