మహేష్‌ బాబుతో రేణు దేశాయ్‌.. మిస్‌ అయిన మూవీ ఏంటో తెలుసా? నోరు విప్పితే పెద్ద వివాదం

Published : Nov 27, 2025, 07:14 PM IST

పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్య, నటి రేణు దేశాయ్‌ సెకండ్‌ ఇన్నింగ్స్ లో జోరు పెంచుతోంది. తాజాగా ఓ మూవీ చేస్తోంది. అయితే మహేష్‌ బాబుతో కలిసి రేణు దేశాయ్‌ ఓ సినిమా చేయాల్సి ఉంది. మరి అది ఎలా మిస్‌ అయ్యిందో తెలుసుకుందాం. 

PREV
15
మహేష్‌ బాబు, రేణు దేశాయ్‌ కాంబినేషన్‌లో మిస్‌ అయిన సినిమా

రేణు దేశాయ్‌ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి కేవలం మూడు సినిమాలు మాత్రమే చేసింది. తొలి చిత్రంతోనే పవన్‌ కళ్యాణ్‌తో ప్రేమలో పడింది. రెండో చిత్రం ఆయనతోనే చేసింది. దీంతోపాటు ఓ తమిళ మూవీ చేసింది. ఆ తర్వాత టెక్నీషియన్‌గా మారిపోయింది. పవన్‌ని పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌కే పరిమితమయ్యింది.  వీరిద్దరు విడిపోయాక కూడా ఆమె నటించలేదు. ఆ మధ్య రవితేజ హీరోగా వచ్చిన `టైగర్‌ నాగేశ్వరరావు` చిత్రంలో ఓ కీలక పాత్రలో మెరిసింది. ఈ చిత్రం ఆడలేదు. దీంతో మళ్లీ సినిమాలకు దూరమయ్యింది. ఇప్పుడు మరో మూవీతో కమ్‌ బ్యాక్‌ అవుతుంది. ఈ క్రమంలో రేణు దేశాయ్‌కి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. మహేష్‌ బాబు, రేణు దేశాయ్‌ కలిసి నటించాల్సిన సినిమాకి సంబంధించిన వార్త క్యూరియాసిటీని క్రియేట్‌ చేస్తోంది.

25
`సర్కారు వారి పాట`లో రేణు దేశాయ్‌

మహేష్‌ బాబు, రేణు దేశాయ్‌ కాంబినేషన్‌లో మిస్‌ అయిన మూవీ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఆ సినిమానే `సర్కారువారి పాట`. పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మహేష్‌ బాబు హీరోగా నటించారు. కీర్తిసురేష్‌ హీరోయిన్‌గా చేసింది. మూడేళ్ల క్రితం వచ్చిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద యావరేజ్‌గా నిలిచింది. ఆశించిన ఫలితాన్ని రాబట్టుకోలేకపోయింది. అయితే ఇందులో రేణు దేశాయ్‌ కూడా నటించాల్సి ఉందట. కీలక పాత్ర కోసం ఆమెని అడిగారట. ఆ పాత్ర నచ్చి రేణు దేశాయ్ కూడా ఓకే చెప్పిందట. కానీ  ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో ఆ ప్రాజెక్ట్ వర్కౌట్‌ కాలేదట.

35
వివాదం అవుతుందని చెప్పడం లేదు

ఈ విషయాన్ని రేణు దేశాయ్‌ స్వయంగా తెలిపారు. గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పంచుకున్నారు. `మహేష్‌ బాబు నటించిన `సర్కారు వారి పాట` చిత్రంలో నదియ పాత్ర మొదట నాకే వచ్చింది. కొన్ని కారణాల వల్ల చేయడం కుదరలేదు. నిజం ఏంటో చెప్పాలని నాకు కూడా ఉంది. కానీ మళ్లీ  కాంట్రవర్సీని ఎదుర్కోవడం ఎందుకు, కామ్‌గానే ఉండటం బెటర్‌ అని, చెప్పడం లేదు` అని రేణు దేశాయ్‌ తెలిపింది. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. 

45
అదిరిపోయే కాంబినేషన్‌ మిస్‌

`సర్కారు వారి పాట` చిత్రంలో నదియా బ్యాంక్‌ ఆఫీసర్‌గా కీలక పాత్రలో నటించింది. ఆమె ఒక పెద్ద ఆర్థికపరమైన కేసులో ఇరుక్కొంటుంది. పొలిటీషియన్‌ అయిన సముద్రఖని లోన్‌ తీసుకుని హ్యాండిస్తాడు. ఇది తన జాబ్‌కే ఎసరు పెడుతుంది. ఆమె జీవితాన్నే ప్రశ్నార్థకంగా మారుస్తుంది. ఈ విషయం తెలిసి మహేష్‌ బాబు ఈ కేసు ని తనదైన స్టయిల్‌లో డీల్‌ చేసి సెట్‌ చేస్తాడు. ఆమె కళ్లలో ఆనందం చూస్తాడు. నదియా కనిపించేది కాసేపే అయినా ఆమె పాత్ర సినిమాలో చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. మొత్తంగా మహేష్‌ బాబు, రేణు దేశాయ్‌ కాంబినేషన్‌లో మూవీ అలా మిస్‌ అయ్యిందని చెప్పొచ్చు. కానీ వీరిద్దరి కాంబినేషన్‌ లో సినిమా వస్తే నిజంగా అది అదిరిపోయేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

55
`పదహారు రోజుల పండగ`తో రేణు దేశాయ్‌ కమ్‌ బ్యాక్‌

ఇక రేణు దేశాయ్‌ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది. చాలా గ్యాప్‌ తర్వాత ఆమె చేసిన `టైగర్‌ నాగేశ్వరరావు` ఆడకపోవడంతో మళ్లీ కొత్త సినిమాలకు కమిట్‌ కాలేదు. ఈ క్రమంలో ఇప్పుడు మళ్లీ `పదహారు రోజుల పండగ` అనే చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో అనసూయ కూడా  నటిస్తుండటం విశేషం. ప్రముఖ నటుడు, నిర్మాత డీఎస్ రావు తనయుడు కృష్ణ దమ్మాలపాటి హీరోగా పరిచయం అవుతుండగా, దీనికి సాయికిరణ్‌ అడవి దర్శకత్వం వహిస్తున్నారు. బుధవారమే ఈ చిత్రం ప్రారంభమైంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories