రాజమౌళితో హీరోగా సినిమా చేసి.. ఆ తర్వాత ఫ్లాప్‌లు చవిచూసింది వీరే.. ఎవరంటే.?

Published : Jan 11, 2026, 11:24 AM IST

Rajamouli: సాధారణంగా ఏ హీరో అయినా కూడా దర్శకుడు రాజమౌళి డైరెక్షన్‌లో ఓ సినిమా చేయాలని అనుకుంటారు. ఈ ఇద్దరు హీరోలు కూడా రాజమౌళి సినిమాలో హీరోగా నటించారు. ఆపై చేసిన సినిమాలన్నీ కూడా ఫ్లాప్‌లు. మరి వారెవరో తెలుసా..? 

PREV
15
రాజమౌళి ఒక బ్రాండ్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడు రాజమౌళి క్రేజ్ వేరు. తన సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళాడు జక్కన్న. కెరీర్‌ను బుల్లితెర నుంచి ప్రారంభించిన రాజమౌళి.. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడిగా మారి.. తెలుగు ఇండస్ట్రీలో ఫ్లాప్‌లు తెలియని హిట్ దర్శకుడిగా ఎదిగాడు.

25
పన్నెండుపైగా చిత్రాలు..

దర్శకుడు రాజమౌళి తన కెరీర్‌లో పన్నెండు చిత్రాలకు దర్శకత్వం వహించాడు. జక్కన్న డైరెక్షన్‌లో ఒక్క సినిమానైనా చేయాలని తాపత్రయపడే హీరోలు చాలామందే ఉన్నారు. అయితే ఇద్దరు హీరోలు మాత్రం రాజమౌళితో సినిమాలు చేసి.. తమ కెరీర్‌లో ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ కూడా ఫ్లాప్‌లు మూటగట్టుకున్నారు.

35
ఆ హీరో మరెవరో కాదు..

రాజమౌళి, నితిన్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'సై'. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇద్దరి కెరీర్‌కు చక్కటి బ్రేక్ ఇచ్చిందని చెప్పొచ్చు. అయితే ఈ సినిమా తర్వాత నితిన్ వరుసగా 12 సినిమాలు ఫ్లాప్‌లు చవి చూడాల్సి వచ్చింది. అతడి కెరీర్ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.

45
మరో హీరో సునీల్..

దర్శకుడు రాజమౌళి, సునీల్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'మర్యాద రామన్న'. ఈ మూవీ సునీల్‌ను హీరోగా నిలబెట్టింది. అలాగే ఈ చిత్రానికి రాజమౌళి అన్న ఎస్.ఎస్.కాంచీ కథను అందించగా.. కేవలం ఆరు నెలల్లో ఈ చిత్రాన్ని ముగించారు. అప్పట్లో ఇది బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.

55
ఆ తర్వాత ఫ్లాప్‌లు..

అయితే ఈ సినిమా తర్వాత సునీల్ హీరోగా చేసిన ఇతర సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర పరాజయం పాలయ్యాయి. హీరోగా ఏ సినిమాను సునీల్‌కు సక్సెస్ అందించలేకపోయాయి. అటు కమెడియన్ గానూ ఇబ్బందులు పడ్డాడు. అయితే సునీల్ మాత్రం ఇప్పుడు విలన్ పాత్రలు పోషిస్తూ బిజీగా ఉన్నాడు.

Read more Photos on
click me!

Recommended Stories