తమిళ ఇండస్ట్రీని ఊపేస్తోన్న కింగ్ నాగార్జున, యూత్ లో సైమన్ కిక్కు మామూలుగా ఎక్కలేదుగా

Published : Aug 20, 2025, 12:16 PM IST

తమిళనాడులో లేట్ అయినా లేటెస్ట్ గా ట్రెండ్ అవుతున్నాడు టాలీవుడ్ కింగ్ నాగార్జున. ఒక రకంగా కోలీవుడ్ లో రచ్చ రచ్చ చేస్తున్నాడు. 65 ఏళ్ల వయస్సులో అక్కడి మహిళా అభిమానులను బుట్టలో వేసేశాడు. 

PREV
16

65 లో కూడా ఫిట్ గా కింగ్ నాగార్జున

కింగ్ నాగార్జున ఏజ్ పెరుగుతున్నాకొద్ది మరింత యంగ్ గా తయారవుతున్నాడు. 65 ఏళ్ల వయస్సులో కూడా కుర్ర హీరోలా కనిపిస్తున్నాడు నాగ్. ఫిట్ నెస్, గ్లామర్ ను కరెక్ట్ గా మెయింటేన్ చేస్తూ, ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. సినిమాలు తగ్గించినా బుల్లితెరపై హోస్ట్ గా అదరగొడుతున్నాడు. నచ్చిన ఫుడ్ ను మితంగా తింటూ, డైలీ వ్యాయామం చేస్తూ, మెడిటేషన్ తో మైండ్ ను రిలీక్స్ గా ఉండేలా చూసుకుంటాడు నాగార్జున. తాను ఇంత యంగ్ గా ఉండటానికి కారణం ఫుడ్ తో పాటు, నెగెటీవ్ గా ఆలోచించకుండా ఉండటమే అని ఓ సందర్భం ఆయన అన్నారు.

DID YOU KNOW ?
33 ఏళ్ల క్రితం
టాలీవుడ్ కింగ్ నాగార్జున, సూపర్ స్టార్ రజినీకాంత్ 1991 లో రిలీజ్ అయిన శాంతి క్రాంతి సినిమాలో కలిసి నటించారు. మళ్లీ 33 ఏళ్ల తరువాత కూలీ సినిమాలో కలిసి నటించారు.
26

తమిళ ప్రేక్షకుల మనసు దోచుకున్న నాగ్

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తాజాగా తమిళ ప్రేక్షకులను తనదైన శైలిలో ఆకట్టుకుంటున్నాడు. స్టైలిష్ లుక్స్, ఫిట్ నెస్, యాక్టింగ్ తో లేడీ ఫ్యాన్స్ ను ఆకర్శిస్తున్నాడు కింగ్. రీసెంట్ గా రిలీజ్ అయిన తమిళ చిత్రం కూలీ (Coolie) లో నాగార్జున నటించిన సైమన్ పాత్ర ప్రేక్షకులపై గట్టి ప్రభావం చూపిస్తోంది. లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో నాగార్జున విలన్‌గా నటించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కెరీర్‌లో తొలిసారి నాగార్జున పూర్తి స్థాయి ప్రతినాయకుడిగా నటించడమే కాకుండా, ఇంత స్టైలీష్ విలన్ ను తమిళ ఆడియన్స్ ఇంత వరకూ చూడలేదన్నట్టుగా రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం తమిళనాట నాగార్జున హాట్ టాపిక్ గా మారాడు. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నాడు.

