Uday Kiran Rejected movie: చిరంజీవికి ఇష్టమైన స్టార్ హీరో మూవీ, బతిమాలుకున్నా రిజెక్ట్ చేసిన ఉదయ్ కిరణ్

Published : Feb 01, 2025, 03:37 PM IST

Uday Kiran rejected this super hit movie : ఉదయ్ కిరణ్ పేరు చెప్పగానే అతడి జీవితం విషాదంగా ముగిసిన విధానం గుర్తుకు వస్తుంది. అదే విధంగా మెగా ఫ్యామిలీతో జరిగిన సంఘటనలు గురించి అనేక విధాలుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. 

PREV
15
Uday Kiran Rejected movie: చిరంజీవికి ఇష్టమైన స్టార్ హీరో మూవీ, బతిమాలుకున్నా రిజెక్ట్ చేసిన ఉదయ్ కిరణ్
Uday Kiran, Megastar Chiranjeevi

Uday Kiran rejected this super hit movie : ఉదయ్ కిరణ్ పేరు చెప్పగానే అతడి జీవితం విషాదంగా ముగిసిన విధానం గుర్తుకు వస్తుంది. అదే విధంగా మెగా ఫ్యామిలీతో జరిగిన సంఘటనలు గురించి అనేక విధాలుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. కానీ చిరంజీవి.. ఉదయ్ కిరణ్ ని అల్లుడు చేసుకోవాలి అనుకున్నది మాత్రం వాస్తవం. ఈ విషయాన్ని సీనియర్ నటుడు మురళి మోహన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 

 

25
Uday Kiran

ఉదయ్ కిరణ్ కి, మెగాస్టార్ చిరంజీవికి, మహేష్ బాబు అతడు చిత్రానికి ఒక లింక్ ఉంది. అదేంటంటే.. అతడు చిత్రాన్ని నిర్మించింది మురళి మోహన్. ఈ చిత్రానికి ముందుగా హీరోగా అనుకున్నది ఉదయ్ కిరణ్ ని అని మురళి మోహన్ తెలిపారు. అప్పట్లో ఉదయ్ కిరణ్ కి మంచి ఇమేజ్ ఉంది. అదే సమయంలో చిరంజీవి కుమార్తెతో ఉదయ్ కిరణ్ పెళ్లి, నిశ్చితార్థం లాంటి చర్చలు కూడా జరుగుతున్నాయట. 

 

35

ఒకసారి మురళి మోహన్ ఉదయ్ కిరణ్ కి ఫోన్ చేసి నీ నటన చాలా బావుందయ్యా అని అభినందించారట. మురళి మోహన్ లాంటి సీనియర్ నటుడు అభినందించడంతో ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆ తర్వాత మరోసారి ఫోన్ చేసి అతడు చిత్రం నీతో చేయాలని అనుకుంటున్నట్లు మురళి మోహన్ ఉదయ్ కిరణ్ కి చెప్పారు. మురళి మోహన్ అడగగానే సార్ తప్పకుండా చేస్తాను.. అంతకంటేనా అని చెప్పాడట. 

 

45
Murali Mohan

కానీ అతడు చిత్రం ప్రారంభం అయ్యే సమయానికి అతడి పెళ్లి గురించి వార్తలు ఎక్కువయ్యాయి. అదే విధంగా ఉదయ్ కిరణ్ కూడా బాగా బిజీ అయ్యాడు. వేరే నిర్మాత ఉదయ్ కిరణ్ డేట్లు తీసేసుకున్నారట. ఆ టైంలో మురళి మోహన్ అడిగితే.. సార్ ఇప్పుడు చేయలేనుమనం నెక్స్ట్ ఇయర్ చేద్దాం అని చెప్పాడట. దీనితో మురళి మోహన్ ఉదయ్ కిరణ్ స్థానంలో అతడు చిత్రానికి మహేష్ బాబుని తీసుకున్నారు. 

 

55
Athadu Movie

అతడు చిత్రం విడుదలై మొదటి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. కానీ మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా చూసి అభినందించారు. త్రివిక్రమ్ టేకింగ్, మహేష్ బాబు స్టైలిష్ పెర్ఫామెన్స్ చిరంజీవికి బాగా నచ్చాయి. అతడు అద్భుతమైన చిత్రం అని చిరంజీవి అప్పట్లో అభినందించారు. మొత్తంగా ఒక గొప్ప చిత్రాన్ని ఉదయ్ కిరణ్ తన చేజేతులా వదులుకున్నాడు. 

 

Read more Photos on
click me!

Recommended Stories