ఓ సందర్భంలో ఉదయ్ కిరణ్ తన వద్ద కన్నీళ్లు పెట్టుకున్నట్టు తెలిపింది. మణికొండ వద్ద ఓ మూవీ షూటింగ్ జరుగుతుందని, తాను, చలపతి రావు సోఫాలో కూర్చొని ఉన్నాం. అప్పటికే పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. అమ్మ చనిపోయింది. చాలా బాధలో ఉన్నాడు.
తన వద్దకు వచ్చి కింద మోకాళ్లపై కూర్చొని తనని పట్టుకుని `మిమ్మల్ని అమ్మా అని పిలవనా? అంటూ బోరున విలపించాడట. ఆ సమయంలో అలా ఏడ్చాడంటే లోపల ఎంత బాధ ఉండి ఉంటుంది. ఎంత స్ట్రగుల్ అయ్యాడో అర్థమవుతుంది. ఆ సమయంలో ఎంతో ఆయన చుట్టూ ఏదో నడుస్తుంది. దీంతో ఆ టైమ్‌లో తను చేసింది కరెక్టేనేమో అనిపిస్తుంది.
తాను పోయానో, అంతా తనతో పోతుంది, ఎవరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు కదా అని ఆలోచించి ఉండోచ్చు అని చెప్పింది నటి సుధ. తన బాగా బాధపడిని, తన మనసు కలిచివేసిన మరణం ఉదయ్ కిరణ్‌ది అని వెల్లడించింది. కొన్నేళ్ల క్రితం ఐడ్రీమ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయం చెప్పింది.