‘పుష్ప 2’ఐటెం సాంగ్ లో తెలుగు హీరోయిన్ ? షాకింగ్ మేటర్

First Published | Nov 2, 2024, 12:19 PM IST

పుష్ప 2 లో స్పెషల్ సాంగ్ కోసం ఒక తెలుగు హీరోయిన్ ని ఎంచుకున్నారు, దీనికి రూ.2 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినట్టు సమాచారం. ఈ పాటలో శ్రీలీల నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2


సుకుమార్ సినిమాలో ఓ ఐటెం సాంగ్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుందనే సంగతి తెలిసిందే.  పుష్పలోని 'ఊ అంటావా మావా సాంగ్' ఎంత హిట్ అయిందో చూశాం. ఇప్పుడు రాబోతున్న పుష్ప–2 లోను ఐటం సాంగ్ ను ప్లాన్ చేశాడు

సుక్కు. ఈ ఐటెం సాంగ్ కోసం మేకర్స్, తెలుగు హీరోయిన్ ని తీసుకున్నారని తెలుస్తోంది. ఈ సాంగ్ కోసం ఏకంగా రూ.2  కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినట్టు టాక్ నడుస్తుంది.  ఇంతకీ ఎవరా హీరోయిన్ . వివరాల్లోకి వెళ్తే..

Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2


అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప-2’. ప్రస్తుతం మూవీ షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాకోసం ఓ స్పెషల్  సాంగ్ ని చిత్రీకరించాల్సి ఉంది.

 కొంత మేర క్లైమాక్స్ షూట్ మినహా మిగతా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 5 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. కాగా. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట హల చల్ చేస్తోంది. 



'పుష్ప ది రూల్​'లో  స్పెషల్  సాంగ్​లో ఎవరు కనిపించనున్నరన్న సస్పెన్స్ వీడినట్లే! ఈ పాటకోసం మూవీ మేకర్స్  టాలీవుడ్ బ్యాటీ శ్రీలీలని సంప్రదించారట. ఆమె నుంచి కూడా పాటిజివ్ రెస్పాన్స్​ వచ్చినట్లు సమాచారం.

దీంతో స్పెషల్ సాంగ్​లో బన్నితో కలిసి, శ్రీలీల చిందులేయడం దాదాపు ఖాయమైనట్లే! ఈ వారంలోనే  ఈ పాట చిత్రీకరణ ఉంటుందని తెలిసింది. కానీ, ఇంకా అఫీషియల్ అనౌన్స్​మెంట్ రావాల్సి ఉంది.
 


ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో ‘పుష్ప’ తీర్చిదిద్దారు. కూలీగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన పుష్పరాజ్‌.. ఎర్రచందనం సిండికేట్‌ను శాసించే స్థాయికి ఎలా వెళ్లాడనే ఆసక్తికర అంశాలతో ‘పుష్ప ది రైజ్‌’ చిత్రీకరించారు.

ఆ తర్వాత అతడికి ఎదురైన ఇబ్బందులు ఏమిటి? వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అనే అంశాలతో ‘పుష్ప ది రూల్‌’ సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఇది షూటింగ్ దశలో ఉంది.

allu arjun movie Pushpa2 The Rule release on december 5th


 ఇక ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ లో ఎవరు నటిస్తున్నారు?అనే విషయమై నిర్మాత గతంలో మాట్లాడుతూ.. ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. తుది దశ చిత్రీకరణలో ఆ పాటే మిగిలి ఉంది. నవంబరు 4 నుంచి షూట్‌ చేయాలనుకుంటున్నాం.

రెండు రోజుల్లో ఆ వివరాలు ప్రకటిస్తాం. అలాగే ‘పుష్ప 2’ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ రూ. 1000 కోట్లు క్రాస్‌ అయిందనే వార్తలొస్తున్నాయి. నిజమేనా? అంటే...థియేట్రికల్‌, నాన్‌ థియేట్రికల్‌ కలిపి అలా చెబుతున్నారు. అయితే, నాన్‌ థియేట్రికల్‌ విషయంలో ఇప్పటి వరకూ ఏ సినిమా చేయని బిజినెస్‌ చేసింది అని చెప్పుకొచ్చారు. 
  

Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2


ఈ చిత్రం నిమిత్తం అల్లు అర్జున్ కు భారీగానే రెమ్యునరేషన్ ముట్టనుంది. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం వెయ్యి కోట్ల దాకా  ప్రీ రిలీజ్ చేసింది. నాన్ థియేటర్ బిజినెస్ తో మేకింగ్ కాస్ట్ మాగ్జిమం రికవరీ అయ్యిపోయింది. దాంతో భారీ లాభాలు వచ్చాయి.

ఇక  ఈ చిత్రం నిమిత్తం సుకుమార్, అల్లు అర్జున్ పార్టనర్స్ గా రెమ్యునేషన్ తీసుకోవాలని మొదటే ఎగ్రిమెంట్ చేసుకున్నారు. దాంతో అల్లు అర్జున్ కు 300 కోట్లు దాకా రెమ్యునరేషన్ అందినట్లు తెలుస్తోంది. తెలుగు హీరోలు ఇది భారీ మొత్తం. ఇప్పటిదాకా ఏ హీరోకు ఈ స్దాయి రెమ్యునరేషన్ అందుకోలేదు. 

Latest Videos

click me!