ఇక మూడోసారి వచ్చిన వ్యాపారి 'నాకు కోతులు ఇంకా కావాలి. ఈసారి రూ. 25వేలు ఇస్తా అంటాడు'. అయితే అప్పటికే ఊరిలో ఉన్న కోతులన్నాయి అయిపోతాయి. కోతుల కోసం తెగ వెతుకుతుంటారు. పక్కనే ఉన్న ఊరిలో ఓ వ్యక్తి కోతులు అమ్ముతున్నారన్న విషయాన్ని తెలుసుకున్న గ్రామస్థులు అక్కడికి వెళ్తారు. అక్కడ ఒక్కో కోతి రూ. 23 వేలకు విక్రయిస్తుంటాడు. రూ. 2 వేలు లాభం వస్తుంది కదా అని మొత్తం కోతులను కొనుగోలు చేస్తారు. ట్విస్ట్ ఏంటంటే అక్కడ ఆ కోతులను విక్రయిస్తున్న వ్యక్తి గ్రామంలోకి వచ్చిన ఆ వ్యాపారి మనిషే.
ఇలా గ్రామస్థుల దగ్గర రూ. 10, రూ. 15 వేలకు కొనుగోలు చేసిన కోతులనే మళ్లీ తిరిగి అదే గ్రామస్థులతో రూ. 23 వేలకు కొనుగోలు చేయించాడు. ఇదిగో స్టాక్ మార్కెట్ వ్యవహారం కూడా ఇలాగే అస్సలు అర్థం కాకుండా ఉంటుందని అందుకే తానెప్పుడు వాటి జోలికి వెళ్లనని మురళీ మోహన్ చెప్పుకొచ్చాడు.