Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ రోజు ఏప్రిల్ 29 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే జ్వాల (Jwala) హిమను ఆర్టిస్ట్ దగ్గరికి తీసుకుని వెళుతుంది. అక్కడ జ్వాల నేను కొన్ని పోలికలు చెబుతాను. ఆ పోలికల ప్రకారంగా ఒక బొమ్మ గీసి పెట్టమని అంటుంది. ఇక పక్కనే ఉన్న హిమ (Hima) బాగా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక జ్వాల పోలికలు చెప్పి వెళ్ళొస్తాం అని చెబుతుంది.
26
మరోవైపు ప్రేమ్ (Prem) నిరూపమ్ కి ఫోన్ చేసి మమ్మీ నీకు పెళ్లి సంబంధం చూసింది కంగ్రాట్స్ రా అని చెబుతాడు. కానీ నిరూపమ్ చిరాకు పడుతూ ఉంటాడు. ఇక నిరూపమ్ పెళ్లి సంబంధం గురించి వాళ్ళ అమ్మపై కోపం పడతాడు. దాంతో సప్న (Swapna) నువ్వు పెళ్లి సంబంధం ఒప్పుకోకపోతే ఇంట్లో నుంచి బయటికి వెళ్లి పోతాను అని అంటుంది.
36
ఇక చివరికి స్వప్న (Swapna) నిరూపమ్ ను ఒప్పించి తీసుకుని వెళుతుండగా ఈలోపు ఎదురుగా సౌందర్య కనబడుతుంది. ఇక స్వప్న ఏంటి ఇలా వచ్చారు? పిలవని పేరంటానికి అని సౌందర్య (Soundarya) దంపతులను అంటుంది. ఇక సౌందర్య తనదైన స్టైల్లో స్వప్నకు వెటకారం గా సమాధానం చెబుతుంది.
46
ఇక సౌందర్య (Soundarya) పెళ్లి కూతురు తో వస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు మా మనవడికి చైత్ర రాఖీ కడుటుంది అని అంటుంది. దాంతో సౌందర్య కోపం వ్యక్తం చేస్తుంది. ఇక స్వీట్ తినిపించి రాఖీ కట్టడం తో నిరూపమ్ (Nirupam) ఎంతో ఆనందపడతాడు. స్వప్న దాన్ని జీర్ణించుకోలేకపోతోంది.
56
ఇక సౌందర్య (Soundarya) ఎవరో ఒకరిని తీసుకు వచ్చి..నా మనవడికి పెళ్లి చేస్తానంటే నేను ఎలా ఊరుకుంటాను అని అంటుంది. ఇక స్వప్న నువ్వు ఎన్ని చెప్పినా హిమ నా ఇంటి కోడలు కాదు కాదు అని అంటుంది. మరోవైపు హిమ (Hima) ఆ ఆర్టిస్ట్ గీచే బొమ్మ గురించి ఆలోచిస్తూ భయ పడుతూ ఉంటుంది.
66
ఇక తరువాయి భాగంలో హిమ (Hima), జ్వాల లు రవ్వ ఇడ్లి ఇంటికి వెళతారు. ఆ ఇంట్లో ఆనంద్, మోనితలు కలిసి ఉన్న ఫోటోను వాళ్లిద్దరూ చూస్తారు. ఇక రవ్వ ఇడ్లీ నే మా తమ్ముడు ఆనంద్ (Anand) అని గ్రహించు కుంటారు. ఇక ఈ క్రమంలో రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.