నాకు కావాల్సినవన్నీ వాళ్లే చేశారు. అందుకే నేను చదవగలిగాను. నాకు మొదట్నుంచీ ఎమర్జెన్సీ వార్డులో పనిచేయాలని ఉండేది. ప్రజలతో మాట్లాడాలి, వాళ్లు కష్టాల్లో, టెన్షన్‌లో ఉంటే ఓదార్చాలని అనుకున్నాను.
నేను చదువు అయ్యాక 20 ఏళ్లు ప్రొఫెసర్‌గా చేశాను. తర్వాత 15 ఏళ్లు ఎమర్జెన్సీలో చేశాను. చాలామంది చనిపోయే ముందు డబ్బులు, నగలు చూడాలని అనుకోలేదు. ఫ్యామిలీని, అమ్మానాన్న, పిల్లలు, భార్యని చూడాలని నా చేయి పట్టుకుని అడిగేవారు.