Rajamouli: సినిమా చేయాలని వెళ్లిన దిల్ రాజును.. ఒక్క మాటతో వెనక్కి పంపిన రాజమౌళి, స్టార్ ప్రొడ్యూసర్ తో జక్కన్న ఏమన్నాడు?

Published : Nov 12, 2026, 07:32 AM IST

Rajamouli: టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, స్టార్ డైరెక్టర్ రాజమౌళి. ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తే .. అది ఏ రేంజ్ లో ఉంటోందో అందరికి తెలుసు. అలాంటి సినిమా చేయాలనే దిల్ రాజు రాజమౌళి దగ్గరికి వెళ్తే.. జక్కన్న ఏం చేశాడో తెలుసా?

PREV
13
రాజమౌళితో సినిమా చేయాలనుకున్న దిల్ రాజు..

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రోడ్యూసర్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దిల్ రాజు, ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఇండస్ట్రీలో కొత్త దర్శకులను పరిచయం చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. అయితే, తన కెరీర్ మంచి ఫామ్ లోకి వస్తున్న టైమ్ లోనే ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళిని కలిసి సినిమా చేయమని అడిగినప్పుడు, ఆయన చెప్పిన ఒక అద్భుతమైన మాట తన ఆలోచనా విధానాన్నే పూర్తిగా మార్చివేసిందని దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

కొత్త దర్శకులకు పెద్దపీట

దిల్ రాజు తన ప్రయాణంలో కేవలం స్టార్ హీరోలతోనే కాకుండా, అనేక మంది కొత్త దర్శకులకు అవకాశాలు ఇచ్చి ఇండస్ట్రీకి పరిచయం చేశారు. చాలా మంది కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ భారీ విజయాలను అందుకున్నారు. అంతే కాదు దిల్ రాజు పరిచయం చేసిన కొత్త దర్శకులు.. ఆతర్వాత కాలంలో స్టార్ డైరెక్టర్లుగా మారారు. అయితే, ఒకానొక సమయంలో ప్రముఖ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి గారి దగ్గరికి వెళ్లి "మొదటిసారి మన కలయికలో ఒక సినిమా చేద్దాం" అని ఆయనను అడిగినట్లు దిల్ రాజు తెలిపారు.

23
రాజమౌళి చెప్పిన మాట

రాజమౌళిని కలిసి సినిమా చేయమని అడిగినప్పుడు ఆయన దిల్ రాజుతో ఇలా అన్నారట.. "మీరు ఇంతమంది కొత్త డైరెక్టర్లకి లైఫ్ ఇస్తున్నారు. ఒకవేళ నేను మీకు సినిమా చేస్తే, అది కేవలం మరో సినిమా అవుతుంది అంతే. అదే మీరు కొత్త డైరెక్టర్లతో సినిమా చేస్తే, ఇండస్ట్రీకి ఒక నూతన దర్శకుడు పుడతాడు" అని రాజమౌళి వివరించారు.

రాజమౌళి చెప్పిన ఆ మాట దిల్ రాజును ఎంతగానో ఆలోచింపజేసింది. అదే తనకు ఒక పెద్ద ఇన్స్పిరేషన్ వర్డ్ అయ్యింది. "అది నిజమే కదా! ఫెయిల్యూర్స్‌లో ఉన్న దర్శకులు, సరైన ప్లాట్‌ఫాం కోసం స్ట్రగుల్ అవుతున్న దర్శకులు లేదా కొత్త టాలెంట్ ఉన్న వాళ్లతో నేను ట్రావెల్ అవ్వడం వల్ల వాళ్ళకి మంచి లైఫ్ ఇచ్చినట్టవుతుంది" అని దిల్ రాజు భావించారు. పెద్ద డైరెక్టర్లతో సినిమా తీయడం కేవలం ఒక బిజినెస్ ప్రాజెక్ట్ అవుతుందేమో కానీ, కొత్తవాళ్లను పరిచయం చేయడం ద్వారా ఎంతో మంది దర్శకులు పుడతారు అని ఆయన గ్రహించారు.

33
త్రివిక్రమ్‌తో రాబోయే ప్రాజెక్ట్

కొత్త దర్శకులను ప్రోత్సహిస్తూనే, స్టార్ టెక్నీషియన్లతో కూడా ప్రయాణం కొనసాగిస్తున్న దిల్ రాజు, రీసెంట్‌గా ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ గారితో కూడా ఒక ప్రాజెక్ట్ కన్ఫర్మ్ చేసుకున్నట్లు తెలిపారు. దిల్ రాజు నిర్మాత కాకముందు నుంచే త్రివిక్రమ్ రైటర్‌గా ఉన్నప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఇలా సరికొత్త ఆలోచనలతో, ఇండస్ట్రీకి ఎంతోమంది ప్రతిభావంతులను పరిచయం చేస్తూ దిల్ రాజు టాలీవుడ్ ప్రయాణం కొనసాగుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories