Jailer 2 11 Days Collections: సండే రోజు `జైలర్‌ 2` ఊహించని జంప్‌.. రజనీకాంత్‌ మూవీకి రికార్డ్ కలెక్షన్లు

Published : Oct 26, 2026, 09:00 AM IST

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటించిన `జైలర్‌ 2` మూవీ బాక్సాఫీసుని షేక్‌ చేస్తోంది. ఈ చిత్రం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఆదివారం ఈ మూవీ ఊహించని కలెక్షన్లని రాబట్టింది. ఒక్కసారిగా జంప్‌ అయ్యింది.

PREV
14
జైలర్‌ 2.. 11వ రోజులు కలెక్షన్ల జంప్

రజనీకాంత్ హీరోగా నటించిన `జైలర్‌ 2` మూవీ బాక్సాఫీసు వద్ద నాన్‌ స్టాప్‌గా దూసుకుపోతుంది. ఈ మూవీ విడుదలై 11 రోజులు అవుతున్నా, ఏమాత్రం జోరు తగ్గలేదు. కానీ వీకెండ్‌లో ఈ మూవీకి వసూళ్లు పెరిగాయి. ఆదివారం ఊహించని విధంగా జంప్‌ కనిపించింది. అదిరిపోయే వసూళ్లని రాబట్టింది. ఈ చిత్రానికి ఆదివారం ఏకంగా రూ.30కోట్లు రావడం విశేషం. ఇండియాలో ఈ స్థాయిలో కలెక్షన్లని సాధించడం మరో విశేషం. ఓవర్సీస్‌లో దీనికి ఏకంగా పది కోట్ల రూపాయలు వచ్చాయి. మొత్తంగా 11వ రోజు ప్రపంచ వ్యాప్తంగా దీనికి ఏకంగా రూ.40కోట్లు వచ్చాయి. బాక్సాఫీసు వద్ద ఈ సినిమా ఎంత స్ట్రాంగ్‌గా ఉందనేది తాజా వసూళ్లు చెబుతున్నాయి.

24
జైలర్‌ 2 టోటల్‌, స్టేట్‌ వైడ్‌ కలెక్షన్లు

`జైలర్‌ 2` 11 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ.710.35కోట్ల గ్రాస్‌ని సాధించింది. ఇండియాలో ఇది రూ.466.85కోట్ల గ్రాస్‌ని, రూ.398.70కోట్ల నెట్‌ని సాధించగా, ఓవర్సీస్‌లో దీనికి రూ.243.50కోట్లు వచ్చాయి. ఇక 11వ రోజున తెలుగులో రూ4.50కోట్ల గ్రాస్‌ వచ్చాయి. తమిళంలో రూ.17.35కోట్లు రాబట్టగా, హిందీలో రూ.3.15కోట్లు, కన్నడలో 70లక్షలు వసూలు చేసింది. సాక్నిల్క్ లెక్కల ప్రకారం ఈ మూవీ తెలుగులో ఇప్పటి వరకు రూ.85.65కోట్లు, తమిళంలో రూ.182.25కోట్లు, కన్నడలో రూ.80.40కోట్లు, కేరళాలో రూ.70.60కోట్లు, హిందీలో రూ.47.95కోట్లు వసూలు చేసింది.

34
జైలర్‌ 2తో నిర్మాతకి, బయ్యర్లకి లాభాల పంట

`జైలర్‌ 2` మూవీ తెలుగులో ఇప్పటికే బ్రేక్‌ ఈవెన్‌ అయ్యిందని సమాచారం. మొన్న నిర్మాత రవిశంకర్‌ మాట్లాడుతూ, శనివారంతోనే జైలర్‌ 2 బ్రేక్‌ ఈవెన్‌ అయ్యిందని తెలిపారు. తెలుగులోనే కాదు, ఇది దాదాపు అన్నిచోట్ల బ్రేక్‌ ఈవెన్‌ అయ్యిందని, ఇప్పుడు లాభాల్లో నడుస్తోందని సమాచారం. ఈ మూవీకి సుమారు థియేట్రికల్‌ వసూళ్లు మూడు వందల కోట్లుగా లెక్కకట్టారు. ఆరువందల కోట్ల గ్రాస్‌ వస్తే బ్రేక్‌ ఈవెన్‌ అవుతుంది. ఇప్పుడు ఏడు వందల కోట్లు దాటింది. దీంతో రికార్డు స్థాయిలో లాభాలను రాబడుతున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ లాంగ్‌ రన్‌లో ఊహించని లాభాలను తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు. సినిమాని కొన్న బయ్యర్లకి, నిర్మాతలకు లాభాల పంట పండినట్టే అని చెప్పొచ్చు.

44
జైలర్‌ 2 లో హైలైట్‌ ఇదే

రజనీకాంత్‌ హీరోగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన `జైలర్‌ 2` మూవీ.. మూడేళ్ల క్రితం వచ్చిన `జైలర్‌`కి సీక్వెల్‌. ఇందులో రమ్యకృష్ణ, మీర్నా, యోగిబాబు, నమో నారాయణ, ఎస్‌ జే సూర్య, విద్యాబాలన్‌, మిథున్‌ చక్రవర్తి కీలక పాత్రల్లో నటించగా, మోహన్‌లాల్‌, శివరాజ్‌ కుమార్‌, హృతిక్‌ రోషన్‌, జాకీ షరాఫ్‌ క్యామియో రోల్స్ లో మెప్పించారు. నెల్సన్‌ టేకింగ్‌, రజనీ ఎలివేషన్లు, స్టయిల్‌, అనిరుధ్‌ బీజీఎం సినిమాకి హైలైట్‌గా నిలిచింది. దసరా స్పెషల్‌గా అక్టోబర్‌ 15న ఈ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories