సీనియర్‌ నటుడి వద్ద రెండు లక్షలు అప్పు చేసిన శోభన్‌బాబు, కట్‌ చేస్తే చెన్నైకే నవాబ్‌, సగం సిటీ ఆయనదే!

First Published Sep 13, 2024, 7:18 PM IST

తెలుగు తెర సోగ్గాడు శోభన్‌బాబు వందల కోట్లకు అధిపతి అనే ప్రచారం జరుగుతుంది. కానీ సీనియర్‌ నటుడి వద్ద అప్పు చేశాడట. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. 
 

Sobhan Babu

తెలుగు తెర సోగ్గాడు అంటే శోభన్‌ బాబే. ఆ విషయంలో మరో మాట లేదు. ఆ విషయాన్ని అభిమానులే కాదు, ఇండస్ట్రీ మొత్తం ఒప్పుకోవాల్సిందే. ఫ్యామిలీ ఎమోషన్స్ కి పెద్ద పీఠ వేస్తూ సినిమాలు చేసిన ఆయన విశేష ఆదరణ పొందారు. తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యారు. ఫ్యామిలీ ఆడియెన్స్ హృదయాలను గెలుచుకున్నారు.

మొదటి తరం నటుల్లో అమ్మాయిల ఫాలోయింగ్‌  ఆయనకే ఎక్కువగా ఉండేదంటే అతిశయోక్తి కాదు. ఇది జగమెరిగిన సత్యం. సినిమాల్లో సోగ్గాడిగా ఓ వెలుగు వెలిగిన శోభన్‌ బాబు రియల్‌ లైఫ్‌లోనూ అత్యంత సంపన్నుడిగానూ నిలిచాడు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్, ఇంట్రెస్టింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

Sobhan Babu

శోభన్‌ బాబు.. ఆస్తులు కూడబెట్టుకోవడంలో దిట్ట. ఆయన ఎన్నో ప్రాపర్టీస్‌ కొన్నాడు. రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టి కోటీశ్వరుడు అయ్యారు. కోట్లకు ఎదిగిగాడు. శోభన్‌బాబు గురించిన టాపిక్‌ వస్తే, ఆయన అందం, ఆయన చేసిన సినిమాలు, హుందాతనంతోపాటు ప్రాపర్టీస్‌ గురించిన చర్చే నడుస్తుంది.

భూములు కొనుక్కోవాలని ఎంతో మందికి సలహా ఇచ్చింది శోభన్‌ బాబే. మరి ఆయన ఆస్తుల లెక్కేంటి అంటే వేల కోట్లకు అధిపతి అనే చెప్పాలి. ఇప్పుడు ఆయన కొన్న ఆస్తులు వేల కోట్లల్లో ఉంటాయట. అంతేకాదు సగం చెన్నై శోభన్‌బాబుదే అయి ఉంటుందన్నారు నటుడు చంద్రమోహన్‌. 
 

Latest Videos


సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌, శోభన్‌బాబు మంచి స్నేహితులు. ఇద్దరు కలిసి సినిమాలు చేయడమే కాదు, కలిసే ఉండేవాళ్లట. చెన్నైలో పక్క పక్కనే ఉండేవాళ్లలట. వీకెండ్స్ వస్తే తరచూ కలుసుకునేవాళ్లట. టాలీవుడ్‌ చెన్నై నుంచి హైదరాబాద్‌కి వచ్చినప్పుడు అందరు హీరోలు, నటులు హైదరాబాద్‌కి వచ్చేశారు. ఇక్కడ డెవలప్‌ చేశారు.

కానీ తాము ఇక్కడే ఉంటామని నిర్ణయించుకున్న వారిలో శోభన్‌బాబు, చంద్రమోహన్‌ ఉన్నారట. ఎన్టీఆర్‌ సైతం హైదరాబాద్‌కి రావాలని శోభన్‌ బాబుని అడగ్గా, తాను రాను ఇక్కడే ఇళ్లు కట్టుకున్నాను, అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఫ్యామిలీ ఇక్కడే ఉందని, ఇకహైదరాబాద్‌ కి ఎందుకు అని తిరస్కరించాడట శోభన్‌బాబు. షూటింగ్‌ల కోసం వస్తామని చెప్పాడట. ఆయనతోపాటు చంద్రమోహన్‌ కూడా అక్కడే ఉన్నారట. 

photo-suman tv

అయితే తమ మధ్య ఏరా అనుకునేంత స్నేహం ఉండేదని, పేరు పెట్టి పిలిచినా ప్రశ్నించే వాడని చెప్పాడు చంద్రమోహన్‌. సుమన్‌ టీవీకి ఇచ్చిన పాత ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు చంద్రమోహన్‌. అంతేకాదు ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయం తెలిపారు. ఓ సారి తన వద్ద రెండు లక్షలు అప్పు చేశాడట.

తన చేతితో డబ్బు ఇస్తే సెంటిమెంట్‌గా ఫీలయ్యేవాడు. తాను మనీ ఇస్తే అతనికి కలిసి వచ్చేదని, కనీసం పది రూపాయలు అయినా తన వద్ద తీసుకునేవాడని తెలిపారు చంద్రమోహన్‌. తన వద్ద నుంచి తీసుకున్న మనీ ప్రాపర్టీస్‌ కొనడానికి అడ్వాన్స్ గా ఇచ్చేవాడని, అలా కొన్నవి ఎన్నో ఉన్నాయని తెలిపారు. ఓ సారి రెండు లక్షలు అప్పుగా తీసుకున్నాడట. 
 

అర్జెంట్‌గా కావాలని చెప్పి రెండు లక్షలు తీసుకున్నాడని, వారం రోజుల తర్వాత కలిసినప్పుడు నీ డబ్బుతో ఏంచేశానో చూపిస్తా రా అని చెప్పి ఓ ఫామ్‌ హౌజ్‌కి తీసుకెళ్లాడట శోభన్‌బాబు. దాదాపు 36ఎకరాలు ఫామ్‌ ల్యాండ్‌. కొబ్బరి తోటలు, ఇతర తోటలతో ఉన్న ల్యాండ్‌ అది. అందులో ఫామ్‌ హౌజ్‌ కూడా ఉంది.

అదంతా తిప్పి చూపించాడట. ఆ ప్రాపర్టీ అప్పుడు 30 లక్షలకు వచ్చిందట. నటుడు మాధవన్‌ తాతగారిది ఆ ల్యాండ్‌. వాళ్లు అమ్ముతుంటే శోభన్‌బాబుని అప్రోచ్‌ అయితే ఇమ్మీడియట్‌గా డబ్బు అరెంజ్‌ చేసి ఆ ల్యాండ్‌ తీసుకున్నాడట శోభన్‌బాబు. ఆ ప్రాపర్టీస్‌ కోసం ఎంజీఆర్‌, మరో కార్పోరేట్‌ కూడా పోటీగా వస్తే, వాళ్లని కాదని శోభన్‌ బాబు దక్కించుకున్నాడట.

అయితే ఆ సమయంలో శోభన్‌ బాబు వద్ద డబ్బు లేకపోతే సెంటిమెంట్‌ గా తన వద్ద రెండు లక్షలు తీసుకుని అడ్వాన్స్ ఇచ్చాడట. ఆ తర్వాత నిర్మాతలు, వాళ్ల, వీళ్ల వద్ద అడిగి ఆ ల్యాండ్‌ కొన్నాడట. అది మెయిన్‌ రోడ్డపై ల్యాండ్‌. చెన్నై సిటీకి సమీపంలోనే ఉందని, దాని వాల్యూ వందల కోట్లు ఉంటుందన్నారు చంద్రమోహన్‌. అందులో తన ముగ్గురు అమ్మాయిల పెళ్లి, అబ్బాయి పెళ్లి చేశాడట శోభన్‌బాబు. ఆ సమయంలో ఇండస్ట్రీ అక్కడికి వచ్చిందట.
 

photo-suman tv

అంతేకాదో మరో సందర్భంలో సరదాగా తన ప్రాపర్టీ చూపిస్తానని కారులో తీసుకెళ్లాడట. అన్నా నగర్‌లో తన ప్రాపర్టీస్‌ చూపించడానికి ఒక పూట పట్టిందట. ఒక్క అన్నా నగర్‌లోనే 18 ప్రాపర్టీస్‌ చూపించాడట. వాటిలో చాలా బిల్డింగ్స్ కూడా ఉన్నాయట. వాటిని చూసుకోవడానికి మనుషులను పెట్టాడట. 25 మంది వరకు అందులో పని చేస్తారని, వారికి ఒక జనరల్‌ మేనేజర్‌ కూడా ఉండేవాడని తెలిపారు.

శోభన్‌ బాబు కొన్న ప్రాపర్టీస్‌ అన్నీ చూస్తే సగం చెన్నై సిటీ ఆయనదే అనేంత ఉంటుందని, ఇంకా చెప్పాలంటే వాడు చెన్నై నవాబ్‌ అని కితాబిచ్చాడు చంద్రమోహన్‌. అయితే శోభన్‌ బాబుల తనకు నమ్మకమైన మనుషులు లేరని, దీంతో తాను అంత ప్రాపర్టీస్‌ కొనలేకపోయానని చెప్పారు చంద్రమోహన్‌.

నటుడిగా చిన్న చిన్న వేషాల నుంచి హీరోగా టర్న్ తీసుకుని, ఓ ఊపు ఊపేసిన చంద్రమోహన్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా మారి ఎన్నో సినిమాలు చేసి మెప్పించారు. గతేడాది అనారోగ్యంతో చంద్రమోహన్‌ కన్నుమూసిన విషయం తెలిసిందే. 
 

click me!