సుమన్ మంచి అందగాడు కావడంతో చాలామంది అమ్మాయిలు ఆయన్ వెంటపడేవారట. సుమన్ ను అప్పటి డిజిపి కుమార్తె ఇష్టపడిందట . కానీ సుమన్ కి ఆమెపై ఎలాంటి అభిప్రాయం లేదు. ఆల్రెడీ ఆమెకు పెళ్ళవడ్డం.. అయినా సరే సుమన్ ని ఇష్టపడేదిట.
అదేటైమ్ లో సుమన్ స్నేహితుడు ఒకడు వడయార్ కుమార్తెని ప్రేమించాడు. ఇటు డిజిపి కూతురు సుమన్ షూటింగ్ ఎక్కడ జరుగుతుంటే అక్కడికి పోలీస్ సెక్యూరిటీతో వెళ్ళేదట. ఇక ఈ విషయంలో రకరకాల ఊహాగానాల నడుమ.. విషయం వైరల్ అయ్యింది.
ముఖ్యమంత్రి ఎంజీఆర్ దగ్గరకు సుమన్, డిజిపి కూతురు వ్యవహారం వెళ్ళింది. దీనితో ఎంజీఆర్ సుమన్ ని పిలిపించాడు. బాబు నువ్వు నటుడివి. ఎంతో భవిష్యత్తు ఉంది. ఇలాంటివి వద్దు అని ఎంజీఆర్ చెప్పారట. ఎంజీఆర్ కు అప్పటికే ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉండటంతో.. అప్పట్లో మాట్లాడే స్థితిలో లేరు. ఏమైనా చెప్పాలనుకుంటే రాసి చూపించేవారు.