రాజకీయంగా సక్సెస్... చిరంజీవిని వారిద్దరూ పక్కన పెట్టేశారా?

First Published | Aug 14, 2024, 8:46 AM IST

 మెగా బ్రదర్ నాగబాబు కొత్త ఆఫీస్ ఓపెన్ చేశారు. సదరు ఆఫీస్ గోడపై ఉన్న వ్యక్తి ఫోటో చూసి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. నాగబాబుకు పవన్ కళ్యాణ్, చిరంజీవిలలో ఎవరంటే ఇష్టం? 
 

Nagababu

నాగబాబు మీడియా రంగంలో అడుగుపెడుతున్నారు. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. N మీడియా పేరుతో ఆయన న్యూస్ ఛానల్ లాంచ్ చేస్తున్నట్లు సమాచారం. ఎన్ ఛానల్ ఆఫీస్ ని తాజాగా ఆయన లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరు కావాల్సి ఉంది. ఆయన బిజీగా ఉన్న నేపథ్యంలో కుదరలేదు. దాంతో నాగబాబు సతీమణి నీరజ, కూతురు నిహారిక రిబ్బన్ కట్ చేసి ఆఫీస్ ప్రారంభించారు. 
 

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. టీడీపీ, బీజేపీ పార్టీలతో కలిసి పోటీ చేసిన జనసేన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో గెలుపొందింది. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టారు. జనసేన పార్టీకి మద్దతుగా ఈ ఎన్ ఛానల్ పని చేయనుందని సమాచారం. 
 


దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో ఆయా మీడియా ఛానల్స్ కొన్ని రాజకీయ పార్టీలకు కొమ్ముకాస్తున్నాయి. మీడియా ఛానల్స్ పార్టీల వారిగా విడిపోయి కొట్టుకుంటాయి. తమ పార్టీ అధికారంలో ఉంటే ఆకాశానికి ఎత్తడం, వేరే పార్టీ అధికారంలోకి వస్తే దుమ్మెత్తిపోయడం మీడియా ఛానల్స్ కి ఆనవాయితీగా మారింది.

జనసేన పార్టీకి మద్దతుగా పనిచేసే ఒకటి రెండు ఛానల్స్ ఉన్నాయి. అయితే అవి అంత పాప్యులర్ కాదు. టీడీపీ అనుకూల మీడియా జనసేనకు ఇచ్చే ప్రాధాన్యత తక్కువే. చిరంజీవి స్థాపించిన పీఆర్పీ విఫలం కావడానికి బలమైన మీడియా సప్పోర్ట్ లేకపోవడమే అనే వాదన ఉంది.  ఈ క్రమంలో జనసేనను మరింత బలోపేతం చేయాలంటే సొంత ఛానల్ అవసరమని నాగబాబు, పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. దానిలో భాగంగా ఈ ఎన్ ఛానల్ ఆలోచన చేశారు. 

ఇదిలా ఉంటే ఎన్ ఛానల్ కొత్త ఆఫీస్ లో నాగబాబు తన తమ్ముడు ఫోటోను ఉంచారు. ఓ అభిమాని స్కెచ్ వేసి బహుమతిగా ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఫోటోని ఆయన ఎన్ ఆఫీస్ గోడకు తగిలించారట. ఇది ఓ చర్చకు దారి తీసింది.  మెగా ఫ్యామిలీ అనే మహావృక్షం నాటిన చిరంజీవి ఫోటో ఉందా? లేదా? ఒకవేళ లేకపోతే అన్నయ్య కంటే తమ్ముడే తనకు ముఖ్యమని నాగబాబు చెప్పినట్లు అవుతుందని టాలీవుడ్ టాక్. ఇది అనవసరమైన చర్చ. వారి ముగ్గురు మధ్య మంచి అనుబంధం ఉంది. నాగబాబుకు ఇద్దరూ ఇష్టమే అని పలువురు వాదిస్తున్నారు. 
 

Latest Videos

click me!