Who Is Natalie Burn: అబ్బాయిల గుండెల్లో అలజడి సృష్టించిన `టాక్సిక్` గ్లామర్ డాల్ ఎవరో తెలుసా?

Published : Jan 08, 2026, 06:28 PM IST

Who Is Natalie Burn: యష్‌ నటించిన 'టాక్సిక్' సినిమా టీజర్ విడుదలైంది, ఇది ప్రేక్షకులలో ఆద్యంతం కట్టిపడేస్తుంది. గూస్‌ బంమ్స్ తెప్పించింది. అదే సమయంలో ఓ నటి అలజడి క్రియేట్‌ చేసింది.   

PREV
15
టాక్సిక్ టీజర్ గూస్‌ బంమ్స్

యష్‌ హీరోగా నటించిన `టాక్సిక్‌` మూవీ నుంచి ఆయన బర్త్ డే ట్రీట్‌ వచ్చింది.  భారీ తారాగణం ఉన్న ఈ టీజర్‌ను ప్రేక్షకులు మళ్లీ మళ్లీ చూస్తున్నారు. 2.51 నిమిషాల టీజర్ తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది.

25
టాక్సిక్ సినిమా నటీమణులు

గత వారం నుంచి టాక్సిక్ సినిమా నటీమణుల లుక్స్, పాత్రల పేర్లను చిత్రబృందం వెల్లడిస్తోంది. తారా సుతారియా, రుక్మిణి వసంత్, నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి ముఖ్య పాత్రల్లో నటించారు. కానీ టీజర్‌లో యష్‌తో కనిపించిన నటి  సంచలనం సృష్టిస్తోంది.

35
టీజర్‌తో సంచలనంగా మారిన నటి

తాజాగా విడుదలైన `టాక్సిక్‌` టీజర్‌లో ఒక హాట్ సీన్ కనిపిస్తుంది. టీజర్ విడుదలయ్యాక ఈ బ్యూటీ ఎవరని నెటిజన్లు వెతకడం మొదలుపెట్టారు. యష్‌ తో బోల్డ్‌గా కనిపించిన ఆ గ్లామర్ డాల్ ఎవరో తెలిసిపోయింది.

45
గ్లామర్ డాల్ పేరు నటాలీ బర్న్ (Natalie Burn)

`టాక్సిక్` గ్లామర్ డాల్ పేరు నటాలీ బర్న్. ఉక్రేనియన్-అమెరికన్ నటి, మోడల్. 'ది యాక్టర్స్ స్టూడియో & ది టెలివిజన్ అకాడమీ'లో సభ్యురాలు. ఆమె ది ఎక్స్ పాండబుల్స్ 3, డాన్‌హిల్‌, మెకానిక్‌ రెసురెక్షన్‌ చిత్రాల్లో నటించింది. బోల్డ్ సీన్లకి, బోల్డ్ మూవీస్‌కి, హర్రర్‌ చిత్రాలకు ఆమె కేరాఫ్‌గా నిలుస్తూ వస్తోంది. 

55
నటాలీ బర్న్ (Natalie Burn) నిర్మాత కూడా

కొన్ని రోజుల క్రితమే `టాక్సిక్` సినిమాలో నటిస్తున్నట్లు నటాలీ వెల్లడించారు. నటాలీ చాలా ప్రముఖ మ్యాగజైన్‌లకు మోడల్‌గా పనిచేశారు.  అయితే ఈ మూవీలో ఆమె నటించడంతోపాటు నిర్మాతగానూ వ్యవహరిస్తుండటం విశేషం. యష్‌తో కారు సీన్లో రొమాంటిక్‌ సీన్‌లో ఆమె సృష్టించిన అలజడికి ఇప్పుడు ఇండియా మొత్తం షేక్‌ అవుతుండటం విశేషం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories