బిగ్ బాస్ తెలుగు 10 ఏడో వారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది. చివర్లో ఎలిమినేట్ అయిన షాలిని కామనర్‌గా హౌజ్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. మరి ఆమె ఎంత పారితోషికం తీసుకుందనేది చూస్తే..
బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్‌లో ఏడో వారం డబుల్ ఎలిమినేషన్ చోటు చేసుకుంది. ఆడియెన్స్ ఓటింగ్ ద్వారా దక్షి ఎలిమినేట్ అయ్యింది. ఇక రెడ్ జోన్‌లో ఉన్న వారిలో ఒకరిని హోస్ట్ నాగార్జున ఎలిమినేట్ చేశారు. హౌజ్ మేట్స్ ఓటింగ్‌తో షాలినిని ఎలిమినేట్ చేశారు. అయితే షాలిని ఎలిమినేషన్‌తో పాటు ఆమెకు అందిన పారితోషికం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏడు వారాల పాటు హౌస్‌లో కొనసాగిన ఆమె ఎంత సంపాదించిందనే చర్చ బుల్లితెర ప్రేక్షకుల్లో మొదలైంది. రెండు వారాలు ఉన్న దక్షికి, ఏడు వారాలు ఉన్న షాలినికి పారితోషికం సేమ్ కావడం ఆశ్చర్యపరుస్తోంది.
24
వారానికి రూ.75 వేల పారితోషికం?
షాలిని కామనర్‌గా హౌజ్‌లోకి వచ్చింది. అగ్నిపరీక్ష ద్వారా ఆమె ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. షాలినికి బిగ్ బాస్ తెలుగు 10లో వారానికి సుమారు రూ.75 వేల పారితోషికం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఆమె ఏడు వారాల పాటు హౌస్‌లో కొనసాగినందుకు సుమారు రూ.5.25 లక్షలు అందుకున్నట్లు సమాచారం. రెండు వారాలు ఉన్న దక్షి పారితోషికం ఐదు లక్షలు కావడం విశేషం. ఇలా ఇద్దరికీ సేమ్ దక్కింది.
34
సీక్రెట్ రూమ్ నుంచి వచ్చినా మారని ఆటతీరు
షాలిని బిగ్ బాస్ ప్రయాణం సాధారణంగా సాగలేదు. ఆరో వారం ఎలిమినేషన్ సమయంలో ఆమెను నేరుగా ఇంటి నుంచి బయటకు పంపకుండా సీక్రెట్ రూమ్‌కు పంపించారు నాగార్జున. దీంతో తానేంటో నిరూపించుకునేందుకు ఆమెకి మరో అవకాశం ఇచ్చారు. సీక్రెట్ రూమ్‌లో ఉండి ఇతర కంటెస్టెంట్ల ఆటతీరును గమనించిన ఆమె తిరిగి హౌస్‌లోకి అడుగుపెట్టింది. రీ ఎంట్రీతో తన ఆటను మార్చుకుని ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చాలామంది భావించారు. కానీ తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆమె ప్రవర్తనలో ఆశించిన మార్పు కనిపించలేదు. గొడవ విషయంలో చాలా దారుణంగా ప్రవర్తించింది. దీనికితోడు రెడ్ జోన్ లో ఉంది. దీంతో బిగ్ బాస్ కావాలని ప్లాన్ చేసి ఆమెని ఇంటికి పంపించారు. అయితే హౌజ్ మేట్సే ఆమె ఎలిమినేట్ కావాలని కోరుకోవడం గమనార్హం.
హౌస్‌లో షాలిని, రోహిత్ మధ్య సాగిన పరిచయం, వారి మధ్య కనిపించిన సాన్నిహిత్యం కూడా చర్చనీయాంశమయ్యాయి. కొంతమంది ప్రేక్షకులు ఈ జోడీని ఇష్టపడగా, మరికొందరు షాలిని తన వ్యక్తిగత గేమ్‌పై ఎక్కువగా దృష్టి పెట్టలేదని విమర్శించారు. టాస్కుల్లో తన ప్రతిభను నిరూపించుకోవడం, బలమైన వ్యూహాలతో ముందుకు వెళ్లడం వంటి అంశాల్లో ఆమె మరింత మెరుగ్గా ఆడాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.