ఆతరువాత కల్కి సినిమాతో సాలిడ్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు ప్రభాస్. ఇక కల్కి సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1200 కోట్లకు పైగా వసూళ్ళను సాధించింది. ఈ జోష్ తో నెక్ట్స్ సినిమాలపై దృష్టి పెట్టాడు ప్రభాస్.
వరుసగా షూటింగ్స్ ను ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇండియన్ బాక్సాఫీస్ కింగ్, పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
సలార్, కల్కి సినిమాలు ఇచ్చిన బూస్ట్ తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న ప్రభాస్.. ఇప్పుడు సలార్ 2, కల్కి 2, మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ వంటి సినిమాలు లైన్ అప్ చేస్తున్నాడు. బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం వరుస షెడ్యుల్స్ ప్లాన్ చేసుకున్న సినిమా అయితే రాజాసాబ్ అని చెప్పాలి.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.