ప్రభాస్‌కి బాగా నచ్చిన మాస్‌ సాంగ్‌, ఏ హీరో సినిమాదో తెలిస్తే మతిపోవాల్సిందే, కృష్ణంరాజు కాదు

Published : Dec 21, 2024, 06:25 PM IST

ప్రభాస్‌ కి ఇష్టమైన హీరో, ముఖ్యంగా తనకు నచ్చిన మాస్‌ సాంగ్‌ ఏంటి అనేది పంచుకున్నారు. ఇంట్రెస్టింగ్‌ విషయాన్ని ఆయన రివీల్‌ చేశాడు.   

PREV
15
ప్రభాస్‌కి బాగా నచ్చిన మాస్‌ సాంగ్‌, ఏ హీరో సినిమాదో తెలిస్తే మతిపోవాల్సిందే, కృష్ణంరాజు కాదు

ప్రభాస్‌ ప్రస్తుతం గ్లోబల్ స్టార్‌ ఇమేజ్‌తో రాణిస్తున్నారు. ఆయన్ని మించిన స్టార్‌ లేరంటే అతిశయోక్తి కాదు. ప్రభాస్‌ ఫ్లాప్‌ సినిమాలు కూడా రెండు మూడు వందల కోట్ల కలెక్షన్లు రాబడుతున్నాయంటే ఆయన రేంజ్‌ ఏంటో అర్థమవుతుంది. ప్రభాస్‌ చాలా వరకు ఇంట్రోవర్ట్. ఆయన ఫాలోయింగ్‌, ఇమేజ్‌, క్రేజ్‌ ఒక రేంజ్‌లో ఉండగా, తాను మాత్రం సిగ్గుపడుతూ ఉంటాడు, పది మందిలో మాట్లాడటానికి ఇబ్బంది పడుతుంటారు. తాను స్పీచ్‌ ఇవ్వలేనని, సినిమాలతో ఎంటర్టైన్‌ చేస్తానని చెబుతుంటారు. 

25

ఇదిలా ఉంటే ఆయన తనకిష్టమైన విషయాన్ని పంచుకున్నారు. డార్లింగ్‌ బెస్ట్ డాన్సర్‌ కాదు. ఒకప్పుడు బాగానే డాన్స్ చేశాడు. కానీ ఇప్పుడు చేయలేకపోతున్నాడు. కాలు నొప్పి కారణంగా ఆయన డాన్సులు చేయలేకపోతున్నాడు. ఎలాగోలా మ్యానేజ్‌ చేస్తున్నారు. అయితే తనకు మాత్రం మాస్‌ సాంగ్స్ ఇష్టమట. తనకు బాగా నచ్చిన మాస్‌ సాంగ్‌ ఏది అని అడిగితే డార్లింగ్‌ చెప్పిన సమాధానం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 

35

డాన్సుల్లో చిరంజీవికి వీరాభిమానిని అని తెలిపారు ప్రభాస్. ఆయన నటించిన చిత్రాల్లోని ఓ పాట గురించి తెలిపారు. `రౌడీ అల్లుడు` సినిమాలో `అమలాపురం బుల్లోడా` సాంగ్‌ అంటే తనకు బాగా ఇష్టమని తెలిపారు డార్లింగ్‌. ఈ మాస్‌ సాంగ్‌కి తాను పెద్ద ఫ్యాన్‌ని అని తెలిపారు. రాఘవేంద్రరావు టాక్‌ షోలో ఆయన ఈ విషయాన్ని పంచుకున్నారు. ఈ ఈవెంట్‌లో రాజమౌళి కూడా ఉండటం విశేషం. 
 

45

కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన `రౌడీ అల్లుడు` మూవీ 1991లో విడుదలైంది. ఇందులో శోభన, దివ్య భారతి హీరోయిన్లుగా నటించారు. సినిమా పెద్ద హిట్‌ అయ్యింది. అప్పట్లో చిరంజీవికి బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌గానూ నిలిచింది. ఇక ఈ పాటలో చిరంజీవికి జోడీగా డిస్కో శాంతి డాన్స్ చేయడం విశేషం. ఇదొక ఐటెమ్‌ నెంబర్‌. అప్పట్లో మాస్‌ ఆడియెన్స్ ని ఉర్రూతలూగించిన సాంగ్‌గా దీన్ని చెబుతుంటారు. ఇది ప్రభాస్‌ ఫేవరేట్‌ సాంగ్‌ కావడం విశేషం. 
 

55

ప్రభాస్‌ ఈ ఏడాది `కల్కి 2898 ఏడీ` చిత్రంతో వచ్చాడు. ఈ మూవీ సుమారు 1200కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం ఆయన `ది రాజాసాబ్‌` చిత్రంలో నటిస్తున్నారు. ఫస్ట్ టైమ్‌ ఆయన చేస్తున్న హార్రర్‌ మూవీ ఇది. హర్రర్‌ కామెడీగా తెరకెక్కుతుంది. ఇందులో వింటేజ్‌ ప్రభాస్‌ని చూపించబోతున్నాడట దర్శకుడు మారుతి. ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల కానుంది.

దీంతోపాటు హను రాఘవపూడి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు ప్రభాస్‌. `ఫౌజీ` అనే పేరు దీనికి వినిపిస్తుంది. ఇవి కాకుండా ప్రభాస్‌ చేయాల్సిన చిత్రాల లిస్ట్ లో `సలార్‌ 2`, `కల్కి 2`, `స్పిరిట్‌` చిత్రాలున్నాయి. అలాగే లోకేష్‌ కనగరాజ్‌, ఓం రౌత్‌, ప్రశాంత్‌ వర్మ వంటి దర్శకుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. 

read more: తమన్నాకి ఇష్టమైన ఫుడ్‌ ఏంటో తెలుసా? వాటి కోసం అబ్బాయిలను తోసుకుంటూ, ఒంటరిగా కూర్చొని కుమ్ముడే

also read: బెనిఫిట్‌ షోలు, టికెట్‌ రేట్లు పెంచుకోవడం రద్దు, సీఎం సంచలన నిర్ణయం.. `గేమ్‌ ఛేంజర్‌`కి గట్టి దెబ్బ
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories