దేశంమీద ప్రేమతో ఎంతో మంది ప్రాణాలు అర్పించి అమరజీవులు అయ్యారు. వారి త్యాగాల ఫలితంగా దేశ ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. దేశం కోసం సేవ చేస్తున్నవారిలో సినిమా ఫ్యామిలీకి చెందిన వారు కూడా ఉన్నారు. ఓ హీరోయిన్ తండ్రి అయితే దేశ కోసం ఏకంగా తన ప్రాణాన్నే త్యాగం చేశారు. ఇంతకీ ఎవరా రియల్ హీరో.
ఆ హీరోయిన్ ఎవరో కాదు బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్. ఆమె తండ్రి ఆర్మీ మేజర్ భూపేంద్ర సింగ్. 1994లో కాశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరాడుతూ.. వారిచేతిలో హత్యకు గురయ్యారు. ఈ విషాద సంఘటన గురించి నిమ్రత్ కౌర్ ఒక పాత ఇంటర్వ్యూలో మాట్లాడారు. తండ్రి మరణం తర్వాత కూడా ధైర్యంగా జీవితాన్ని గడుపుతున్న నిమ్రత్, చిత్ర పరిశ్రమలో తనదైన మార్క్ చూపించుకుంది.
ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది స్టార్స్ కు ఆర్మీ బాక్ గ్రౌండ్ ఉంది. సైనిక నేపథ్యాల నుండి వచ్చిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. కొంతమందికి సైనికులుగా ఉన్న తాతలు ఉన్నారు, మరికొందరికి సైన్యంలో పనిచేసిన తండ్రులు ఉన్నారు. అలాంటి వారిలో నటి నిమ్రత్ కౌర్ తండ్రి మేజర్ భూపేంద్ర సింగ్ కూడా ఒకరు. ఆయన అయితే ఏకంగా దేశం కోసం తన ప్రాణాలను త్యాగం చేశారు.
నిమ్రత్ కౌర్ తండ్రి మేజర్ భూపేంద్ర సింగ్ ను 1994లో కాశ్మీర్‌లో ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. ఉగ్రవాదుల ఆయన్ను చిత్ర హింసలు పెట్టి.. తమ డిమాండ్లు తీరిస్తేనే ఆయన్ను రిలీజ్ చేస్తామన్నారు. వారి డిమాండ్స్ కు ప్రభుత్వం తలొగ్గడానికి నిరాకరించింది.
అంతే కాదు మేజర్ కూడా వారు చెప్పినట్టు చేయడానికి నిరాకరించారు. దాంతో చివరికి ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఆ సమయంలో అతని వయస్సు కేవలం 44 సంవత్సరాలు. నిమ్రత్ కౌర్ వయస్సు 12 సంవత్సరాలు.
నిమ్రత్ కౌర్, ETimes కి ఇచ్చిన పాత ఇంటర్వ్యూలో, తన తండ్రి విషాద మరణం గురించి మాట్లాడింది. 'మా నాన్న ఒక యువ ఆర్మీ మేజర్. తాను వెరినాగ్‌లోని సైనిక సరిహద్దు రోడ్లపై ఇంజనీర్‌గా పనిచేసేవారు. కాశ్మీర్ మా నెటీవ్ ప్లేస్ కానందున, మేం పాటియాలాలోనే ఉండేవారం. సెలవులకు నాన్న దగ్గరకు వెళ్ళేవాళ్లం అని అన్నారు ఆమే.
అలాగే జనవరి 1994లో, శీతాకాల సెలవుల్లో, నిమ్రత్ కౌర్ తన కుటుంబంతో కలిసి తన తండ్రిని కలవడానికి కాశ్మీర్ వెళ్ళింది. అయితే, ఆ సందర్భంలో, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు మేజర్ భూపేంద్ర సింగ్‌ను వర్క్ స్పాట్ నుుంచి కిడ్నాప్ చేశారు. ప్రభుత్వం ఉగ్రవాదుల డిమాండ్లకు తలొగ్గకపోవడంతో ఏడు రోజుల పాటు కస్టడీలో ఉంచిన తర్వాత అతన్ని దారుణంగా హత్య చేశారు.
నిమ్రత్ కౌర్ చెప్పినదాని ప్రకారం, తన తండ్రిని విడుదల చేసినందుకు ప్రతిగా ఉగ్రవాదులు తమ సహచరులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయితే, ఈ డిమాండ్‌ను ఆమోదించలేకపోయారు. నాన్నగారు చనిపోయే సమయానికి కేవలం 44 సంవత్సరాలు. ఆ వార్త విన్న తర్వాత మేము ఢిల్లీకి తిరిగి వచ్చాము. "నేను అతని మృతదేహాన్ని మొదటిసారి ఢిల్లీలో చూశాను" అని నిమ్రత్ భావోద్వేగంతో గుర్తుచేసుకుంది.