ఉదయ్ కిరణ్, తరుణ్, ఆర్తి, సదా..  అరుదైన ఫోటో వైరల్, ఎప్పుడు? ఎక్కడ దిగారో తెలుసా?

First Published | Nov 2, 2024, 12:02 PM IST

ఒకప్పుడు స్టార్స్ గా వెలిగిన ఉదయ్ కిరణ్, తరుణ్, ఆర్తి అగర్వాల్, సదా కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటో నేపథ్యం ఏమిటో చూద్దాం.. 
 

ఉదయ్ కిరణ్, తరుణ్ లవర్  బాయ్ ఇమేజ్ తో సూపర్ హిట్స్ ఇచ్చారు. వీరిద్దరి కెరీర్ దాదాపు ఒకే సమయంలో మొదలైంది. ఉదయ్ కిరణ్ డెబ్యూ మూవీ 'చిత్రం' 2000లో విడుదల కాగా.. అదే ఏడాది నువ్వే కావాలి చిత్రంతో తరుణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ రెండు చిత్రాలు భారీ విజయాలు నమోదు చేశాయి.

నువ్వు నేను, మనసంతా నువ్వే చిత్రాలతో ఉదయ్ కిరణ్ హ్యాట్రిక్ పూర్తి చేశాడు. అనంతరం ఆయన నటించిన కలుసుకోవాలని, శ్రీరామ్, నీ స్నేహం సైతం చెప్పుకోదగ్గ విజయాలు అందుకున్నాయి. తర్వాతి కాలంలో ఉదయ్ కిరణ్ చిత్రాలకు ఆదరణ కరువైంది. ఆయనకు వరుస ప్లాప్స్ పడ్డాయి. 

మరోవైపు తరుణ్ ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే వంటి చిత్రాలతో యూత్ లో ఫేమ్ తెచ్చుకున్నాడు. ఉదయ్ కిరణ్ వలె తరుణ్ కెరీర్ కూడా సాఫీగా సాగలేదు. ఆయనకు కూడా హిట్స్ కరువయ్యాయి. దాంతో పరిశ్రమకు దూరం కావాల్సి వచ్చింది. కాగా తమ తమ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఉదయ్ కిరణ్, తరుణ్ ఒక సందర్భంలో కలిశారు. వారితో పాటు హీరోయిన్స్ సదా, ఆర్తి అగర్వాల్ ఈ ప్రమోషనల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
 


2005లో తరుణ్-ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన సోగ్గాడు, ఉదయ్ కిరణ్-సదా కలిసి నటించిన ఔనన్నా కాదన్నా చిత్రాలు వారం రోజుల వ్యవధిలో విడుదలయ్యాయి. ఈ చిత్రాల ప్రమోషన్స్ లో భాగంగా హుస్సేన్ సాగర్ బోట్ లో తరుణ్, ఉదయ్ కిరణ్, సదా, ఆర్తి అగర్వాల్ చక్కర్లు కొట్టారు. అప్పటి ఫోటో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఈ రెండు చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఉదయ్ కిరణ్ కి చిత్రం, నువ్వు నేను వంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన తేజ తెరకెక్కించిన ఔనన్నా కాదన్నా నిరాశపరిచింది. దర్శకుడు తేజ సైతం ఆ సమయంలో హిట్ కోసం స్ట్రగుల్ అవుతున్నాడు. ఇక ఈ ఫోటోలో ఉన్న నలుగురిలో ఇద్దరు జీవించి లేకపోవడం విషాదకరం. 

Uday Kiran


ఒకప్పటి వైభవం కోల్పోయిన ఉదయ్ కిరణ్ మస్తాపంతో 2014లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతో భవిష్యత్ ఉన్న హీరో చిన్న వయసులోనే కన్నుమూశాడు. అలాగే ఆర్తి అగర్వాల్ అనారోగ్యంతో మరణించింది. బరువు తగ్గడం కోసం ఆర్తి అగర్వాల్ లైపో సక్షన్ చేయించుకుంది. ఈ వైద్యం వికటించడంతో ఆమె కన్నుమూశారు. 
 

Aarthi Agarwal

తరుణ్-ఆర్తి అగర్వాల్ ప్రేమించుకున్నారని, పెళ్ళికి పెద్దలు ఒప్పుకోలేదనే వాదన ఉంది. ఇక తరుణ్ విషయానికి వస్తే... ఆయన ఫేడ్ అవుట్ అయ్యాడు. నువ్వే నువ్వే అనంతరం తరుణ్ కి హిట్ లేదని చెప్పొచ్చు. 2014 తర్వాత తరుణ్ సినిమాలు చేయలేదు. నాలుగేళ్లు గ్యాప్ ఇచ్చి 2018లో ఇది నా లవ్ స్టోరీ టైటిల్ తో ఒక చిత్రం చేశాడు. అది కూడా ఆడలేదు.

తొమ్మిదో వారం బిగ్ బాస్ హౌజ్ నుంచి ఎగ్జిట్ అయ్యేది ఎవరు?

Actress Sadha

ఇక సదా కూడా పెద్దగా సినిమాలు చేయడం లేదు. ఆమెకు బిగినింగ్ లో భారీ హిట్స్ పడ్డాయి. కానీ స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. టైర్ టూ హీరోలకు పరిమితం అయ్యింది. బ్రేక్ తీసుకున్న సదా 2023లో రీ ఎంట్రీ ఇచ్చింది. గత ఏడాది సదా అహింస, ఆదికేశవ చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసింది. ఆమె బుల్లితెర మీద సందడి చేస్తుంది. పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెబుతుంది. సదా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కావడం విశేషం. 

Latest Videos

click me!