శోభన్ బాబు టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరిగా వెలిగారు. ఫ్యామిలీ చిత్రాల హీరోగా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఆ రోజుల్లో అత్యంత అందమైన హీరో శోభన్ బాబు.
Sobhan Babu
శోభన్ బాబు చాలా క్రమశిక్షణ కలిగిన హీరో. ప్రతి విషయంలో ప్రణాళికాబద్దంగా ఉండేవారట. ముఖ్యంగా సంపాదనను పెట్టుబడిగా మార్చడంలో దిట్ట. శోభన్ బాబు ఆ రోజుల్లో సంపాదించిన ఆస్తి వేల కోట్లకు చేరిందని సమాచారం. భూమి మీద పెట్టుబడి పెడితే ఎప్పటికైనా బంగారం అవుతుందని ఆయన నమ్మేవారట.
తన తోటి నటులకు కూడా శోభన్ బాబు సలహాలు ఇచ్చేవారట. శోభన్ బాబు సలహా పాటించి కోట్లు సంపాదించిన నటులు చాలా మందే ఉన్నారు. అదే సమయంలో శోభన్ బాబు సలహాలను పెడచెవిన పెట్టి నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. శోభన్ బాబు వద్దని వారిస్తున్నా చంద్ర మోహన్ కొన్ని ప్రాపర్టీస్ అమ్ముకుని వందల కోట్లు నష్టపోయాడట.
జయసుధ సైతం అలాగే తప్పటడుగులు వేసిందట. వందల కోట్ల రూపాయల ఆస్తిని కోల్పోయిందట. శోభన్ బాబు-జయసుధ పదుల సంఖ్యలో చిత్రాలు చేశారు. వీరి మధ్య మంచి అనుబంధం ఉండేది. శోభన్ బాబును జయసుధ సెట్స్ లో ఆటపట్టిస్తూ ఉండేదట. అలాగే శోభన్ బాబు జయసుధను అత్త అని పిలిచేవారట.
వీరిద్దరూ సమకాలీన నటులు కూడాను. 70-80లలో స్టార్డం అనుభవించారు. ఒక రోజు షూటింగ్ కోసం ఒకే కార్లో శోభన్ బాబు, జయసుధ వెళుతున్నారట. ఏమోయ్.. నీకు ఒక స్థలం చూపిస్తాను. మీ నాన్నకు చెప్పి ఆ స్థలం కొనుక్కో, అన్నాడట. అనంతరం జయసుధ తన భర్తకు చెప్పి ఆ ప్లేస్ చూడటానికి వెళ్లిందట.
అక్కడ అంతా చెత్త వేస్తున్నారట. అది ఓ డంపింగ్ యార్డ్ అట. ఆ స్థలం చూసి ఈయనకేమైనా పిచ్చా... డంపింగ్ యార్డ్ కొనమంటాడేంది, అనుకుందట. ఇలాంటి స్థలం ఎలా కొనమంటారండి.. అని జయసుధ అన్నారట. కొన్నాళ్లలో ఇదంతా లెవెల్ చేసి కమర్షియల్ ఏరియా చేస్తారు. కాబట్టి ఇక్కడ స్థలం కొను, అని శోభన్ బాబు అన్నారట.
కానీ జయసుధ వినలేదట. ఆ స్థలం ఆమె కొనలేదట. కట్ చేస్తే... అది చెన్నై లోని అన్నా నగర్. అక్కడ ఇప్పుడు ఎకరం వంద కోట్లు ఉంది. శోభన్ బాబు చెప్పినట్లు కనీసం రెండు మూడు ఎకరాల స్థలం కొనుకున్నా జయసుధ వందల కోట్ల ఆస్తిపరురాలు అయ్యేది. ఈ విషయం ఓ కార్యక్రమంలో చెప్పి ఆమె వాపోయింది. ఆయన మాట వినకపోవడం వలన భారీగా నష్టపోయానని చెప్పింది.
శోభన్ బాబు తన పిల్లలను మాత్రం పరిశ్రమకు దూరంగా పెంచాడు. ఆయనకు ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు. అబ్బాయి పేరు కరుణ శేషు. కొడుకు పరిశ్రమకు వచ్చి డబ్బులు ఎక్కడ పాడు చేస్తాడో అని... వ్యాపారస్తుడిగా మార్చాడు. చెన్నై కేంద్రంగా కరుణ శేషు పలు వ్యాపారాలు చేస్తున్నారు.
హీరోగా స్టార్డం తగ్గాక శోభన్ బాబు సినిమాలు చేయలేదు. పలు చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్ రోల్స్ ఆయన తలుపు తట్టాయి. అతడు మూవీలో నాజర్ పాత్రకు శోభన్ బాబును సంప్రదించారట. కానీ ఆయన చేయను అన్నారట.
బిగ్ బాస్ హౌజ్ నుంచి నాలుగో వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు?
నేను ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ హీరోగానే ఉండిపోవాలి. క్యారెక్టర్ రోల్స్ చేయను అన్నారట. 1996లో విడుదలైన హలో గురూ ఆయన చివరి చిత్రం. తర్వాత శోభన్ బాబు సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు. శోభన్ బాబు 2008లో కన్నుమూశారు.