ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేయాల్సి ఉంది. విక్రమ సింహ భూపతిగా, ప్రతాప వర్మగా నటించారు. తండ్రి కొడుకులుగా కనిపిస్తారు. తండ్రి రాజు. ఆయనపై కొందరు కుట్ర చేసి చంపేస్తారు. జనం మధ్యలో రాజ్యానికి దూరంగా పెరిగిన కొడుకు తండ్రి మరణానికి కారకులను కనిపెట్టి రాజ్యాన్ని తన వశం చేసుకోవడం కథ.
ఇందులో బాలయ్యకి జోడీగా రోజా, అంజలా ఝవేరీ హీరోయిన్లుగా ఎంపికయ్యారు. 2001లో ఈ మూవీ చిత్రీకరణ ప్రారంభించారు. రామోజీ ఫిల్మ్ సిటీ, విశాఖపట్నం, అరకు, గోల్కొండ ఫోర్ట్ లో షూటింగ్ జరిపారు. రెండు పాటలతో సహా సగం మూవీని షూట్ చేశారట.