Udit Narayan kisses fan : సెల్ఫీ కోసం వచ్చిన అభిమానికి లిప్ కిస్ ఇచ్చిన 70 ఏళ్ల స్టార్ సింగర్

Published : Feb 01, 2025, 03:23 PM IST

Singer Udit Narayan kisses fan :  లైవ్ షో జరుగుతుండగా.. సెల్ఫీ దిగడానికి వచ్చిన ఓ అభిమానికి లిప్ కిస్ ఇచ్చాడు.. 70 ఏళ్ల స్టార్ సింగర్. మండిపడుతున్న నెటిజన్లు, ఆయనెందుకు అలా చేశారు..?

PREV
16
 Udit Narayan kisses fan : సెల్ఫీ కోసం వచ్చిన అభిమానికి లిప్ కిస్ ఇచ్చిన 70 ఏళ్ల స్టార్ సింగర్
2000 పైగా పాటలు పాడిన గాయకుడు

Star Singer Udit Narayan kisses fan live show :  ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్, నేపాల్ కు చెందినవారు. బాలీవుడ్ తో పాటు సౌత్ భాషల్లో  కూడా పాటలు పాడిన ఆయన.. తమిళం, తెలుగు, కన్నడ, ఒడియా, నేపాలీ, భోజ్‌పురి, బెంగాలీ, వంటి ఇతర భాషల్లో 2000 కి పైగా పాటలు పాడారు. ఉత్తమ గాయకుడిగా నాలుగు సార్లు జాతీయ అవార్డును, ఐదు సార్లు ఫిలింఫేర్ అవార్డును గెలుచుకున్నారు.

Also Read:  సీనియర్ ఎన్టీఆర్ వాడిన కారు ఇప్పుడు ఎక్కడ ఉంది

26
ఉదిత్ నారాయణ్ అవార్డులు

గాయకుడిగా ఉదిత్ నారాయణ్  చేసిన సేవకుగాను కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్, పద్మశ్రీ వంటి అవార్డులతో సత్కరించింది. కెరీర్ బిగినింగ్ లో ఎన్నో కష్టాలు పడ్డ ఆయన.. 1980 లో యునిక్ పీస్ సినిమాతో  బాలీవుడ్ లో గాయకుడిగా  పరిచయం అయ్యారు. ఆయన గొంతు తక్కువ సమయంలోనే ఆయనను ప్రముఖ గాయకుడిగా మార్చింది. 

Also Read: రంగస్థలం లో చెవిటి వాడిగా, బుచ్చిబాబు సినిమాలో గుడ్డివాడిగా రామ్ చరణ్

 

36
ఉదిత్ నారాయణ్

తెలుగులో కూడా ఉదిత్ నారయణ్ అద్భుతమైన పాటలు పాడారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి కొన్ని పాటలు పాడారు ఉదిత్.  రక్షకుడు' సినిమాలో 'సోనియా సోనియా' , చిరంజీవి  చూడాలని ఉంది సినిమాలో రామా చిలకమ్మ  వంటి పాటలు మంచి ఆదరణ పొందాయి. తెలుగులో దాదాపు 150 కి పైగా పాటలు పాడి ఉంటారు ఉదిత్ నారాయణ్. 

Also Read: ఒక్క సీన్ కోసం 20 కోట్లు, నాగచైతన్య సినిమాలో అంత స్పెషల్ ఏంటి?

46
ఉదిత్ నారాయణ్ మొదటి భార్య రంజన

ఉదిత్ నారాయణ ఎంత పాపులర్ సింగర్ అయ్యారో.. అంతే వివాదాస్పదుడిగా కూడా ఉన్నారు. వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారు. 1985 లో దీపాను వివాహం చేసుకున్న ఆయన.. 2006 లో రంజన అనే మహిళ తాను ఉదిత్ మొదటి భార్యనని చెప్పడంతో సంచలనం రేకెత్తింది. మొదట దీన్ని ఖండించిన ఉదిత్ నారాయణ్.. ఆ తర్వాత ఒప్పుకున్నారు. 1984 లో ఆమెకు విడాకులు ఇచ్చినట్లు చెప్పిన ఆయన.. ఆ తర్వాత ఆమె ఖర్చులను భరిస్తున్నట్లు తెలిపారు.

Also Read: పాకిస్థాన్ లో అల్లు అర్జున్ కు ఇంత క్రేజ్ ఉందా..?


 

56
వ్యక్తిగత జీవితం

రంజనకు విడాకులు ఇచ్చిన తర్వాతే దీపాను వివాహం చేసుకున్నారు ఉదిత్. వీరికి ఆదిత్య నారాయణ్ అనే కుమారుడు ఉన్నాడు. ఆయన కూడా గాయకుడు. 2000 కి పైగా పాటలు పాడిన ఉదిత్ నారాయణ్ కు భారీగా అభిమానులు ఉన్నారు.

Also Read: రామ్ కి అనిల్ రావిపూడి కి మధ్య ఏంటి గొడవ

66
లైవ్ షోలో అభిమానికి ముద్దు:

కొన్ని సంవత్సరాలుగా గాయకుడిగానే కాకుండా, లైవ్ షోలలో కూడా తన హిట్ పాటలు పాడుతున్నారు. ఇటీవల జరిగిన ఓ లైవ్ షోలో, ఉదిత్ నారాయణ్ పాట పాడుతుండగా.. ఆయనతో సెల్ఫీ దిగడానికి అభిమానులు పోటీ పడ్డారు. ఆ సమయంలో, మహిళా అభిమానులతో సెల్ఫీ దిగడమే కాకుండా, ముద్దులు కూడా పెట్టారు ఆయన.

ఓ అభిమాని సెల్ఫీ తీసుకున్న తర్వాత, ఆమె చెంపపై ముద్దు పెట్టిన ఆయన.. ఆమె తలను తిప్పి పెదవులపై ముద్దు పెట్టిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఉదిత్ నారాయణ్ చర్యను చాలా మంది ఖండిస్తున్నారు. విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. 

 

click me!

Recommended Stories