టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అందగాడు సోగ్గాడు లాంటి బిరుదులు ఉన్న ఏకైక హీరో శోభన్ బాబు మాత్రమే. ఆయన తర్వాత ఆ ఇమేజ్ టాలీవుడ్ లో ఒకే ఒక్క హీరోకి దక్కింది. అంతే కాదు లేడీ ఫ్యాన్స్ కూడా శోభన్ బాబుతో సమానంగా ఆ హీరోకి దక్కారు. ఇంతకీ ఎవరా హీరో?
టాలీవుడ్ మొదటి తరం హీరోలలో హ్యాండ్సమ్ ఎవరంటే ముందుగా శోభన్ బాబు పేరే వినిపించేది. ఆయన గ్లామర్ ఎలా ఉండేదంటే.. 'సోగ్గాడు', 'అందగాడు' అందాల నటుడు, అని ఆయన్ను ముద్దుగా పిలుచుకునేవారు. మరీ ముఖ్యంగా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. హీరోయిన్లు కూడా శోభన్ బాబుతో సినిమా అంటే ఎగిరి గతంతేసేవారు. ఇక లేడీ ఫ్యాన్స్ ఆకాలంలోనే ఎలా ఉండేవారంటే? ఒకసారి అవుట్డోర్ షూటింగ్లో ఒక మహిళ సడెన్గా వచ్చి ఆయనకు ముద్దు పెట్టేసిందట. మరి శోభన్ బాబు తర్వాత అంత లేడీ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరు? అంత అందంగా ఉన్నది ఎవరో తెలుసా. ఆ హీరో ఎవరో కాదు సుమన్.
24
శోభన్ బాబు తర్వాత అంతటి అందగాడు..
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు. కెరీర్ బిగినింగ్ లో సుమన్ క్రేజ్ మామూలుగా ఉండేది కాదు. హైట్, పర్సనాలిటీతో పాటు కలర్ కూడా సుమన్ కు కలిసొచ్చింది. అంతే కాదు కరాటే నేర్చుకుని ఉండటం, యాక్షన్ సీక్వెన్స్ లు కూడా బాగా చేసేవారు. సుమన్ పక్కన ఏ హీరోయిన్ అయినా బాగుండేది. ఆయన అందంతో పాటు నటన కూడా అందరిని ఆకట్టుకునేది. టాలీవుడ్ లో స్టార్ హీరో అవుతాడు అన్న నమ్మకం అందరికి ఉండేది. కానీ సుమన్ లైఫ్ లో జరిగిన కొన్ని విషాదాలు.. ఆయన కెరీర్ పై దబ్బ పడేలా చేశాయి. దాంతో అవకాశాలు తగ్గి సుమన్ స్టార్ హీరోగా ఎదగలేకపోయాడు. ఇక తన పాత జ్ఞాపకాలు నెమరు వేసుకున్న సుమన్.. రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం గురించి, నాటి రోజులను గుర్తు చేసుకుంటూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
34
లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ..
అప్పట్లో టాలీవుడ్లో శోభన్ బాబు తర్వాత అంత భారీ స్థాయిలో మహిళా అభిమానులను (లేడీ ఫ్యాన్స్) సంపాదించుకున్న నటుడు తనేనని సుమన్ స్పష్టం చేశారు. శోభన్ బాబు అందం, అభినయం చూసేందుకు ఎంతోమంది మహిళా ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టేవారని, ఆ తర్వాత ఆ స్థాయి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ తనకు దక్కిందని సుమన్ తెలిపారు. ఆ కాలంలో ఎంటర్టైన్మెంట్ అంటే కేవలం సినిమాలు మాత్రమే అని.. కుటుంబమంతా కలిసి వచ్చి చూసేలా తన సినిమాలు ఉండేవని ఆయన గుర్తు చేసుకున్నారు. తన సినిమాల్లో ఎలాంటి అసభ్యకరమైన డబుల్ మీనింగ్ డైలాగులు, కుల మతాలకు సంబంధించిన రెచ్చగొట్టే సన్నివేశాలు లేకుండా జాగ్రత్తపడ్డానని, కుటుంబ విలువలకు పెద్దపీట వేయడం వల్లే తన చిత్రాలు కనీసం నాలుగు వారాలు విజయవంతంగా ఆడేవని ఆయన వివరించారు.
ఇక తన సినీ కెరీర్లో 11 భాషల్లో వెయ్యికి పైగా సినిమాలలో నటించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు సుమన్ అన్నారు. అయితే తనను తాను ఎప్పుడూ 'గ్రేట్' అని గొప్పగా చెప్పుకోనని, ఒక మనిషి గొప్పో కాదో అతను జీవించి ఉన్నంతవరకు చెప్పలేమని, మరణానంతరం ప్రజల మదిలో నిలిచే స్థానాన్ని బట్టే అది ఆధారపడి ఉంటుందని ఆయన ఎంతో లోతైన తత్వాన్ని వ్యక్తపరిచారు. జీవితం అనేది గడియారం ముళ్ల లాంటిదని, ఎవరి జీవితంలోనైనా ఎత్తుపల్లాలు సర్వసాధారణమని సుమన్ తన సుదీర్ఘ అనుభవంతో వివరించారు. ఎవరినీ తక్కువ చేసి మాట్లాడకూడదని, కాలం ఎవరిని ఎప్పుడు ఏ స్థానంలో నిలబెడుతుందో ఎవరూ చెప్పలేరని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి తాను సాధించిన విజయాలు, దేవుడు ఇచ్చిన జీవితం పట్ల ఎంతో కృతజ్ఞతా భావంతో ఉంటానని, నటుడిగా తాను పొందిన ఆదరమే తన అసలైన సంపదని సుమన్ వెల్లడించారు.