Anasuya: వామ్మో దాని గురించి మాట్లాడితే మరో 10 రోజులు స్టఫ్‌ అయిపోతా.. శివాజీపై మరో విధంగా సెటైర్లు

Published : Jan 08, 2026, 05:29 PM IST

అనసూయ ఇటీవల శివాజీ చేసిన కామెంట్లకి స్పందించి వివాదాల్లో ఇరుక్కుంది. ఇప్పుడు దీనిపై ఆమె మరోసారి స్పందించింది. ఓ కొత్త టాపిక్‌పై ఆమె క్రేజీ కామెంట్‌ చేసింది. 

PREV
15
శివాజీ కామెంట్లపై అనసూయ మరోసారి కౌంటర్‌

స్టార్‌ యాంకర్‌, నటి అనసూయ ఇటీవల వరుసగా వివాదాలకు కేరాఫ్‌గా నిలిచింది. నటుడు శివాజీ హీరోయిన్ల డ్రెస్‌ గురించి చేసిన కామెంట్లకి ఆమె రియాక్ట్ కావడంతో రచ్చ పెద్దగా అయ్యింది. అది పది రోజులుగా నడుస్తూనే ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి శివాజీ కామెంట్స్ పై  స్పందించింది అనసూయ. అయితే ఇప్పుడు ఆమె కాస్త యూటర్న్ తీసుకుంది. అదే సమయంలో ఆయనకు మరో విధంగా చురకలు అంటించింది.

25
శివాజీ ఈ విషయం కూడా చెప్పాల్సిందే- అనసూయ

తాజాగా అనసూయ అభిమానులతో సోషల్‌ మీడియాలో చాట్‌ చేసింది. ఇన్‌ స్టాగ్రామ్‌లో ఆమె మాట్లాడుతూ, శివాజీ వాడిన ఆ రెండు పదాలు గురించే కాదు, ఇలా చేయాల్సింది అని చెప్పింది. ``శివాజీగారు ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. ఇప్పుడు ప్రజలు తన మాట వినే స్థాయికి చేరుకున్నారు. కానీ పాత్రల ప్రభావం సినిమాల వరకు ఉంటే బాగుండేది. ఆయన మహిళల సేఫ్టీ గురించి చెప్పిన మాటల్లో మంచి ఉద్దేశ్యం ఉంది. కానీ మగవాళ్లకి కూడా మరో విషయం చెప్పాల్సింది. `అరే అబ్బాయిలు అమ్మాయిలను వాళ్లకి నచ్చినట్టు ఉండనివ్వండి అని, అలాగే ఇలాంటి వెదవలు ఉన్నప్పుడు మనం కూడా వారి నుంచి కాపాడుకోవాలి` అని చెబితే ఇంత రచ్చ అయ్యేది కాదు`` అని తెలిపింది.

35
నా పరువేం పోలేదు

ఇంకా ఈ ఛాటింగ్‌లో అనసూయకి ఆసక్తికర ప్రశ్నలు ఎదురయ్యాయి. మీ ఎనర్జీకి కారణం ఏంటని అడిగితే, నేను కారణజన్మురాలిని అనుకుంటున్నా అంటూ సరదాగా కామెంట్‌ చేసింది. ప్రతి దాంట్లో దూరి పరువు పోగొట్టుకుంటావ్‌ అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించగా, ఎవరి పరువు పోయింది. నా పరువు నా వద్దనే. వాళ్లే పరువు పోగొట్టుకుంటారు. నేను నెగటివిటీ ఏం కాలేదు. మీరు ఏదో లోకంలో ఉన్నట్టుంది` అని తెలిపింది అనసూయ.

45
బహిరంగంగా మూత్ర విసర్జనపై అనసూయ రియాక్షన్‌

అలాగే అమ్మాయిల డ్రెస్సుల గురించి ఇంతగా మాట్లాడుతున్నారు బాయ్స్. వాళ్లు బహిరంగంగా, రోడ్లపై మూత్రం పోస్తున్నారు, దానికేమనాలి అని ఓ నెటిజన్ అడగ్గా, వామ్మో దీనికే పది రోజులుగా నన్ను ఆడుకుంటున్నారు. ఇప్పుడు నేను దానికి రియాక్ట్ అయితే మరో పది రోజులు ఆడుకుంటారు. వాళ్లకు నేను స్టఫ్‌ అయిపోతాను అని తెలిపింది అనసూయ. అయితే తప్పు జరిగితే తాను స్పందిస్తానని, ఆ విషయంలో తాను వెనకడుగు వేయనని తెలిపింది.

55
అనసూయ వివాదాలపై భర్త ఏమంటాడంటే?

మీపై ఇంత ట్రోల్‌ జరుగుతుంది. మీ భర్త రియాక్షన్‌ ఏంటి అని మరో నెటిజన్‌ అడగ్గా, `ఆయన నీ ఇష్టం, నీ రిస్క్ అని చెబుతారు. అలాంటి భర్త ఉండటం సంతోషం. ఆయన్ని ఇలాంటి వాటికి దూరంగా ఉంచాలని నేను అనుకుంటున్నా` అని చెప్పింది స్టార్‌ యాంకర్‌. ఓ రకంగా అనసూయ భర్త ఆమెకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు ఆమె చెప్పింది. ప్రస్తుతం అనసూయ కామెంట్స్ సోషల్‌ మీడియాలో అవుతున్నాయి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories