అనిరుధ్ – కావ్య మారన్ పెళ్లికి గ్రీస్‌నే ఎందుకు ఎంచుకున్నారు? ఆ దేశంలోని ప్రత్యేకతలు తెలిస్తే షాక్ అవుతారు?

Published : Nov 12, 2026, 10:04 AM IST

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్‌ల వివాహం గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. పెళ్లి కోసం గ్రీస్‌ను ఎంచుకోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అసలు ఇంత ప్రత్యేకంగా గ్రీస్‌నే ఎందుకు ఎంపిక చేసుకున్నారు?

PREV
14
రాజసం ఉట్టిపడేలా వివాహ వేడుకలు

అనిరుధ్, కావ్య మారన్ వివాహ వేడుకలను అత్యంత వైభవంగా జరిగింది. భారతీయ సంప్రదాయాలకు ఇంపార్టెన్స్ ఇస్తూ.. రాజస్థానీ శైలిలో వేడుకలను ఏర్పాటు చేసినట్లు సమాచారం. రెండు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో హల్దీ, సంగీత్ వంటి కార్యక్రమాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

అతిథుల కోసం ప్రత్యేక విమానాల ఏర్పాటు

ఈ వివాహ వేడుకకు రాజకీయ, సినీ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు పరిమితి సంఖ్యలో హాజరయ్యారు. అతిథులు ఎలాంటి ప్రయాణ ఇబ్బందులు లేకుండా గ్రీస్ చేరుకునేందుకు ప్రత్యేకంగా నాలుగు చార్టర్డ్ విమానాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం.

24
గ్రీస్‌నే ఎందుకు ఎంచుకున్నట్లు?

భారత్‌లోనే ఎన్నో అందమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నప్పటికీ, విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్‌లు నిర్వహించడంపై తరచూ చర్చ జరుగుతుంటుంది. అయితే గ్రీస్ వంటి దేశాలు సహజ సౌందర్యం, ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రత్యేకమైన వివాహ వేదికలతో ప్రపంచవ్యాప్తంగా సంపన్నులను ఆకర్షిస్తున్నాయి. గ్రీస్‌ను వివాహ వేదికగా ఎంచుకోవడానికి ప్రధాన కారణాల్లో అక్కడి వాతావరణం ఒకటి. ఏడాదిపొడువునా..ఎండతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని చెబుతారు. మధ్యధరా సముద్రం నుంచి వీచే చల్లని గాలులు బహిరంగ ప్రదేశాల్లో వివాహ వేడుకలు నిర్వహించేందుకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తాయి.

34
నీలి సముద్రం.. తెల్లని భవనాలు.. అద్భుతమైన ప్రకృతి అందాలు

గ్రీస్ అందాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా అక్కడి నీలి సముద్రం, కొండలపై నిర్మించిన తెల్లని భవనాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. సూర్యాస్తమయ సమయంలో కనిపించే ప్రకృతి దృశ్యాలు మరింత ఆకట్టుకుంటాయి. ఇలాంటి అందమైన ప్రదేశాల్లో జరిగే వివాహ వేడుకలు ఫొటోలు, వీడియోలకు అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ తో పాటు లైటింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాలను సొంతం చేసుకోవాలనుకునే జంటలకు గ్రీస్ మంచి ఎంపికగా నిలుస్తోంది.

44
ఆతిథ్యంలోనూ గ్రీస్‌కు ప్రత్యేక గుర్తింపు

గ్రీస్ సంస్కృతిలో అతిథులకు ఎంతో గౌరవం ఇస్తారు. తమ ఇంటికి వచ్చిన వారిని ఆప్యాయంగా ఆదరించడం అక్కడి సంప్రదాయాల్లో ఒకటి. అంతేకాదు, స్థానిక సముద్ర ఆహార వంటకాలు, రుచికరమైన శాఖాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. విభిన్న రుచులతో కూడిన విందులు, ప్రత్యేకమైన ఆతిథ్య ఏర్పాట్లు వివాహ వేడుకలకు మరింత రాజసాన్ని తీసుకొస్తాయి.

సంపన్నుల డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు గ్రీస్ ఎందుకు ఫేవరెట్?

అద్భుతమైన ప్రకృతి అందాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, విలాసవంతమైన రిసార్టులు, అతిథులకు ప్రత్యేక గోప్యత కల్పించే సౌకర్యాలు.. ఇలా ఎన్నో అంశాలు గ్రీస్‌ను డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు ప్రముఖ కేంద్రంగా మార్చాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా సంపన్నులు, సెలబ్రిటీలు తమ జీవితంలో అత్యంత ముఖ్యమైన వేడుకలను నిర్వహించేందుకు ఈ దేశాన్ని ఎంచుకుంటున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories