మహేష్‌ బాబు ఫేవరేట్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా? పాపం సమంతకి మొహం మాడిపోయే

First Published | Sep 27, 2024, 4:13 PM IST

మహేష్‌ బాబుకి ఇష్టమైన హీరోయిన్‌ ఎవరు? ఆయన్ని ఎక్కువగా ఎవరిని ఆరాధిస్తారు? ఎవరి నటనని ఇష్టపడుతుంటాడు? అనే విషయాలు చూస్తే.. 
 

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు అంటే అమ్మాయిలకు పిచ్చి. ఆయన మిల్కీ అందంతో ఆకట్టుకుంటాడు. చాలా మంది అమ్మాయిలు `మహేష్‌ ఏమున్నాడే` అంటుంటారు. ఇలాంటి డైలాగులే ఆయన సినిమాల్లోనూ వినిపిస్తుంటాయి. నాలుగున్నర పదుల వయసులోనూ అంతే గ్లామర్‌ని మెయింటేన్‌ చేస్తున్నారు మహేష్‌. అదే ఫిట్‌నెస్‌ని మెయింటేన్‌ చేస్తున్నారు. మహేష్‌ అంటే అమ్మాయిలకే కాదు, హీరోయిన్లు కూడా ఇష్టపడుతుంటారు. ఆయనపై ప్రశంసలు కురిపిస్తుంటారు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

అలాంటి మహేష్‌కి ఎవరు నచ్చుతారు? ఆయనకు ఇష్టమైన హీరోయిన్‌ ఎవరనేది ఆసక్తికరం. మహేష్‌ బాబు ఎక్కువగా ఎవరిని ఆరాధిస్తారనేది ఆసక్తికరం. ఈ విషయాలను వెల్లడించారు మహేష్‌. పలు సందర్భాల్లో ఆయన తనకు ఇష్టమైన హీరోయిన్ ఎవరో చెప్పేశాడు. అయితే ఆ పేర్లు రెండు మూడు ఉన్నాయి. అందులో సమంత పేరు లేదు. దీంతో ఆమె మొహం మాడిపోయినంత పనైంది. మరి ఇంతకి మహేష్‌ మెచ్చిన హీరోయిన్‌ ఎవరు? సమంతకి ఎందుకు ముఖం మాడిపోయిందనేది చూస్తే, 


మహేష్‌ తన ఆల్ టైమ్‌ ఫేవరేట్‌ నటి శ్రీదేవి అని తెలిపారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పాడు మహేష్‌. ఎన్ని రోజులైనా, ఎంత మంది హీరోయిన్లు వచ్చినా ఆమె ప్లేస్‌ పదిలం అని చెప్పారు. ఇక బాలీవుడ్‌లో తనకు దీపికా పదుకొనె అంటే ఇష్టమని, ఆమె నటన బాగుంటుందని చెప్పారు. ఆమెకి ఫేవరేట్‌ నటి అని ఓ సందర్భంలో చెప్పారు. ఇవన్నీ పక్కన పెట్టి అసలు విషయం చెప్పారు మహేష్‌ బాబు. 
 

సమంత అందరి ముందు నిలదీయడంతో తన మనసులో మాట చెప్పారు. మీ ఫేవరేట్‌ హీరోయిన్‌ ఎవరు అని అడిగింది సమంత. నా పేరు చెప్పు ఫర్వాలేదు తాను ఏమనుకోనని తెలిపింది. కానీ మహేష్‌ సెటైర్లకి, ఎటకారానికి పెట్టింది పేరు. సమంతకి మైండ్‌ బ్లాక్‌ చేస్తూ మరో హీరోయిన్‌ పేరు చెప్పాడు. అది ఎవరో కాదు, తన భార్య నమ్రత. ఈ తరం హీరోయిన్లలో తన భార్యనే నా ఫేవరేట్‌ హీరోయిన్‌ అని చెప్పడంతో సమంతకి ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయాయి. కాసేపు ఆమె మొఖం మాడిపోయినంత పనైంది. గతంలో ఓ పాత ఇంటర్వ్యూలో ఈ కన్వర్జేషన్‌ నడిచింది. అది వైరల్‌ అవుతుంది. 
 

మహేష్‌ బాబు, సమంత కలిసి `దూకుడు` సినిమాలో నటించారు. ఇది పెద్ద కమర్షియల్‌ హిట్‌ అయ్యింది. ఆ సమయంలోనే ఓ చిట్‌చాట్‌లో ఈ సంఘటన చోటు చేసుకోవడం విశేషం. పక్కన త్రివిక్రమ్‌ కూడా ఉన్నారు. మీ కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడు? అందులో తానే హీరోయిన్‌గా ఎప్పుడు తీసుకుంటారని ప్రశ్నించగా, మా కాంబినేషన్‌లో సినిమా కచ్చితంగా ఉంటుంది. అందులో నువ్వుంటావో లేదో తెలియదు అని మహేష్‌ చెప్పడంతో మరో సారి సమంత ఫేస్‌ మాడిపోయింది. సో ఈ ఫన్నీ చిట్‌చాట్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. మహేష్‌, సమంత కలిసి `దూకుడు`తోపాటు `బ్రహ్మోత్సవం`లోనూ నటించారు. ఈ మూవీ ఆడలేదు. 
 

Mahesh Babu

ఇక మహేష్‌ బాబు, నమ్రత కలిసి `వంశీ` సినిమాలో నటించారు. ఈ సినిమా ఆడలేదు. కానీ ఈ మూవీ సమయంలోనే ఈ ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది. ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి అది, ప్రేమగా మారింది. ఒకరినొకరు అర్థం చేసుకుని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఫ్యామిలీ నుంచి మొదట్లో కొంత వ్యతిరేకత వచ్చినప్పటికీ ఆ తర్వాత ఒప్పుకున్నారు. సింపుల్‌గానే మ్యారేజ్‌ చేసుకున్నారు. వీరికి కొడుకు గౌతమ్‌, కూతురు సితార జన్మించారు.  
 

ఇక మహేష్‌ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. అందుకోసం ఆయన కొత్త మేకోవర్‌లోకి మారిపోతున్నారు. గెడ్డం, మీసాలు, జుట్టు పెంచి సరికొత్తగా కనిపిస్తున్నారు. గతంలో ఎప్పుడూ మహేష్‌ని ఇలా చూసి ఉండరని చెప్పొచ్చు. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మరోవైపు సమంత ప్రస్తుతం `మా ఇంటి బంగారం` సినిమాలో నటిస్తుంది. ఆమె నటించిన `సిటాడెల్‌` వెబ్‌ సిరీస్‌ విడుదలకు రెడీ అవుతుంది. 
 

Latest Videos

click me!