83 ఏళ్ల వయసులో కూడా ఇదెక్కడి క్రేజ్ రా బాబు.. అద్దాలు బద్దలు కొట్టుకొని వచ్చిన అభిమానులు..

Published : Jan 11, 2026, 11:11 AM IST

80 ఏళ్లు దాటిని బిగ్ బీ అమితాబ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆయన కోసం అభిమానులు ఎంతలా ఆరాటపడుతున్నారంటే.. ఎయిర్ పోర్ట్ అద్దాలు బ్రేక్ చేసి మరీ..అమితాబ్ ను చూడటానికి పోటీ పడ్డారు. ఇంతకీ విషయం ఏంటంటే?

PREV
15
స్టార్ హీరోలకు భారీగా క్రేజ్

స్టార్ హీరోలకు భారీగా క్రేజ్ ఉండటం కామన్.. కానీ ఏళ్లు గడుస్తున్నా కొద్ది.. అది తగ్గుతూ వస్తుంది. 70 ఏళ్లు దాటితే.. హీరోలు రిటైర్మెంట్ కువచ్చేస్తుంటారు.. క్రేజ్ ఉన్నా.. అది కొంతవరకే పరిమితం అవుతుంది. కానీ 83 ఏళ్ల వయసులో కూడా తగ్గేదే లేదంటున్నాడు బాలీవుడ్ బిగ్ బీ అమితాబచ్చన్. క్రేజ్ కుర్ర హీరోలను మించిపోయాడు. ఆయన కోసం అభిమానులు ఎంతలా ఆరాట పడుతున్నారంటే.. అమితాబ్ ను చూడటానికి అద్దాలు బద్దలు కొట్టుకుని మరీ వచ్చారు. దాంతో బిగ్ బీకి పెద్ద ప్రమాదం తప్పింది.

25
హద్దులు దాటుతున్న అభిమానం

హీరోలపై అభిమానులకు ఉండే ప్రేమ, అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొంతమంది అభిమానులు తమ ఫెవరేట్ హీరోను ఫ్యామిలీ మెంబర్స్ కంటే కూడా ఎక్కువగా ప్రేమిస్తుంటారు. తల్లీతండ్రులకంటే కూడా హీరోలను ఎక్కువగా అభిమానించి నెత్తినపెట్టుకునే పైత్యం..మనదగ్గర కామన్ గా చూస్తూనే ఉంటాం. 

అయితే ఆ అభిమానం హద్దుల్లో ఉంటే పర్వాలేదు.. అది బాడర్ క్రాస్ చేస్తేనే సమస్యలు వస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో హద్దులు దాటిన అభిమానం ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తోంది. ముఖ్యంగా హీరోలను డైరెక్ట్ గా చూడాలని, వారికి షేక్ హ్యాండ్ ఇవ్వాలని చేసే పనులు ప్రమాదాలకు కారణం అవుతుంటుంది.

35
అభిమానుల వల్ల స్టార్స్ కు ప్రమాదాలు..

హీరోలను ప్రత్యక్షంగా చూడాలనే ఆరాటం, కంగారులో.. చుట్టు ఉన్నవారిని పట్టించుకోకపోవడం వల్ల చాలాప్రమాదాలు జరుగుతున్నాయి. స్టేజీలపైకి దూసుకెళ్లడం, సెల్ఫీలు తీసుకోవాలనే ఆతృతలో తోపులాటకు దిగడం వంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. గతంలో ఇలాంటి సందర్భాల్లో పలువురు హీరోలు గాయపడిన ఘటనలు కూడా ఉన్నాయి. 

తాజాగా ఇలాంటి ప్రమాదకర పరిస్థితినే బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కు ఎదురయ్యింది. అమితాబ్ కు ఒక రకంగా పెద్ద ప్రమాదం తప్పింది. తాజా సమాచారం ప్రకారం అమితాబ్ బచ్చన్ ఇటీవల సూరత్‌కు వెళ్లారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆయనను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు.

45
అమితాబచ్చన్ కు తప్పిన ప్రమాదం..

తమ అభిమాన హీరోతో సెల్ఫీలు దిగాలనే ఉత్సాహంతో ఒక్కసారిగా జనం అమితాబ్ వైపు ఎగబడ్డారు.ఆ సమయంలో అక్కడ ఉన్నసెక్యూరిటీ సిబ్బంది కూడా అభిమానులను నియంత్రించలేని పరిస్థితి ఏర్పడింది. జనాల తోపులాట తీవ్రంగా మారడంతో ఎయిర్‌పోర్ట్ ప్రాంగణంలో గందరగోళం నెలకొంది. ఈ తొక్కిసలాటలో పక్కనే ఉన్న ఒక ఎయిర్‌పోర్ట్ అద్దం ధ్వంసమైంది. అయితే అమితాబ్ బచ్చన్ ఆ అద్దానికి కొంత దూరంలో ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఒకవేళ ఆ అద్దం ఆయన మీద పడితే తీవ్ర గాయాలు అయ్యే ప్రమాదం ఉండేదని సమాచారం.

55
సెలబ్రిటీల భద్రతపై ఆందోళన

ఈ ఘటనతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అమితాబ్ బచ్చన్‌ను అక్కడి నుంచి సురక్షితంగా తరలించారు. ప్రస్తుతం ఈ ఘటన బాలీవుడ్‌తో పాటు సినీ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అభిమానుల ఉత్సాహం కారణంగా స్టార్ హీరోల భద్రతపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనే చర్చ కూడా వినిపిస్తోంది. రీసెంట్ గా నిధి అగర్వాల్, సమంత, లాంటి కొంత మంది స్టార్స్ ఇలాగే అభిమానుల వల్ల ఇబ్బందులు పడ్డారు. జనాలు ఒక్క సారిగా మీదపడటంతో.. సెలబ్రిటీలకు ప్రమాదాలుజరుగుతున్నాయి. తృటిలో తప్పించుకుని చాలామంది బయటపడుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories