‘మిస్టర్ బచ్చన్‌’ డిస్ట్రిబ్యూటర్స్, బిజినెస్ డిటేల్స్ (ఏరియా వైజ్)

First Published | Aug 14, 2024, 7:49 AM IST

  రవితేజ(Raviteja) కి ఇప్పుడు ఓ సాలిడ్ కంబ్యాక్ అవసరం…మూడు వరుస ఫ్లాఫ్స్ తర్వాత వస్తున్న రవితేజ లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్(Mr Bachchan) సినిమా, 


 ‘మిస్టర్‌ బచ్చన్‌..నామ్‌ తో సునా హోగా’ అంటూ  రవితేజ ఈ రోజు థియేటర్స్ లోదిగిపోతున్నారు.  మాస్‌ మహారాజా రవితేజ (Ravi Teja),హరీష్ శంకర్  కాంబినేషన్ లో  సినిమా ఈ రోజు ప్రీమియర్ షోలు పడిపోయాయి. రేపు అంటే గురువారం ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఈ సినిమా వస్తుందంటే అంచనాలు ఏ రేంజిలో ఉంటాయో తెలిసిందే. ఈ సినిమా  ఆగస్టు 15న విడుదల కానుంది. ప్రీమియర్స్‌ ఆగస్టు 14న ప్రదర్శించనున్నారు. ఈ  నేపధ్యంలో ఈ చిత్రం ఏ ఏరియాలో ఏ మేరకు  బిజినెస్  జరిగి ఉండవచ్చు అనే విషయం  చూద్దాం.
 


ధమాకా తర్వాత రవితేజ చేసిన సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో  వర్కవుట్ కావటం లేదు. ఈ సారి పెద్ద హిట్ కొట్టాలని కసిగా ఉన్న రవితేజ బాలీవుడ్ హిట్ చిత్రం రైడ్ రీమేక్ తో వస్తున్నారు.  హరీష్‌ శంకర్‌ (Harish Shankar) దర్శకత్వంలో రవితేజ కాంబినేషన్ లో గతంలో వచ్చిన మిరపకాయని మించి సినిమా ఉంటుందని చెప్తున్నారు. ‘మిస్టర్‌ బచ్చన్‌’ (Mr Bachchan) సినిమా టైటిల్ కూడా జనాల్లోకి బాగా వెళ్లింది.  ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ తెరకెక్కిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే రవితేజ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. 



‘మిస్టర్‌ బచ్చన్‌’చిత్రం సెన్సార్ పూర్తి అయ్యి U/A సర్టిఫికేట్ తెచ్చుకుంది. 158 నిముషాలు (2 గంటలు,  38 నిముషాలు) రన్ టైమ్ తో ఈ సినిమా మన ముందుకు వస్తోంది. ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్స్ లిస్ట్ 

Nizam: Mythri Movie Makers,
 Ceded: Shobhan,
 U/A: Poorvi Pictures, 
East: Anu Sree Films, 
West: Usha Pictures, 
Guntur: Salam,
 Krishna: Suresh Movies, 
Nellore: Bhaskar Reddy,
 Karnataka: M Movies, 
Overseas: People’s Cinemas and Sarigama.
 

Mr Bachchan


ఇక బిజినెస్ విషయానికి వస్తే...

నైజాం రైట్స్ ఈ సినిమా 12 కోట్లకు సొంతం చేసుకుంది. అలాగే కోస్టల్ ఏపీ బిజినెస్ రేషియో 14 కోట్లు దాకా జరిగింది. సీడెడ్ రైట్స్  4.5 కోట్లు. మొత్తం వరల్డ్ వైడ్  ,ఓవర్ సీస్ తో కలిపి             35 కోట్లు దాకా పలికింది. మిస్టర్ బచ్చన్ ఓటిటి రైట్స్ ని నెట్ ప్లిక్స్ సొంతం చేసుకుంది.     ఆగస్టు 15 లాంగ్ వీకెండ్ ఎడ్వాంటేజ్ ఉండటంతో సినిమా కలెక్షన్స్ కు బాగా కలిసి వస్తుందని భావిస్తున్నారు. దానికి తోడు నీట్ గా ప్రమోషన్స్ చేస్తూండటంతో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. 
 

Mr Bachchan

హీరో రవితేజ (Ravi Teja) స్పెషాలిటీ ఏమిటంటే..ఎన్ని  ప్లాఫ్ లు వచ్చినా ఓపినింగ్స్ కు లోటు ఉండదు. బిజినెస్ అయితే ఎవర్ గ్రీన్ గా ఉంటుంది. అందుకు తగినట్లుగా తనకు కలిసొచ్చిన డైరక్టర్ తో జతకడితే  ఇంక చెప్పేదేముంది. ఫ్యాన్స్ కే కాదు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కు పండగే.  అందుకే ధైర్యంగా ఆ రేట్లు ఇచ్చి ఈ సినిమా రైట్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. 

Mr. Bachchan

హిందీలో అజయ్ దేవగన్ హీరోగా చేసిన రైడ్ సినిమాకు రీమేక్ ఇది. ఇన్కమ్ టాక్స్ రైడ్ నేపధ్యంలో జరిగే కథ ఇది. అయితే ఈ సినిమాను రీమేక్ లా కాకుండా హరీష్ శంకర్ ఈ కథకు తనదైన స్టయిల్లో మాస్ టచ్ ఇచ్చారని తాజాగా వచ్చిన షో రీల్ చూస్తుంటే క్లారిటీ వస్తుంది. ఈ సినిమాలో  మంచి మాస్ టచ్ వుందని, రైడ్ స్క్రిప్టుని పూర్తి మాస్ అప్పీలింగ్ తో తయారు చేసారని చెప్తున్నారు. రీమేకులు చేయడంలో కూడా హరీష్ శంకర్ కి సెపరేట్ స్టయిల్ వుంది. రైడ్  తో పోలిక రాకుండా మిస్టర్ బచ్చన్  కి ట్రీట్మెంట్ చేశారాయన.


ఇక  యాక్షన్‌ అధిక ప్రాధాన్య చిత్రమిది. బాలీవుడ్‌ హీరో అమితాబ్‌ బచ్చన్‌ అభిమాని అయిన రవితేజ ఈ సినిమాలోనూ ఆయన ఫ్యాన్‌గా కనిపించనున్నారని సమాచారం. నిజాయతీ గల ఆదాయపన్ను అధికారిగా కనిపించనున్నట్లు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది. ఆ అధికారి ఓ రాజకీయ నాయకుడి ఇంటికి రైడ్‌కు వెళ్లాక ఏం జరిగిందన్నది కథాంశం. ఈ సినిమాకు డబుల్ ఇస్మార్ట్ సినిమా పోటీగా రంగంలోకి దిగుతోంది. 

Latest Videos

click me!