18 ఏళ్ళ వయస్సులో 50 ఏళ్ల ముసలి సీఎంతో పెళ్లి, 125 కోట్లకు యజమాని ఎవరా హీరోయిన్?

Published : Feb 07, 2025, 03:25 PM IST

చాలా చిన్న వయస్సులో ముసలి సీఎం ను పెళ్ళి చేసుకుని అందరికి షాక్ ఇచ్చింది ఓ హీరోయిన్, జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిని.. కష్టపడి 100 కోట్ల ఆస్తికి యజమాని అయ్యింది. ఇంతకీ ఎవరా బ్యూటీ..? ఏంటా కథ. 

PREV
16
18 ఏళ్ళ వయస్సులో 50 ఏళ్ల ముసలి సీఎంతో పెళ్లి, 125 కోట్లకు యజమాని ఎవరా హీరోయిన్?

ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది మాయా లోకం, పెద్దలు ఊరికే అనలేదు. సినిమా ఇండస్ట్రీ అంటే రంగుల ప్రపంచం.. ఇక్కడ ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. ఎప్పుడు ఎవరి సుడి ఎలా తిరుగుతుందో ఊహించలేరు. ఇక హీరోలు ఒక్క సారి స్టార్ అయితే చాలు.. వాళ్ల లైఫ్ సెట్ అయినట్టే. కాని మీరోయిన్లు జీవితం మాత్రం జాగ్రత్తగా లేకుంటే రకరకాల మలుపులు తిరుగుతంది.

ఒక్కోసారి డేంజర్ లోకూడా పడుతుంది. అన్నింటిని తట్టుకుని నిలబడ్డవాళ్లు ప్రస్తుతం హ్యాపీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటి హీరోయిన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ హీరోయిన్ ఏకంగా సీఎంను రెండో పెళ్ళి చేసుకోవడంతో  సంచలనంగా మారింది. ఇంతకీ ఆమె  ఎవరు?

Also Read: 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా.. స్టార్ డమ్ రాని తోపు హీరోయిన్, ఇప్పటికీ ప్రయత్నిస్తున్న బ్యూటీ ఎవరో తెలుసా..?

26

ఆ హీరోయిన్ ఎవరో కాదు కన్నడ స్టార్ బ్యూటీ రాధిక కుమార స్వామి. తెలుగులో కూడా ఈ హీరోయిన్ కొన్ని సినిమాలు చేసింది. ఇండస్ట్రీలోకి  చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చింది రాధిక.  9వ తరగతి చదువుతుండగా..  14 సంవత్సరాల వయస్సులో ఆమె తన  కెరీర్ ను స్టార్ట్ చేసింది.

ఇక  ఈ బ్యూటీ.. ఆతరువాత కన్నడలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఏ సినిమాలో లేనన్ని ట్విస్ట్ లు రాధిక జీవితంలో ఉన్నాయి. హీరోయిన్ అవ్వడం, భర్త చనిపోవడంతో పాటు.. సీఎం ను పెళ్ళాడటం ఆతరువాత విడాకులు ఇవ్వడం. ఇలా చెప్పకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. 

Also Read:1000 కోట్ల సినిమాను, ఒక్క యంగ్ హీరో కోసం వదులుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

36

హీరోయిన్ గా చాలా చిన్నవయస్సులోనే స్టార్ డమ్ చూసింది రాధిక.  చిన్న వయస్సులోనే పెళ్ళి చేసుకుని.. రెండేళ్లకే భర్తను కోల్పోయింది. రాధిక ఫస్ట్ పెళ్లి వ్యాపారవేత్తతో 2000 సంవత్సరంలో జరిగింది. ఆమె మొదటి భర్త  2002 లో మరణించారు.

దాంతో రాధిక జీవితం ఇబ్బందుల్లో పడింది. ఇక ఆటైమ్ లోనే  ఆమె కర్నాటక సీఎం కుమార స్వామి ప్రేమలో పడింది. వీరిద్దరికి  2006 సంవత్సరంలో పెళ్ళి జరిగింది. కాని ఆ పెళ్ళి చాలా రహస్యంగా జరిగింది. అప్పట్లో ఈ విషయం సంచలంగా మారింది.

పెళ్లి చేసుకొని హాట్ టాపిక్ గా మారింది  రాధిక.  అప్పటి వరకూ రాధికగా ఉన్న ఆమె రాధిక కుమార స్వామిగా మారింది.  కాని పెళ్ళి తరువాత ఆమె తన సినిమా  జీవితానికి  ముగింపు పలకక తప్పలేదు. 

Also Read:రవితేజ కంటే వయస్సులో చాలా చిన్నది, మాస్ మహారాజ్ కు భార్యగా, వదినగా నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

46
Radhika Kumaraswamy Sandalwood

రాధికా మీద ప్రేమతో కుమార స్వామి ఆమెను పెళ్లి చేసుకున్నారు ఆ టైమ్ లో జనాలు కూడా పాలిటిక్స్ కంటే కూడా..  కుమారస్వామి పర్సనల్ లైఫ్ పైనే ఎక్కవు ఫోకస్ చేశారు.  ఇక్క డ విచిత్రం ఏంటంటే.. రాధిక కంటే కుమార స్వామి చాలా పెద్దవాడు. వీళ్లిద్దరికి దాదాపు 27  ఏళ్ళ వయసు తేడా ఉంది. కుమార్ స్వామి రాధిక కంటే  27 ఏళ్ళు పెద్దవాడు. ఇద్దరికి ఇది రెండో పెళ్ళి. కుమారస్వామి మొదటి వివాహం 1986లో అనితతో జరిగింది. 

 

56
Radhika Kumaraswamy

అంతే కాదు రాధిక 18 ఏళ్ళ వయస్సులో ఈ పెళ్ళి జరిగింది. కుమారస్వామితో పెళ్ళిని ఆమె తండ్రి వ్యతిరేకించాడు. కాని ఆమె గట్టిగా నిర్ణయం తీసుకుని తండ్రిని ఎదిరించి మరీ కుమార స్వామిని పెళ్ళాడింది. వీరికి ఒక కూతురు కూడా. దాదాపు 30 సినిమాల్లో నటించిన రాధిక, తెలుగులో తారక రత్న హీరోగా వచ్చిన భద్రాద్రి రాముడు సినిమాలో ఆతరువాత అవతారం సినిమాలో్ నటించింది. ఇక కుమారస్వామిని వివాహం చేసుకున్న తర్వాత  తన నటనా జీవితాన్ని ముగించింది. 

66

అయితే కొన్నాళ్ళకు వీరు కూడా విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం రాధిక తన కూతురితో ఒంటరిగా జీవిస్తోంది. అయితే ఆమె నటించడంలేదు కాని.. నిర్మాతగా కొత్త జీవితం స్టార్ట్ చేసింది. కొన్ని బిజినెస్ లు కూడా చేస్తోంది. చాలా ఆస్తిని సంపాధించిందట రాధిక. ప్రస్తుతం ఆమె ఆస్తి విలువ దాదాపు 125 కోట్లు ఉంటుందని అంచన. 
 

Read more Photos on
click me!

Recommended Stories