Madhuri Rathod: ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం ఎందుకు చేసింది? షాకింగ్ నిజాలు

Published : Sep 07, 2026, 01:07 PM IST

Folk Dancer Madhuri Rathod: పెళ్లి పేరుతో ఈశ్వర్ సాయి మోసం చేశాడని, పోలీసులు అరెస్ట్ చేయకపోవడంతో ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం చేసిందని కుటుంబ సభ్యులు తెలిపారు.

PREV
16
ఈశ్వర్ సాయి కేసులో ట్విస్ట్: మాధురి రాథోడ్ సూసైడ్ లెటర్‌లో ఏముంది?

సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా తీవ్ర కలకలం రేపుతున్న ఫోక్ స్టార్స్ వివాదం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. ప్రముఖ ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర సంచలనంగా మారింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే గది తలుపులు పగలగొట్టి ఆమెను కాపాడటంతో తృటిలో ప్రాణపాయం తప్పింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన అసలు కారణాలు, పోలీసుల తీరుపై ఆమె చేసిన ఆరోపణల వివరాలు గమనిస్తే..

26
లవ్, మ్యారేజ్ డ్రామా.. ఆపై దారుణమైన మోసం

'బాసింగ బలాలే' ఫోక్ సాంగ్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ మధ్య కొంతకాలంగా పరిచయం ఉంది. అయితే, తనకు పెళ్లయి ఒక బాబు ఉన్న విషయాన్ని దాచి లేదా పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఈశ్వర్ సాయి తనను మోసం చేశాడని మాధురి ఆరోపిస్తోంది. ప్రేమిస్తున్నానని నమ్మించి శారీరకంగా వాడుకోవడమే కాకుండా, ఆ తర్వాత తీవ్రంగా వేధించాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

36
రూమ్ ఎపిసోడ్, వైరల్ వీడియోలతో పోయిన పరువు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఒక రూమ్‌లో మాధురి, ఈశ్వర్ సాయి కలిసి ఉన్న సమయంలో ఈశ్వర్ సాయి భార్య శరణ్య అక్కడికి వచ్చి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో ఈ వ్యవహారం రచ్చకెక్కింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట విపరీతంగా వైరల్ కావడమే కాకుండా, లక్షల్లో మీమ్స్ ట్రోల్ అయ్యాయి. దీనికితోడు ఈశ్వర్ సాయి భార్య శరణ్య పలు యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ తన భర్త తప్పు లేదని, తప్పంతా మాధురిదే అన్నట్లు మాట్లాడటంతో మాధురి తీవ్ర మానసిక వేదనకు గురైంది. ఇంకోవైపు ఏఐ టెక్నాలజీతో తన మార్ఫింగ్ వీడియోలు సృష్టించి పరువు తీశారని మాధురి ఆరోపించింది.

46
పోలీసులకు ఫిర్యాదు.. ఆగస్టు 22న కేసు నమోదు

ఈశ్వర్ సాయి మోసంపై న్యాయం చేయాలని కోరుతూ రమావత్ మాధురి రాథోడ్ హైదరాబాద్‌లోని నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు ఆగస్టు 22న పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 69 కింద కేసు నమోదు చేశారు. అయితే, కేసు నమోదై రోజులు గడుస్తున్నా పోలీసులు ఈశ్వర్ సాయిని అరెస్ట్ చేయకపోవడంపై మాధురి తీవ్ర తీవ్ర మనస్తాపానికి లోనైంది. నార్సింగి పోలీసులు ఈశ్వర్ సాయిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారని, అతనికి సహకరిస్తున్నారని ఆమె ఆరోపించింది.

56
ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు ఈశ్వర్ సాయి, ఎదురు దెబ్బగా మరో కంప్లైంట్

ఓవైపు పోలీసులు ఈశ్వర్ సాయి పరారీలో ఉన్నాడని చెబుతుండగా, అతడు అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, ఈ వివాదంలో మరో ట్విస్ట్ నెలకొంది. ఈశ్వర్ సాయి భార్య శరణ్య కూడా వేములవాడ పోలీస్ స్టేషన్‌లో మాధురిపై ఫిర్యాదు చేసింది. హోటల్‌లో ఉన్న తమపై మాధురి దాడి చేసి ఐఫోన్ లాక్కుందని ఆమె ఆరోపించింది. రెండు వైపులా కేసులు నమోదవడంతో వివాదం మరింత ముదిరింది.

66
మరణమే శిక్ష అనుకున్నా.. సూసైడ్ నోట్ రాసి..

తమ మధ్య జరిగిన గొడవలు నెట్టింట వైరల్ కావడం, పరువు పోవడం, దానికితోడు పోలీసుల నుంచి ఎలాంటి న్యాయం జరగకపోవడంతో బతికే ఆశ లేదని మాధురి భావించి.. ఆత్మహత్యకు ముందు ఒక సూసైడ్ నోట్ కూడా రాసింది. "నేను ఒక తప్పు చేశాను, దానికి శిక్షే నా మరణం" అని ఆ లేఖలో పేర్కొంటూ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకునేందుకు ప్రయత్నించింది. అదృష్టవశాత్తూ కుటుంబ సభ్యులు సమయానికి స్పందించి డోర్ పగలగొట్టడంతో ఆమె ప్రాణాలు దక్కాయి. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories