జూనియర్ ఎన్టీఆర్ ఎన్ని కిలోలు బరువు తగ్గాడో తెలుసా? తారక్ కు ఎలా సాధ్యం అయ్యింది?

Published : Mar 12, 2026, 11:49 AM IST

సినిమా కోసం ఎంత రిస్క్ చేయడానికైనా వెనకాడడు.. టాలీవుడ్ యంగ్ స్టార్ ఎన్టీఆర్. ఆయన కెరీర్ లో అలాంటివి ఎన్నో చేశాడు. తాజా మరోసారి భారీ స్థాయిలో బరువు తగ్గి అందరికి షాక్ ఇచ్చాడు. ఇంతకీ తారక్ కు అది ఎలా సాధ్యం అయ్యింది. ఏం చేశాడు?

PREV
16
సినిమా కోసం ఏదైనా చేస్తాడు..

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో తన పాత్ర కోసం ఎంత రిస్క్ అయినా చేస్తాడు.. తన పాత్రకు ప్రాణం పోస్తాడు. అందుకోసం తనను తాను పూర్తిగా మార్చుకోడానికి తారక్ వెనకడుకు వేయడు. కెరీర్ బిగినింగ్ నుంచి పాత్రల కోసం ఎన్టీఆర్ చేసిన సాహసాలు అన్నీ ఇన్నీ కావు. 

గతంలో సింహాద్రీ, రాఖీ, నా అల్లుడు వంటి సినిమాల సమయంలో ఎన్టీఆర్ చాలా లావుగా, బొద్దుగా ఉండేవాడు. అయినా సరే తారక్ ను అభిమానులు స్టార్ హీరోను చేశాడు. ఇక సినిమాల కోసం చాలా రిస్క్ చేసి ఎన్టీఆర్ బరువు తగ్గి స్లిమ్ అయ్యాడు. ఈ క్రమంలో ఆయన లుక్‌పై అనేక విమర్శలు వచ్చినా వాటిని పట్టించుకోకుండా తన పనిపైనే దృష్టి పెట్టారు.

26
ఎన్ని విమర్శలు వచ్చినా..

ఎన్టీఆర్ తన లుక్ పై ఎన్ని విమర్శలు వచ్చినా వెనకడుకు వేయలేదు.. ఎప్పటికప్పుడు తన లుక్స్ ను మార్చుకుంటూ.. విమర్శకులు నోర్లు మూయించాడు. తర్వాత కాలంలో తన ఫిట్‌నెస్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన ఎన్టీఆర్ టెంపర్ సినిమా సమయంలో పర్ఫెక్ట్ ఫిట్ లుక్‌తో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఆ సినిమా నుంచి ఎన్టీఆర్ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు.

36
ప్రశాంత్ నీల్ తో తారక్ సినిమా..

ఆర్ఆర్ఆర్ తో తారక్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. దేవర సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను అందించాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక భారీ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం నెమ్మదిగా సాగుతున్నట్టు తెలుస్తోంది. కొన్ని కారణాల వల్ల షూటింగ్ షెడ్యూల్‌లో మార్పులు రావడంతో పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని సమాచారం.

46
ఎన్టీఆర్ లుక్ పై అభిమానుల్లో చర్చ

డ్రాగన్ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి ఎన్టీఆర్ లుక్ గురించి అభిమానుల్లో పెద్ద చర్చ జరుగుతోంది. తారక్ భారీ స్థాయిలో బరువు తగ్గి.. బక్కగా తయారాయ్యారు. ముఖ్యంగా ఇటీవల బెంగళూరులో జరిగిన ఒక ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎన్టీఆర్ హాజరయ్యారు. 

అక్కడ తీసిన ఆయన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ చిత్రాల్లో ఎన్టీఆర్ చాలా సన్నగా కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంత స్లిమ్ అవ్వడం ఆయనకు ఎలా సాధ్యం అయ్యిందని చర్చించుకుంటున్నారు.

56
ఎన్ని కిలోల బరువు తగ్గాడంటే?

డ్రాగన్ సినిమాలోని పాత్ర కోసం ఎన్టీఆర్ సుమారు 18 కిలోల బరువు తగ్గినట్లు తెలుస్తోంది. కేవలం ఐదు నెలల టైమ్ లోనే చాలా కఠినమైన డైట్ , వర్కౌట్స్ కారణంగా తారక్ ఈ మార్పు సాధించారని చెబుతున్నారు. పాత్రకు తగ్గట్టుగా లుక్ కోసం ఎన్టీఆర్ చాలా కష్టపడినట్టు తెలుస్తోంది.

అయితే ఎన్టీఆర్ మరీ సన్నగా కనిపించడం చూసి కొంతమంది అభిమానులు షాక్ అవుతున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ గతంలో ప్రభాస్, యశ్ వంటి హీరోలను ఫిట్ బాడీతో పవర్‌ఫుల్‌గా చూపించిన విషయం తెలిసిందే. దీంతో ‘డ్రాగన్’ సినిమాలో ఎన్టీఆర్‌ను ఆయన ఎలా చూపిస్తారో అన్న ఆసక్తి అభిమానుల్లో పెరిగింది.

66
డ్రాగన్ రిలీజ్ ఎప్పుడు?

ఇక ఈ సినిమాను జూన్ 25న విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. అయితే షూటింగ్ ఇంకా పూర్తికాలేదని, అందువల్ల విడుదల తేదీ వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రిలీజ్ డేట్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories