ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో తన నీలి కళ్లతో దేశవ్యాప్తంగా వైరల్ అయిన మోనాలిసా భోస్లే మరోసారి వార్తల్లో నిలిచింది. కుటుంబ సభ్యులు తమ ప్రేమను అంగీకరించకపోవడంతో ప్రియుడు మహమ్మద్ ఫర్మాన్‌తో కలిసి ఇంటి నుంచి వెళ్లి పెళ్లి చేసుకుంది. వాళ్ల ప్రేమ కథ తెలుసుకుందాం
వైరల్ గర్ల్ మోనాలిసా తన ప్రియుడిని పెళ్లిచేసుకున్న విషయం తెలిసిందే. ఫర్మాన్‌తో కలిసి కేరళకు వెళ్లిన మోనాలిసా… తిరువనంతపురం సమీపంలోని పూవార్‌లో ఉన్న నయనార్ ఆలయంలో వివాహం చేసుకుంది. దీంతో ఈ జంట కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఈ పెళ్లికి కేరళ విద్యాశాఖ మంత్రి వి. శివన్‌కుట్టి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్ హాజరై కొత్త జంటను ఆశీర్వదించడం ప్రత్యేకంగా నిలిచింది.
25
ఫర్మాన్ కూడా నటుడే..
పెళ్లి అనంతరం మోనాలిసా, ఫర్మాన్ మీడియాతో మాట్లాడారు. తమ ప్రేమ కథను వివరించారు. ఓ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరూ మొదటిసారి కలుసుకున్నారని చెప్పారు. ఫర్మాన్ కూడా తాను నటుడేనని, తన మొదటి సినిమాలో కలిసి పనిచేసే సమయంలో మోనాలిసా పరిచయం అయిందని వెల్లడించాడు.
35
ప్రపోజ్ చేసింది తనే
మొదట మోనాలిసానే తనకు ప్రేమను వ్యక్తం చేసిందని ఫర్మాన్ చెప్పాడు. తాను తొలుత ఒప్పుకోలేదని, కానీ ఆమె మాటలు విని చివరకు అంగీకరించానని తెలిపాడు.
ఇద్దరూ సుమారు ఆరు నెలలు డేటింగ్ చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. “ఈ ఆరు నెలల ప్రేమ అరవై ఏళ్ల ప్రేమలా అనిపించింది. అందుకే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం” అని ఫర్మాన్ తెలిపారు.
కేరళలోని నయనార్ ఆలయం చాలా నచ్చడంతో అక్కడే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని ఈ జంట చెప్పింది. “ఇక్కడి ప్రజలు చాలా మంచి వారు. మాకు ఎంతో సహాయం చేశారు” అని ఫర్మాన్ పేర్కొన్నారు.
55
కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు
ఇక ఈ పెళ్లికి తన కుటుంబం ఒప్పుకోలేదని మోనాలిసా తెలిపింది. ఇంట్లో వాళ్లు తనకు వేరే వ్యక్తితో పెళ్లి చేయాలని ప్రయత్నించారని, కానీ తాను అంగీకరించలేదని చెప్పింది. “ఇప్పుడు ఫర్మాన్‌తో పెళ్లి కావడం చాలా ఆనందంగా ఉంది” అని మోనాలిసా ఆనందం వ్యక్తం చేసింది.