ఇప్పుడు గౌరీ ఖాన్ అని పిలువబడే గౌరీ చిబ్బర్ ఇప్పటికీ హిందూ మతాన్ని అనుసరిస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, షారుఖ్ , గౌరీ గతంలో రిజిస్టర్డ్ వివాహం చేసుకున్నారు. తరువాత వారు ముస్లిం సంప్రదాయం ప్రకారం, ఆపై పంజాబీ హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు.
ఆ సమయంలో షారుఖ్ 'రాజు బన్ గయా హీరో' సినిమాలో నటిస్తున్నాడు. ఇక పెళ్ళి తరువాత గౌరీ 1997 నవంబర్‌లో ఆర్యన్ ఖాన్‌కు జన్మనిచ్చింది. సుహానా ఖాన్ కూడా 2000 సంవత్సరంలో జన్మించింది. 22 సంవత్సరాల తర్వాత, ఆ జంటకు సరోగసి ద్వారా మరో బిడ్డ పుట్టింది. ఆ బిడ్డకు అబ్రామ్ అని పేరు పెట్టారు.