ఇవి కాకుండా రానా దగ్గుబాటి అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ఒక షో చేస్తున్నట్టుగా తెలిసింది. ఈ షో కి 'ది రానా కనెక్షన్' అని పిలుస్తున్నారు. ఇందులో రానా దగ్గుబాటి దక్షిణాదికి చెందిన అగ్ర నటులను ఒక దగ్గరకి చేర్చి వారితో సంభాషించనున్నట్టుగా తెలుస్తోంది.
అయితే ఇంతకు ముందు నటులతో చాలా షో లు వచ్చినా, రానా ఇది తన మార్కు వుండేటట్టుగా ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తో వెళుతున్నట్టుగా తెలిసింది. ఈ షో కోసమని రామానాయుడు స్టూడియో లో ఒక సెట్ కూడా తయారవుతోంది అని వినికిడి. అలాగే కొన్ని తెలుగు సినిమాలు కూడా ఈ సంవత్సరం ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.