Andrea Jeremiah: పిసాసు 2 మూవీపై సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ కి హీరోయిన్ ఆండ్రియా జెర్మియా కీలక వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమాపై కీలక సమాచారం అందించింది..
సింగర్‌గా పలు సినిమాల్లో తన సత్తా చాటిన హీరోయిన్ ఆండ్రియా జెర్మియా.. ప్రస్తుతం నటిగా వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ఇటీవల 'మాస్క్' చిత్రంతో ప్రేక్షకులను అలరించిన ఈ భామ.. త్వరలోనే 'పిసాసు-2' చిత్రంతో పలకరించబోతోంది. ఈ మూవీ 'పిసాసు'కు సీక్వెల్‌గా తెరకెక్కడంతో.. దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఈ మూవీపై గత కొద్దిరోజులుగా పలు ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి అవేంటో చూసేద్దాం.
25
డైరెక్టర్ మిస్కిన్.. కీ రోల్ మక్కల్ సెల్వన్..
ఈ మూవీని మిస్కిన్ దర్శకత్వం వహిస్తుండగా.. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. అలాగే పిసాసు-2 మూవీని రాక్‌ఫోర్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై టి మురుగనాథం నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. పలు కారణాల వల్ల విడుదలకు నోచుకోలేదు. అందుకు కారణం ఆండ్రియా బోల్డ్‌గా నటించడం అని కూడా పలు వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
35
బోల్డ్ సీన్స్.. సెన్సార్ బోర్డు అడ్డంకులు..
ఇందులో పలు బోల్డ్ సీన్స్ ఉండటంతో.. వాటిపై సెన్సార్ బోర్డు పలు అభ్యంతరాలు పెట్టి.. అడ్డుకున్నట్టు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆండ్రియా 'పిసాసు-2' చిత్రంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మూవీలో బోల్డ్‌గా నటించానో.. లేదో.. అనేది స్పష్టం చేసింది.
'పిసాసు-2 కథ రాసినప్పుడు బోల్డ్ సన్నివేశాలు ఉన్నాయని డైరెక్టర్ మిస్కిన్ చెప్పారు. కానీ షూటింగ్ చేస్తున్నప్పుడు ఆయన ఆ సన్నివేశాలను తొలగించారు. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ ఎక్కువ. కానీ.! ఈ మూవీ మిస్కిన్ సర్‌పై నమ్మకంతో చేశాను. ఆయన పలువురు స్టార్ హీరోలతో చాలా సినిమాలు చేశారు.
55
రాశారు.. కానీ షూట్ చేయలేదు..
స్టార్ హీరోలతో సినిమాలు చేసిన దర్శకుడు మిస్కిన్.. తనను పిసాసు-2 చిత్రంలో ఓ పాత్ర చేయమని అన్నారు. ఆయన్ని నమ్మి ఇందులో నటించాను. మిస్కిన్ సర్ స్క్రిప్ట్ స్టార్టింగ్‌లో చాలానే బోల్డ్ సీన్స్ రాశారు. కానీ షూట్ చేయలేదు. పిసాసు 2లో ఎక్కువగా ఆ సీన్స్ ఉన్నాయని ఆండ్రియా పేర్కొంది. తాను నిర్మాతగా త్వరలోనే సినిమాను విడుదల చేయిస్తానని చెప్పింది.