గేమ్ ఛేంజర్ నుంచి హరిహర వీరమల్లు వరకు.. 2025లో ఈ 6 భారీ ఫ్లాపులకు ఏఐ చెప్పిన కారణాలు ఇవే

Published : Nov 27, 2025, 06:10 PM IST

ఈ ఏడాది భారీ ఫ్లాపులుగా నిలిచిన 6 సినిమాలు , ఆ చిత్రాల పరాజయాలకు కారణాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఈ జాబితాలో రాంచరణ్, పవన్ కళ్యాణ్, నితిన్ నటించిన సినిమాలు ఉన్నాయి. 

PREV
17
టాలీవుడ్ లో 2025 బిగ్గెస్ట్ ఫ్లాప్స్

2025 ఏడాది టాలీవుడ్ కి మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చాయి. సంక్రాంతికి వస్తున్నాం, ఓజీ, మిరాయ్ లాంటి మంచి హిట్లు పడ్డాయి. అదే సమయంలో భారీ బడ్జెట్ లో తెరకెక్కిన కొన్ని చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. గేమ్ ఛేంజర్, కన్నప్ప, హరిహర వీరమల్లు లాంటి చిత్రాలు భారీ బడ్జెట్ లో తెరకెక్కినప్పటికీ అభిమానులు నిరాశ పరిచాయి. నిర్మాతలకు భారీ నష్టాలని మిగిల్చాయి. ఈ ఏడాది ఫ్లాపైన టాప్ 6 భారీ బడ్జెట్ చిత్రాల గురించి ఇప్పుడు చూద్దాం. ఈ చిత్రాల పరాజయం గల కారణాలని ఏఐ ఈ విధంగా వివరించింది. 

27
గేమ్ ఛేంజర్ 

శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం 400 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కింది. అవుట్ డేటెడ్ స్టోరీ, స్క్రీన్ ప్లే, ఏళ్లతరబడి ప్రొడక్షన్ లోనే ఉండడం, ఆర్ఆర్ఆర్ తర్వాత రాంచరణ్ అభిమానుల అంచనాలకు తగ్గట్లుగా సినిమా లేకపోవడం ఈ మూవీ పరాజయానికి కారణాలు.

37
రాబిన్ హుడ్

వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 60 నుంచి 70 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కింది. వెంకీ కుడుముల నుంచి అభిమానులు ఆశించిన కామెడీ అందలేదు. యాక్షన్ సీన్లు బాగానే ఉన్నప్పటికీ కథ తేలిపోయింది.

47
హరిహర వీరమల్లు

ఈ సినిమా పరాజయానికి ప్రధాన కారణం ఐదేళ్లపాటు ప్రొడక్షన్ లో ఉండడమే. దాదాపు 250 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కింది. నాసిరకం విజువల్ ఎఫెక్ట్స్.. సెకండ్ హాఫ్ ఏమాత్రం ఆకట్టుకోకపోవడం ఈ మూవీ డిజాస్టర్ కి కారణాలు.

57
కన్నప్ప 

కన్నప్ప చిత్రాన్ని దాదాపు 200 కోట్ల బడ్జెట్ లో నిర్మించారు. ఈ మూవీకి ఇదే ప్రధాన సమస్య. అంత మార్కెట్ మంచు విష్ణుకి లేకపోవడంతో బడ్జెట్ రికవరీ కాలేదు.

67
తమ్ముడు

నితిన్ కి ఇది ఈ ఏడాది రెండవ ఫ్లాప్. ఈ చిత్రాన్ని కూడా 70 కోట్ల బడ్జెట్ లో నిర్మించారు. దర్శకుడు వేణు శ్రీరామ్ అవుట్ డేటెడ్ స్టోరీ, స్క్రీన్ ప్లే ఈ చిత్ర పరాజయానికి కారణాలు.

77
వార్ 2

ఇది బాలీవుడ్ చిత్రం అయినప్పటికీ ఎన్టీఆర్ కూడా ఓ హీరో కావడంతో తెలుగులో భారీ స్థాయిలో విడుదలైంది. కథ రొటీన్ గా అనిపించింది. స్పై చిత్రాలలో ఉండాల్సిన థ్రిల్ మిస్ అయింది. విజువల్ ఎఫెక్ట్స్ పై కూడా విమర్శలు వచ్చాయి. 

Read more Photos on
click me!

Recommended Stories