Jagapathi Babu: జగపతి బాబుతో శోభనం సీన్‌ అనగానే బోరున ఏడ్చిన హీరోయిన్ ఎవరో తెలుసా? 25 ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే?

Published : Nov 23, 2026, 04:58 PM IST

Jagapathi Babu: టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరోగా గుర్తింపు సాధించాడు జగపతిబాబు. హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అదరగొడుతున్నాడు. జగపతిబాబుతో శోభనం సీన్అనగానే ఓ హీరోయిన్ భయపడి ఏడ్చిందని మీకు తెలుసా? ఇంతకీ ఎవరా నటి.

PREV
13
ఫ్యామిలీ హీరోగా గుర్తింపు..

టాలీవుడ్‌లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు జగపతిబాబు. హీరోగా ఎన్నో సినిమాలు చేసిన ఆయనకు రొమాంటిక్ ఇమేజ్ ఉంది. ఆతర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అదరగొడుతున్నాడు. ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయే ఆయన, కెరీర్‌లో ఎన్నో విజయాలు, అపజయాలు చవిచూశారు. తొలినాళ్లలో ఫ్యామిలీ హీరోగా అలరించిన జగపతిబాబు, ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌లో లెజెండ్, రంగస్థలం, శ్రీమంతుడు వంటి సినిమాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఆమధ్య కాలంలో జగపతి బాబు తన కెరీర్ కు సబంధించిన కొన్ని వింత విషయాలను వెల్లడించారు. ఓ హీరోయిన్ శోభనం సీన్ అంటే ఎలా ఏడ్చిందో చెప్పి.. అందరిని నవ్వించారు.

23
పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న జగపతి..

జగపతిబాబుతో శోభనం సీన్ అనగానే ఏడ్చిన హీరోయిన్ ఎవరో కాదు లయ. ఈ హీరోయిన్ తో గతంలో 'మనోహరం', 'హనుమాన్ జంక్షన్' వంటి చిత్రాల్లో కలిసి నటించారు జగపతిబాబు. చాలా విరామం తర్వాత వీరిద్దరూ 'వదలా' అనే సినిమాలో కలిసి పనిచేశారు. గతంలో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రమోషన్స్‌లో జగపతిబాబు ఈ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 'మనోహరం' సినిమా షూటింగ్ సమయంలో లయ చాలా చిన్న పిల్ల అని, అప్పట్లో ఆమె వయసు కూడా చాలా తక్కువని చెప్పారు. అందుకే ఆమెను చూసినప్పుడల్లా తనకు చిన్న పిల్ల అనే భావనే కలిగేదని, తన ఉద్దేశంలో అప్పటికంటే ఇప్పుడే లయ ఇంకా క్యూట్‌గా కనిపిస్తోందని అన్నారు.

అదే సమయంలో 'మనోహరం' షూటింగ్‌లో జరిగిన ఓ ఘటనను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ సినిమాలో శోభనం (ఫస్ట్ నైట్) సీన్ చిత్రీకరిస్తున్నప్పుడు, దర్శకుడు చెప్పినట్లు తాను బెడ్ వైపు వెళ్లగానే లయ ఒక్కసారిగా భయపడిపోయి బోరున ఏడ్చేసిందని జగపతిబాబు వివరించారు. అప్పట్లో ఆమె చాలా అమాయకురాలని, ఆ సంఘటన ఇప్పటికీ తనకు పచ్చబొట్టులా గుర్తుందని చెప్పారు

33
ఇప్పటికీ అదే అనుబంధం..

ఆ ఘటన తర్వాత కూడా తమ మధ్య ఉన్న స్నేహం, అనుబంధం ఎప్పుడూ అలాగే కొనసాగాయని జగపతిబాబు చెప్పారు. లయ తనకు ఎప్పుడూ చిన్న పిల్లగానే కనిపిస్తుందని, అందుకే ఆ బాండింగ్ ఎప్పటికీ మారలేదని అన్నారు. చాలా కాలం తర్వాత మళ్లీ కలిసి నటించినప్పటికీ ఏమాత్రం కొత్తగా అనిపించలేదని, పాత పరిచయమే కొనసాగుతున్నట్లు అనిపించిందని తెలిపారు. సినీ పరిశ్రమలో ఒకసారి కలిసి పనిచేసిన కళాకారుల మధ్య మంచి అనుబంధం ఉంటే, మళ్లీ కలిసి నటించడం చాలా సహజంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆమనిపై ప్రశంసలు

కొందరు పెద్ద స్టార్‌లుగా ఎదిగిన తర్వాత మాత్రమే ఆటిట్యూడ్ చూపిస్తారని, అలాంటివి లేకపోతే సంబంధాలు నిలకడగా ఉంటాయని వ్యాఖ్యానించారు. ఇదే ఇంటర్వ్యూలో నటి ఆమని గురించి కూడా జగపతిబాబు ప్రశంసలు కురిపించారు. ఆమని స్క్రిప్ట్ ఎంపికలో చాలా సెలెక్టివ్‌గా ఉంటారని.. తన పాత్రకు 100 శాతం న్యాయం చేస్తారన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories