Rukmini Vasanth: కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ లండన్ ట్రిప్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పిజ్జా తింటూ, ఐస్‌క్రీమ్ పట్టుకుని చాలా సింపుల్ లుక్‌లో కనిపించి ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తోంది.
సౌత్ ఇండియాలో ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉన్న హీరోయిన్లలో రుక్మిణి వసంత్ ఒకరు. తన అందం, న్యాచురల్ యాక్టింగ్‌తో ఆడియన్స్‌ను కట్టిపడేసింది. వరుసగా పెద్ద ప్రాజెక్టులు దక్కించుకుంటూ పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ తెచ్చుకుంది. సినిమాలతో బిజీగా ఉంటూనే, తన లండన్ వెకేషన్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
26
లండన్ మెమరీస్ షేర్ చేసిన బ్యూటీ
సినిమా షూటింగ్స్, కొత్త ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న రుక్మిణి వసంత్, గతంలో లండన్‌లో గడిపిన అందమైన క్షణాలకు సంబంధించిన ఫొటోలను ఫ్యాన్స్‌తో పంచుకుంది. ఈ ఫొటోల్లో ఎలాంటి హంగులు లేకుండా చాలా సింపుల్ అండ్ న్యాచురల్ లుక్‌లో అదరగొడుతోంది.
36
పిజ్జా, ఐస్‌క్రీమ్ తింటూ క్యూట్ స్మైల్!
రుక్మిణి షేర్ చేసిన ఫొటోల్లో ఒకటి చాలా స్పెషల్‌గా నిలిచింది. ఒక రెస్టారెంట్లో పిజ్జా తింటూ క్యూట్‌గా నవ్వుతున్న ఫొటో ఫ్యాన్స్‌కు బాగా నచ్చేసింది. మరో ఫొటోలో పచ్చటి పార్క్‌లో సన్‌గ్లాసెస్ పెట్టుకుని, చేతిలో ఐస్‌క్రీమ్ పట్టుకుని ఫోజిచ్చింది. స్టార్ హీరోయిన్ అనే బిల్డప్ లేకుండా ఒక సాధారణ అమ్మాయిలా కనిపించడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అక్కడి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్న ఈ ట్రావెల్ ఫొటోలు ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.
రుక్మిణి వసంత్ సినీ జర్నీ విషయానికి వస్తే, 'సప్త సాగరదాచే ఎల్లో' సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. అందులో ప్రియ పాత్రలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో ఆమె యాక్టింగ్‌కు మంచి ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత 'బానదారియల్లి', 'బఘీర', 'భైరతి రణగల్' లాంటి సినిమాల్లో నటించి కన్నడ ఇండస్ట్రీలో తన స్థానాన్ని పదిలం చేసుకుంది.
56
తెలుగు, తమిళంలోనూ ఎంట్రీ
కన్నడ సినిమాలతో పాటు ఇతర భాషల్లోనూ రుక్మిణి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' సినిమాతో తెలుగు ఆడియన్స్‌కు పరిచయమైంది. ఆ తర్వాత తమిళంలో 'ఏస్', 'మద్రాసి' సినిమాల్లో నటించి అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక 'కాంతార: చాప్టర్ 1'లో కనకవతి పాత్రలో నటించడం ఆమె క్రేజ్‌ను మరింత పెంచింది. యష్ మోస్ట్ అవేటెడ్ మూవీ 'టాక్సిక్'లోనూ మెలిస్సా పాత్రలో కనిపించనుంది.
66
ఎన్టీఆర్ 'డ్రాగన్' పై అంచనాలు
ప్రస్తుతం రుక్మిణి వసంత్ పేరు టాలీవుడ్లో గట్టిగా వినిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న 'డ్రాగన్' సినిమాలో ఆమె నటిస్తుందన్న వార్తలతో ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒకవైపు పెద్ద సినిమాలతో బిజీగా ఉంటూనే, మరోవైపు తన వెకేషన్ ఫొటోలు, పర్సనల్ అప్డేట్స్ను షేర్ చేస్తూ అభిమానుల ప్రేమను సొంతం చేసుకుంటోంది.