నాగ చైతన్య పై అనుచిత కామెంట్స్, వేణు స్వామికి భారీ షాక్ ఇచ్చిన నాగ్? అరెస్ట్ తప్పదా!

First Published | Aug 14, 2024, 7:34 AM IST

వేణు స్వామికి ఇబ్బందులు మొదలయ్యాయి. అతడు అరెస్ట్ కావచ్చని ప్రచారం జరుగుతుంది. అలాగే వేణు స్వామికి నాగార్జున చెక్ పెట్టాడట. బిగ్ బాస్ నుండి తప్పించాడట. 
 

Naga Chaitanya and Sobhita


జాతకాల పేరిట వేణు స్వామి చేస్తున్న అనుచిత కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. నాగ చైతన్య-శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనుంది. ఈ క్రమంలో వేణు స్వామి మరలా రంగంలోకి దిగాడు. నాగ చైతన్య,శోభిత ధూళిపాళ్ల జాతకాల రీత్యా కలిసి ఉండే అవకాశం లేదంటూ వీడియో విడుదల చేశారు. 

Celebrity astrologer Venu Swamy

నాగ చైతన్య-శోభిత జాతకాలను బట్టి చూస్తే వారు 2027 కల్లా విడిపోతారు. వీరికి ఒక స్త్రీ కారణంగా మనస్పర్థలు తలెత్తుతాయి. అలాగే నాగ చైతన్యకు తండ్రి అయ్యే అవకాశం లేదు. సహజంగా నాగ చైతన్య తండ్రి కావడం కష్టం అంటూ.. అభిమానుల మనోభావాలను దెబ్బతీశాడు. వేణు స్వామి కామెంట్స్ పై నాగార్జున సీరియస్ అయినట్లు తెలుస్తుంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు వేణు స్వామికి కాల్ చేశారట. 
 



ఈ విషయాన్ని వేణు స్వామి స్వయంగా వెల్లడించాడు. మంచు విష్ణు నాకు కాల్ చేశారు. ఇకపై నేను టాలీవుడ్ సెలెబ్స్ జాతకాలు చెప్పబోవడం లేదు అన్నాడు. అలాగే తెలుగు ఫిలిం జర్నలిస్టులు, డిజిటల్ మీడియా యూనియన్లు వేణు స్వామి మీద మహిళా కమీషన్ కి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మహిళా కమిషన్ వేణు స్వామికి నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 22న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని నోటీసులతో పేర్కొంది. 

వేణు స్వామి అరెస్ట్ తప్పదంటూ ప్రచారం మొదలైంది. ఈ వివాదం కారణంగా వేణు స్వామి బిగ్ బాస్ షోలోకి వెళ్లే ఛాన్స్ కోల్పోయాడట. వేణు స్వామి బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి దాదాపు ఎంపిక అయ్యారట. దాంతో 30-40 యూట్యూబ్ ఛానల్స్ ప్రతినిధులకు వేణు స్వామి గ్రాండ్ పార్టీ ఇచ్చాడట. వారికి డబ్బు కూడా ముట్టజెప్పాడట. బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టాక తనను గట్టిగా ప్రమోట్ చేయాలని వారికి సూచించాడట. 

Venu swamy

వేణు స్వామి తన కొడుకుపై చేసిన అనుచిత కామెంట్స్ నేపథ్యంలో నాగార్జున సీరియస్ అయ్యాడట. అతడికి బిగ్ బాస్ షోలో అడుగుపెట్టే అవకాశం లేకుండా చేశాడట. మరోవైపు వేణు స్వామి భార్య ఓ వీడియో విడుదల చేసింది. నాగ చైతన్య-శోభితలకు శుభాకాంక్షలు తెలియజేసిన ఆమె, తనకు గిఫ్ట్ కావాలని సెటైరికల్ గా మాట్లాడింది. వేణు స్వామి మీద ఓ వర్గం చాలా ఆగ్రహంగా ఉన్నారు. 

Latest Videos

click me!