శోభిత టైం మొదలైంది ... నాగ చైతన్యతో పెళ్లి అనగానే జీవితంలో అనూహ్య మార్పు!

First Published | Aug 13, 2024, 12:38 PM IST

శోభిత దూళిపాళ్లకు నాగ చైతన్య  లక్కీ చార్మ్ ల తయారయ్యాడు. ఎంగేజ్మెంట్ జరిగిందో లేదో ఆమె కెరీర్లో అనూహ్య మార్పు కనిపించింది. 
 

గత వారం రోజులుగా శోభిత ధూళిపాళ్ల పేరు నెట్టింట మారుమోగిపోతుంది. నాగ చైతన్య తో ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. దేశవ్యాప్తంగా వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఫోటోలు ట్రెండ్ అయ్యాయి. అలాగే శోభిత దశ తిరిగిన సూచనలు కనిపిస్తున్నాయి.  ఈ వారం ఐఎండీబీ(IMDB) పాప్యులర్ ఇండియన్ సెలెబ్రెటీల లిస్ట్ విడుదల చేసింది. ఇందులో శోభిత ధూళిపాళ్ల 2వ స్థానంలో నిలిచింది. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ని సైతం వెనక్కి నెట్టింది. 

చాలా కాలం నాగ చైతన్య - శోభిత ధూళిపాళ్ల సీక్రెట్ గా డేటింగ్ చేశారు.  ఆగస్టు 8వ తేదీన ఎంగేజ్మెంట్ జరుపుకుని షాకిచ్చారు. ఇరు కుటుంబాల సమక్షంలో అత్యంత సన్నిహితుల మధ్య సింపుల్ గా వీరి నిశ్చితార్థం జరిగింది. అక్కినేని నాగార్జున ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించారు. కొత్త కోడలిని అక్కినేని కుటుంబం లోకి ఆహ్వానించారు. నాగ చైతన్య - శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ ఫోటోలు షేర్ చేశారు. 


 నాగ చైతన్య - శోభిత ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్ కావడంతో ఆమె గురించి నెటిజన్లు ఆరా తీశారు.  శోభిత ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అని గూగుల్ లో వెతికారు. మిలియన్ల సంఖ్యలో నెటిజన్లు ఆమె వివరాలు సెర్చ్ చేశారు. దీంతో ఒక్కసారిగా శోభిత ధూళిపాళ్ల దేశవ్యాప్తంగా టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. 
 

ఐఎండీబీ జాబితా ప్రకారం ఈ వారం మొదటి స్థానంలో బాలీవుడ్ నటి శార్వరి వాఘ్ ఉన్నారు. ముంజ్యా మూవీ తర్వాత ఆమె క్రేజ్ బాగా పెరిగింది. రెండవ స్థానంలో శోభిత ధూళిపాళ్ల నిలిచింది. దీనికి కారణం నాగ చైతన్యతో ఆమెకు ఎంగేజ్మెంట్ జరగడమే. ఇక మూడో స్థానంలో షారుఖ్ ఖాన్ నిలిచాడు. హీరోయిన్ కాజోల్ నాలుగు, జాన్వీ కపూర్ ఐదవ స్థానాల్లో నిలిచారు.  

శోభిత ధూళిపాళ్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెనాలికి చెందిన తెలుగమ్మాయి.  ముంబైలో మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. 2013 ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ గెలుచుకుంది. ' రామన్ రాఘవన్ 2. 0'  మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. తెలుగు గూడచారి, మేజర్ చిత్రాల్లో నటించింది. హిందీలో ఆమె ఎక్కువ చిత్రాలు చేసింది. 

Latest Videos

click me!