ప్రస్తుతం హౌస్ K- బ్యాచ్ బాగా హైలైట్ అవుతోంది. K- బ్యాచ్ అంటే కన్నడ నటీనటులు నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, యాష్మి అని నెటిజన్లు డిసైడ్ చేశారు. సోషల్ మీడియాలో వీళ్ళకి మద్దతుగా పెద్ద ఎత్తున ప్రొమోషన్స్ జరుగుతున్నాయి. అదే క్రమంలో వీళ్ళని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు కూడా. టాస్క్ లలో కుమ్మక్కు కావడం.. ఎలాగోలా ఇతరులని టార్గెట్ చేసి పక్కకి తప్పించడం లాంటివి చేస్తున్నారు అంటూ నెటిజన్లు ఆరోపిస్తున్నారు.