శివకార్తికేయన్ ను కోలీవుడ్ లో తొక్కేస్తున్నారా..? యంగ్ హీరో సంచలన వ్యాఖ్యలు.

First Published | Jan 7, 2025, 6:27 PM IST

తమిళ సినీ పరిశ్రమలో ఒక బ్యాచ్ తనను ఎదగనివ్వకుండా చేస్తున్నారని యంగ్ హీరో శివకార్తికేయన్ అన్నారు. ఇంతకీ ఆ యంగ్ హీరో సంచలన వ్యాక్యలు ఎందుకు చేశారు..?

శివకార్తికేయన్

రజనీకాంత్, అజిత్ వంటి వారిలా సినిమాల్లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సొంత ప్రతిభతో ఎదిగిన వ్యక్తి శివకార్తికేయన్. చిన్నతెరపై మిమిక్రీ ఆర్టిస్ట్‌గా ప్రారంభమైన ఆయన ప్రయాణం, ఆ తర్వాత యాంకర్‌గా మారి తన మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుని, క్రమంగా సినిమాల్లోకి అడుగుపెట్టి నేడు స్టార్ హీరోగా వెలుగొందుతున్నారు. సినిమాల్లో రాణించాలనుకునేవారికి ఆయన స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు.

శివకార్తికేయన్ ఇంటర్వ్యూ

నేడు స్టార్ హీరోగా ఉన్న శివకార్తికేయన్, సినిమాల్లో తనకు వ్యతిరేకంగా కొందరు పనిచేస్తున్నారని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం సంచలనం సృష్టించింది. ఆ ఇంటర్వ్యూలో శివకార్తికేయన్ మాట్లాడుతూ.. “తమిళ సినిమా పరిశ్రమలో, సామాన్యుడు ఎదిగితే కొందరు సంతోషిస్తారు. కానీ మరికొందరికి అది నచ్చదు. నువ్వెవరు.. నీకెందుకు ఇదంతా దక్కుతుంది అని ప్రశ్నించేవారు కూడా ఇక్కడున్నారు అని ఆయన అన్నారు. 


విమర్శకులకు SK సమాధానం

నా ముఖం పట్టుకుని కొంత మంది నేరుగా అడిగారు. నువ్వెవరు... ఇక్కడ ఏం చేస్తున్నావ్ అని అడిగారు. చాలాసార్లు ఇలాంటి పరిస్థితిని నేను ఫేస్ చేశాను అన్నారు. అప్పుడు మీరు ఏం చేశారు అని యంకర్ అడగ్గా..  నేనేమీ చెప్పను, వాళ్ళని చూసి నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోతాను. వాళ్ళు ఏమేం అంటున్నారో విని వెళ్ళిపోతాను అని అన్నారు.

కోలీవుడ్ మాఫియా గురించి SK

నేను ఎవరికీ సమాధానం చెప్పలేదు. నా విజయమే వాళ్ళకిచ్చే సరైన సమాధానం అని కూడా నేను అనను. ఎందుకంటే అందులో నాతో సహా నా బృందం కష్టం ఉంది. నన్ను చూసి కొందరు సినిమాల్లోకి రావాలని ఉత్సాహపడుతున్నారు. అందుకే నా విజయం వాళ్ళ కోసమే.

ఇక  సోషల్ మీడియాలో ఓ గ్రూప్ ఉంది. నా సినిమా ఫ్లాప్ అయితే వాళ్ళు నన్ను విపరీతంగా విమర్శిస్తూ పోస్ట్‌లు పెడతారు. అదే సమయంలో నా సినిమా హిట్ అయితే, నన్ను కాకుండా అందులోని ఇతరులను పొగుడుతూ మాట్లాడతారు” అని శివకార్తికేయన్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.

Latest Videos

click me!