36

యూత్ కు కిక్కిచ్చిన సైమన్ పాత్ర

నాగార్జున సైమన్ క్యారెక్టర్ కి తమిళనాట విపరీతమైన స్పందన లభిస్తోంది. ముఖ్యంగా యూత్ లో నాగార్జున సైమన్ క్యారెక్టర్ ఇచ్చిన కిక్ మామూలుగా లేదు. ఆయన లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్ గురించి సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతోంది. తమిళంలో సైమన్ పాత్రపై వందలాది మీమ్స్, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్ లో సైమన్ క్యారెక్టర్ షాట్స్ ట్రెండింగ్ లో కొనసాగుతున్నాయి. నేటి తరం స్టార్ హీరోలకే సవాల్ విసిరేలా 66 ఏళ్ల వయస్సులో కూడా నాగార్జున చూపించిన స్టైల్ అద్భుతమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

46

నాగార్జున అభిమానుల అసంతృప్తి

ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో నాగార్జున పాత్రను ఎంతో స్టైలిష్‌గా, పవర్ఫుల్‌గా చూపించడంపై ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. కానీ, సెకండ్ హాఫ్ లో నాగార్జున క్యారెక్టర్‌ను చాలా తక్కువ ప్రాధాన్యతతో చూపించడంపై అక్కినేని అభిమానులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన పాత్రను హీరో ముందు బలహీనంగా చూపించారని, ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని థియేటర్ల వద్ద నాగార్జున ఫ్లెక్సీలను కోసివేసిన సంఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. తమ అభిమాన నటుడు ఇలా విభిన్న పాత్రలు చేయడం సరే కానీ, అతడి ప్రతిభను పూర్తిగా ప్రదర్శించేలా స్క్రీన్ స్పేస్ ఇవ్వకపోవడంపై ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. “ఇలాంటి పాత్రలు మళ్లీ చేయకండి” అంటూ నెటిజన్లు నాగార్జునను ట్యాగ్ చేస్తూ రిక్వెస్ట్ చేస్తున్నారు.గతంలో ఆయన నటించిన రక్షకుడు సినిమాకు కూడా తమిళనాడులో ఇలాంట రెస్పాన్స్ వచ్చింది. కాని అప్పుడు సోషల్ మీడియా ఇంత విస్తృతంగా లేదు.

56

ఫ్యాన్స్ స్పెషల్ రిక్వెస్ట్

ఈ నేపథ్యంలో నాగార్జున అభిమానులు ఒకే అభ్యర్థన చేస్తున్నారు – “ఇలాంటి లుక్స్, ఎనర్జీతో కూడిన పాత్రలు ఇకపై ఆయన నటించే సోలో హీరో సినిమాల్లో చూడాలని కోరుతున్నారు.” ఆయనలో 300 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్ల సామర్థ్యం ఉందని, టాలెంట్‌ను సరిగా వాడుకుంటే మళ్లీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించవచ్చని నమ్మకంగా చెబుతున్నారు.ఇప్పటికైనా టాలీవుడ్ డైరెక్టర్లు నాగార్జున  స్థాయిని గుర్తించి, భారీగా ప్లాన్ చేస్తారేమో చూడాల్సిందే.

66

అక్కినేని వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ

తెలుగు సినీ పరిశ్రమలోకి అక్కినేని నాగేశ్వరావు వారసుడిగా ఎంట్రీ ఇచ్చి, తన టాలెంట్ తో స్టార్ హీరోగా ఎదిగాడు నాగార్జున. ఇండస్ట్రీలో యువసామ్రాట్ గా, టాలీవుడ్ మన్మధుడిగా, కింగ్ నాగార్జునగా వెలుగు వెలిగాడు. టాలీవుడ్ కు నాలుగు స్థంభాల్లా నిలిచిన హీరోలలో, చిరంజీవి, వెంకటేష్,బాలయ్యతో పాటు నాగార్జున కూడా ఓ పిల్లర్ లా నిలబడ్డారు. అక్కినేని నట వారసుడిగా మాత్రమేకాదు, బిజినెస్ లను కూడా అంతే సమర్దవంతంగా నిర్వహిస్తూ, భారీగా ఆస్తులు కూడా కూడబెట్టారు నాగార్జున. హీరోగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా, బిజినెస్ మెన్ గా నాగార్జున ప్రతీ రంగంలో సక్సెస్ అయ్యారు అక్కినేని నాగార్జున.

Read more Photos on
click me!

Recommended Stories