టాలీవుడ్ మాస్ డైరెక్టర్ లలో ఒకరు హరీష్ శంకర్ (Harish Shankar). ఆయన సినిమాకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. డైలాగులకు అయితే స్టార్స్ సైతం ఫ్యాన్స్ ఉన్నారు. వరసపెట్టి స్టార్స్ తో సినిమాలు చేస్తున్న మిస్టర్ బచ్చన్ తర్వాత కొద్దిగా సైలెంట్ అయ్యారనిపిస్తోంది.
అయితే ఆయన బయిట పెద్దగా కపడపకుండా తన స్క్రిప్టుపై దృష్టి పెట్టారని టాక్. రీసెంట్‌గా రవితేజతో (Ravi Teja) చేసిన మిస్టర్ బచ్చన్ (Mr. Bachchan) చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయినా ఆయనతో చేయటానికి తెలుగులో చాలా మంది హీరోలు సిద్దంగా ఉన్నారు.
అసలు పవన్ కల్యాణ్‌తో (Pawan Kalyan) ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) ప్రాజెక్ట్ పూర్తై ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. ఆ సినిమాపై ఫోకస్ చేసిన, పవన్ కళ్యాణ్ పొలిటికల్ కమిట్మెంట్స్ తో ఆ చిత్రం హోల్డ్‌లోకి వెళ్లింది. ఇప్పటికే కొంత భాగం షూట్ అయినప్పటికీ, పవన్ రాజకీయాలతో బిజీగా ఉండడంతో ఆ ప్రాజెక్ట్ బ్రేక్‌లో ఉంది.
ఈ క్రమంలో హరీష్ తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టినట్లు సమాచారం. దాంతో ఈ గ్యాప్‌లో హరీష్ శంకర్ కొత్త ప్రాజెక్ట్ కోసం స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. మరి హీరో ఎవరు అనేది పెద్ద సస్పెన్స్ గా ఉంది.
టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు...హరీష్ శంకర్ తన తదుపరి చిత్రం సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ తో చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. హరీష్ తన స్టైల్‌లో బాలయ్యకు మాస్ ఎలిమెంట్స్‌తో పక్కా స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారని తెలుగు పరిశ్రమ వర్గాల్లో వినిపిస్తోంది. మొదట మళయాళ చిత్రం ఆవేశం రీమేక్ కోసం బాలయ్యతో హరీష్ సినిమా చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ, దాని మీద ఎలాంటి క్లారిటీ రాలేదు.
ఇప్పుడు మాత్రం హరీష్ కొత్త కథను డిజైన్ చేసి, త్వరలో బాలయ్యకు నేరేట్ చేయబోతున్నారని తెలుస్తోంది. అలాగే సితార ఎంట్రైటన్మెంట్స్ నిర్మాత నాగవంశీ కూడా ఈ ప్రాజెక్ట్ కోసం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
హరీష్ స్క్రిప్ట్ పూర్తి చేసి బాలయ్యకు కథ వినిపించనున్నారని, ఆ తర్వాతే సినిమా ఫైనల్ అవుతుందని టాక్. హరీష్, బాలయ్య కాంబోలో సినిమా అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం బాలకృష్ణ ప్రస్తుతం డాకు మహారాజ్ చిత్రం షూటింగ్ పూర్తి చేసి సంక్రాంతి బరిలో నిలవనున్నారు. ఆ తర్వాత అన్ని అనుకున్నట్లు జరిగి, హరీష్ స్క్రిప్ట్ బాలయ్యకు నచ్చితే, ఈ కాంబో త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇక ఉస్తాద్ విషయానికి వస్తే... ఓజీ కంప్లీట్ అయ్యాక ఉస్తాద్ సెట్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. రీసెంట్ గా ఉస్తాద్ భగత్ సింగ్ స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేసినట్లు టాక్ వినిపించింది. టోటల్ బౌండ్ స్క్రిప్ట్ ఇప్పుడు సిద్ధమైనట్లు సమాచారం. కాగా, అదే సమయంలో రామ్ పోతినేని కోసం ట్రై చేశాడు. కానీ ఎందుకొ ఆ కాంబో సెట్టవ్వలేదు.